Pakistan: దేశం వీడుతున్నా పీడిస్తున్న పాక్‌

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్‌ కొత్త ఆదాయమార్గాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది.

Updated : 26 Nov 2023 08:22 IST

అఫ్గాన్‌ శరణార్థుల నుంచి 830 డాలర్ల వసూలు

ఇస్లామాబాద్‌: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్‌ కొత్త ఆదాయమార్గాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. పాక్‌(Pakistan)ను వీడుతున్న అఫ్గానిస్థాన్‌ శరణార్థుల నుంచి ఎగ్జిట్‌ ఛార్జీలను వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. 2021లో అఫ్గానిస్థాన్‌లో పౌర ప్రభుత్వాన్ని కూలదోసి, తాలిబన్లు అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో అఫ్గాన్‌ వాసులు పలు దేశాలకు శరణార్థులుగా వలస వెళ్లారు. వీరిలో దాదాపు 21.3 లక్షల మంది పాక్‌కు వెళ్లారు. అనుమతులు లేకుండా పాకిస్థాన్‌లో నివసిస్తోన్న అఫ్గానీయులను వారి స్వదేశానికి పంపించేస్తున్న విషయం తెలిసిందే. నవంబరు 1 నాటికే దేశం విడిచిపోవాలని ఆదేశించిన పాక్‌.. ఇంకా ఇక్కడే ఉన్నవారిపై చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో పునరావాస పథకాల ద్వారా పాశ్చాత్య దేశాలకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న వారు పాక్‌ను వీడేందుకు 830 డాలర్లు(రూ.69వేలు) చెల్లించేలా విధానాన్ని తీసుకొచ్చింది. ఒక్కో వ్యక్తి ఈ మొత్తాన్ని కట్టాల్సి ఉంటుంది. ఈ చర్యను పలు దేశాలు ఖండిస్తున్నాయి. తమ విధానాన్ని మార్చుకునే ఉద్దేశం లేదని పాక్‌ విదేశాంగ వెల్లడించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని