కీలక పత్రాలు తీసుకుపోయిన ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది! రహస్య పత్రాల కేసులో శుక్రవారం ఆయనపై నేరాభియోగాలు నమోదయ్యాయి.
వాటిలో పెంటగాన్ ప్రణాళికలు, విదేశీ అణు సామర్థ్యం వివరాలు
రహస్య పత్రాల కేసులో ఫెడరల్ నేరాభియోగాలు
మయామీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది! రహస్య పత్రాల కేసులో శుక్రవారం ఆయనపై నేరాభియోగాలు నమోదయ్యాయి. పెంటగాన్ దాడుల ప్రణాళికలు, సైనిక చర్యకు సంబంధించిన రహస్య పటం, విదేశాల అణు సామ ర్థ్యాల సమాచారాన్ని ఆయన తన నివాసానికి తీసుకువెళ్లిపోయారని అభియోగాల్లో ఉంది. అమెరికా చరిత్రలో ఇలా ఫెడరల్ ప్రభుత్వ అభియోగాలు నమోదైన తొలి మాజీ అధ్యక్షుడు ఈయనే. నేరాభియోగాల దాఖలు విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఈ కేసులో మంగళవారం (జూన్ 13) మయామిలోని ఫెడరల్ కోర్టు హౌజ్‌లో హాజరు కావాల్సిందిగా తనకు సమన్లు అందినట్లు తెలిపారు. ఇందులో ట్రంప్ దోషిగా తేలితే దీర్ఘకాలంపాటు జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. గతంలో అశ్లీల చిత్రాల నటి స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లింపుల కేసులో ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే.
కట్టలకొద్దీ పత్రాలు
ట్రంప్ 2021 జనవరిలో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ప్రభుత్వానికి చెందిన దాదాపు 300 రహస్య పత్రాలను ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో ఎస్టేట్‌కు తరలించినట్లు ఆరోపణలొచ్చాయి. శ్వేతసౌధాన్ని ఖాళీ చేసేందుకు తక్కువ సమయం ఇవ్వడంతో- హడావుడిలో ఆ పత్రాలను తమ వెంట తీసుకెళ్లి ఉండొచ్చని గతంలో ట్రంప్ కార్యాలయం తెలిపింది. అయితే, వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ప్రయత్నించగా.. ట్రంప్ అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే గతేడాది జనవరిలో ఎఫ్‌బీఐ అధికారులు ట్రంప్
ఎస్టేట్‌లో సోదాలు చేపట్టగా.. 15 పెట్టెల్లో 184 కీలక పత్రాలు లభించాయి. అనంతరం ఆగస్టులోనూ ఎఫ్‌బీఐ మరోసారి ఆ ఎస్టేట్‌పై దాడి చేసి 20 పెట్టెల నిండా పత్రాలను తరలించింది. జాతీయ రక్షణ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా అట్టిపెట్టుకోవడం, అధికారులను అడ్డుకోవడం, కుట్ర, అసత్య వాంగ్మూలాల వంటి నేరాభియోగాలను ట్రంప్‌పై ప్రస్తుతం మోపినట్లు తెలుస్తోంది.
నేను అమాయకుడిని: ట్రంప్
అభియోగాల నమోదు నేపథ్యంలో ట్రంప్ ఓ వీడియో ద్వారా స్పందించారు. తాను అమాయకుడినని పేర్కొన్నారు. ఎన్నికల్లో తనను అడ్డుకునేందుకు డెమోక్రాట్లు కుట్రపూరితంగా అభియోగాలు నమోదయ్యేలా చేశారని ఆరోపించారు. వచ్చేఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని దక్కించుకునే ప్రక్రియలో ట్రంప్ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. తాజా అభియోగాల నేపథ్యంలో ఆయన నామినేషన్ అవకాశాలకు గండిపడే అవకాశాలున్నాయని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. .
* రహస్య పత్రాలకు సంబంధించి ట్రంప్‌పై కేసు విచారణను ప్రాథమికంగా అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి ఎయిలీన్ క్యానన్ చేపట్టనున్నారు. ఇది మాజీ అధ్యక్షుడికి సానుకూలాంశమేనని పలువురు భావిస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే క్యానన్‌ను జడ్జిగా నియమించారు. మాజీ అధ్యక్షుడి ఎస్టేట్‌లో స్వాధీనం చేసుకున్న రహస్య పత్రాలపై స్వతంత్ర సమీక్ష జరిపించాలంటూ ఆయన లీగల్ బృందం నిరుడు చేసిన వినతిని క్యానన్ అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Hyderabad: ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు సోహన్‌సింగ్ జోషి మృతి
-
Chandrababu Arrest: చంద్రబాబుకు మద్దతుగా కూకట్‌పల్లిలో నిరసనలు
-
Missing Children: తొమ్మిదేళ్లలో 4.46 లక్షల చిన్నారుల ఆచూకీ లభ్యం: స్మృతీ ఇరానీ
-
Hyderabad: తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్న సింటెక్స్ సంస్థ