Weight Loss: బరువు తగ్గేందుకు వెళితే ప్రాణమే పోయింది

ఊబకాయంతో బాధపడుతున్న ఓ చైనా యువతి బరువు తగ్గాలని అతిగా కసరత్తులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వైనమిది. 156 కిలోల బరువున్న కుయ్‌హువా (21) అనే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ 90 కిలోల బరువు తగ్గే లక్ష్యంతో షాంగ్జీ ప్రావిన్స్‌లోని ఓ వెయిట్‌లాస్‌ క్యాంపులో చేరింది.

Updated : 19 Jun 2023 07:49 IST

ఊబకాయంతో బాధపడుతున్న ఓ చైనా యువతి బరువు తగ్గాలని అతిగా కసరత్తులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వైనమిది. 156 కిలోల బరువున్న కుయ్‌హువా (21) అనే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ 90 కిలోల బరువు తగ్గే లక్ష్యంతో షాంగ్జీ ప్రావిన్స్‌లోని ఓ వెయిట్‌లాస్‌ క్యాంపులో చేరింది. మొదటి ప్రయత్నంలో 27 కిలోల బరువు కూడా తగ్గింది. విపరీతంగా కసరత్తులు చేయడంతోపాటు తగినంత ఆహారం తీసుకోకపోవడం ఆమె పాలిట శాపాలుగా మారాయి. అతిగా వర్కౌట్లు చేసిన కుయ్‌హువా ఇటీవల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించింది. సుమారు పదివేల మంది ఫాలోవర్లు ఉన్న కుయ్‌హువా అకాలమరణం అభిమానులను కలచివేసింది. చైనా సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర చర్చలకు దారి తీసింది. అతివేగంగా బరువు తగ్గడం గుండె మీద ప్రభావం చూపుతుందని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. కుయ్‌హువా కుటుంబసభ్యులకు వెయిట్‌లాస్‌ క్యాంప్‌ నిర్వాహకులు పరిహారం చెల్లించినట్లు కొన్ని వార్తాసంస్థలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని