న్యూజిలాండ్‌ పార్లమెంట్‌పై చైనా హ్యాకర్ల ఆపరేషన్‌!

తమ పార్లమెంటే లక్ష్యంగా చైనా ప్రభుత్వంతో సంబంధం ఉన్న హ్యాకర్లు 2021లో రహస్య ఆపరేషన్‌ చేపట్టారని న్యూజిలాండ్‌ ఆరోపించింది.

Published : 27 Mar 2024 04:13 IST

వెల్లింగ్టన్‌: తమ పార్లమెంటే లక్ష్యంగా చైనా ప్రభుత్వంతో సంబంధం ఉన్న హ్యాకర్లు 2021లో రహస్య ఆపరేషన్‌ చేపట్టారని న్యూజిలాండ్‌ ఆరోపించింది. చైనాలో నివసిస్తున్న హ్యాకర్లు తమ దేశంలోని ప్రముఖులే లక్ష్యంగా పని చేస్తున్నారని అమెరికా ఆరోపించిన మరుసటి రోజే న్యూజిలాండ్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇలాంటి చర్యలు ఏ మాత్రం ఆమోద యోగ్యం కాదని.. న్యూజిలాండ్‌ రక్షణ మంత్రి జుడిత్‌ కాలిన్స్‌ పేర్కొన్నారు. ‘విదేశీ వ్యవహారాల్లో తలదూర్చడం సమంజసం కాదు. భవిష్యత్తులో ఇటువంటి కార్యకలాపాలను మానుకోవాలని చైనా రాయబారికి తెలియజేశాం’ అని విదేశాంగ మంత్రి విన్‌స్టన్‌ పీటర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని