రంజాన్‌కు కాల్పుల విరమణ లేనట్లే

గాజాలో కాల్పుల విరమణ కోసం రెండువైపుల నుంచి వచ్చిన డిమాండ్లను ఇరుపక్షాలు పరస్పరం అంగీకరించలేదు.

Published : 27 Mar 2024 04:12 IST

డిమాండ్లకు అంగీకరించని ఇరుపక్షాలు

జెరూసలెం: గాజాలో కాల్పుల విరమణ కోసం రెండువైపుల నుంచి వచ్చిన డిమాండ్లను ఇరుపక్షాలు పరస్పరం అంగీకరించలేదు. దీంతో రంజాన్‌ మాసంలో కాల్పుల విరమణ కోసం ప్రపంచ దేశాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తొలుత ఇజ్రాయెల్‌ డిమాండ్లను హమాస్‌ అంగీకరించలేదు. ఆ తర్వాత ఇజ్రాయెల్‌ సమ్మతించలేదు. హమాస్‌ డిమాండ్లకు అంగీకరించడంలేదని మంగళవారం ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కార్యాలయం విడుదల చేసిన ప్రకటన స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలకు హమాస్‌ పెద్దగా ఆసక్తి చూపడం లేదని పేర్కొంది. ఇది భద్రతా మండలి నిర్ణయానికి పెద్ద దెబ్బని వ్యాఖ్యానించింది. అంతకుముందు యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయాల్సిందేనని, గాజా నుంచి ఇజ్రాయెల్‌ వెనక్కి వెళ్లాల్సిందేనని, అప్పటివరకూ కాల్పుల విరమణకు అంగీకరించేది లేదని మధ్యవర్తులకు హమాస్‌ స్పష్టంచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని