భూకంప మృతులు 12 మంది

భూకంపం ప్రభావానికి పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌లలో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అఫ్గాన్‌లోని హిందు-ఖుష్‌ ప్రాంతం కేంద్రంగా మంగళవారం రాత్రి సంభవించిన భూకంపం ప్రభావం ఆ దేశంతో పాటు పాకిస్థాన్‌, భారత్‌లపైనా కనిపించిన విషయం తెలిసిందే.

Updated : 23 Mar 2023 03:58 IST

పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌లలో ప్రాణనష్టం

ఇస్లామాబాద్‌: భూకంపం ప్రభావానికి పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌లలో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అఫ్గాన్‌లోని హిందు-ఖుష్‌ ప్రాంతం కేంద్రంగా మంగళవారం రాత్రి సంభవించిన భూకంపం ప్రభావం ఆ దేశంతో పాటు పాకిస్థాన్‌, భారత్‌లపైనా కనిపించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లో లాహోర్‌, ఇస్లామాబాద్‌, రావల్పిండి, క్వెట్టా, పెషావర్‌, సియాల్‌కోట్‌, గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ ప్రాంతాల్లో పలు భవనాలు దెబ్బతిన్నాయి. భయకంపితులైన ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. అఫ్గాన్‌ను ఆనుకుని ఉన్న ఖైబర్‌-పఖ్తుంఖ్వా ప్రాంతంలోనే 9 మంది చనిపోయారు. భూకంపం వచ్చాక గుండె ఆగిపోయి అఫ్గాన్‌లో ముగ్గురు మరణించారు.  


దిల్లీ, హిమాచల్‌లలో కంపించిన భూమి

శిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ కేంద్రంగా బుధవారం తెల్లవారుజామున 2.8 తీవ్రతతో భూమి కంపించింది. ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అఫ్గాన్‌ భూకంప తీవ్రతకు మంగళవారం రాత్రి కూడా హిమాచల్‌లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు తలెత్తాయి. 24 గంటల్లో దేశంలో పలు ప్రాంతాల్లో 2 నుంచి 3 తీవ్రతతో స్వల్పస్థాయి ప్రకంపనలు 10 వరకు తలెత్తాయి. దిల్లీలో బుధవారం సాయంత్రం 2.7 తీవ్రతతో భూమి కంపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని