ఇది బుల్డోజర్‌ కాదు.. సైకిల్‌

జర్మనీలోని డుసెల్డోర్ఫ్‌లో ఇటీవల నిర్వహించిన ‘సైక్లింగ్‌ వరల్డ్‌ బైక్‌ షో’లో ‘క్లైన్‌ జొహన్నా’ అనే సైకిల్‌ సందర్శకులను విశేషంగా ఆకర్షించింది.

Published : 30 Mar 2023 06:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జర్మనీలోని డుసెల్డోర్ఫ్‌లో ఇటీవల నిర్వహించిన ‘సైక్లింగ్‌ వరల్డ్‌ బైక్‌ షో’లో ‘క్లైన్‌ జొహన్నా’ అనే సైకిల్‌ సందర్శకులను విశేషంగా ఆకర్షించింది. 2,177 కిలోల బరువుతో బుల్డోజర్‌ పరిమాణంలో ఉన్న దీన్ని తుక్కు దుకాణం నుంచి తెచ్చిన వస్తువులతో తయారు చేశారు. ఈ సైకిల్‌ 5 మీటర్ల పొడవు, 2 మీటర్ల ఎత్తు ఉంది. ముందు, వెనుక వైపు కలిసి రెండు భారీ టైర్లు, మధ్యలో ఒక మీడియం టైరును అమర్చారు. సైకిల్‌ సులువుగా కదిలేందుకు ఒక ట్రక్‌ గేర్‌ బాక్సును, సాధారణ గేర్‌ సైకిల్‌ వ్యవస్థతో అనుసంధానం చేశారు. ముందుకు కదపాలంటే 35 గేర్లు, వెనక్కి మళ్లాలంటే 7 గేర్లు ఉపయోగించాలి. దీనికి 15 టన్నుల్లోపు బరువైన వాహనాలను కట్టినా సునాయాసంగా లాగవచ్చని దీని రూపకర్త సెబాస్టియన్‌ తెలిపాడు. ఈ సైకిల్‌కు లోపల ఓ ఇంజిన్‌ కూడా ఉంది. అది ఆల్టర్నేటర్‌ తిరగడానికి మాత్రమే సహాయం చేస్తుంది. ఈ సైకిల్‌పై బాల్టిక్‌ సముద్రం వరకు 389 కిలోమీటర్ల ప్రయాణానికి సెబాస్టియన్‌ సిద్ధమవుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని