Girl Friend on rent: అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌.. ఏజెన్సీలను ఆశ్రయిస్తున్న యువకులు

చైనాలో కొన్ని ఏజెన్సీలు అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. అక్కడి యువకులు వివాహాలు ఆలస్యంగా చేసుకుంటున్నారు.

Published : 23 Mar 2023 07:14 IST

బీజింగ్‌: చైనాలో కొన్ని ఏజెన్సీలు అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. అక్కడి యువకులు వివాహాలు ఆలస్యంగా చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు వివాహ సంబంధాలపై తీవ్రంగా ఒత్తిడి తీసుకువస్తుండటంతో ఈ ఏజెన్సీలను ఆశ్రయించే యువకుల సంఖ్య పెరిగింది. వారు అక్కడి అమ్మాయిలను తీసుకువచ్చి తమ గర్ల్‌ఫ్రెండ్స్‌గా తల్లిదండ్రులకు పరిచయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వార్తా సంస్థ విలేకరి స్టింగ్‌ ఆపరేషన్‌తో ఈ ఉదంతం బయటకు వచ్చింది. ఒక్కో యువతి గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండేందుకు రోజుకు దాదాపు 1000 యువాన్లు (145 డాలర్లు) తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వేలమంది యువతులు ఉద్యోగం చేస్తూనే దీన్ని పార్ట్‌టైమ్‌ పనిగా  ఎంచుకుంటున్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని