వీసాల జారీలో జోరు పెంచిన అమెరికా

మనదేశం నుంచి అమెరికా వెళ్లే భారత పౌరులకు వీసాల మంజూరులో ఏర్పడుతున్న ఇబ్బందుల తొలగింపునకు అమెరికా నడుంబిగించింది.

Updated : 23 Jan 2023 06:00 IST

శనివారం హైదరాబాద్‌లో 500 జారీ

ఈనాడు, హైదరాబాద్‌ : మనదేశం నుంచి అమెరికా వెళ్లే భారత పౌరులకు వీసాల మంజూరులో ఏర్పడుతున్న ఇబ్బందుల తొలగింపునకు అమెరికా నడుంబిగించింది. ఈ క్రమంలో తొలిసారి ప్రత్యేక శనివారం ఇంటర్వ్యూ డేస్‌ పేరిట చేపట్టిన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ పరిధిలో 500 వీసాలు జారీ చేశారు. అదేవిధంగా దిల్లీలోని ఆదేశ రాయబార కార్యాలయం, ముంబయి, చెన్నై, కోల్‌కతాల్లోని కాన్సులేట్ల పరిధిలో పెద్ద ఎత్తున వీసాల మంజూరు జరిగింది. వచ్చే కొద్ది నెలలపాటు ఎంపిక చేసిన శనివారాల్లో ఈ అదనపు స్లాట్ల విడుదలను కొనసాగించనున్నారు. వీసాల జారీ ప్రక్రియను పెంచేందుకు ఈ నెల నుంచి మార్చి వరకు పెద్దఎత్తున తాత్కాలిక కాన్సులర్‌ అధికారులు భారత్‌కు చేరుకోనున్నారు. మరోపక్క దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం సహా మిగిలిన కాన్సులేట్లలోనూ మరింతమంది శాశ్వత కాన్సులర్‌ అధికారుల నియామకానికి అమెరికా విదేశాంగశాఖ చర్యలు చేపట్టింది. మొత్తంమీద భారత్‌లో అమెరికా 2.5 లక్షల బీ1, బీ2 అదనపు ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లను విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని