Israel Hamas: హూతీల వద్ద హైపర్‌సోనిక్‌ క్షిపణులు..!

హూతీ తిరుగుబాటుదారుల వద్ద హైపర్‌సోనిక్‌ క్షిపణులూ ఉన్నాయంటూ రష్యా అధికార మీడియా పేర్కొంది.

Published : 14 Mar 2024 22:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాణిజ్య నౌకలే లక్ష్యంగా యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు (Houthi Rebels) దాడులకు తెగబడుతున్నారు. వారివద్ద అత్యాధునిక హైపర్‌సోనిక్‌ క్షిపణులూ (Hypersonic Missile) ఉన్నాయంటూ రష్యా అధికారిక మీడియా తాజాగా పేర్కొంది. శత్రువులు ఊహించని ఆయుధాలు తమవద్ద ఉన్నాయంటూ హూతీలు ప్రకటనలు చేస్తోన్న వేళ.. ఈ కథనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దాడుల తీవ్రత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

‘‘హూతీల క్షిపణి బలగాలు ఇటీవల ‘మాక్‌ 8’ వేగానికి చేరుకోగల మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించాయి. ఎర్ర సముద్రం, గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌లో నౌకలతోపాటు ఇజ్రాయెల్‌లోని లక్ష్యాలపై దాడులకు గానూ వాటి తయారీని ప్రారంభించాలని భావిస్తున్నాయి’’ అని సదరు వర్గాలతో సంబంధం ఉన్న ఓ సైనికాధికారిని ఉటంకిస్తూ రష్యా వార్తా సంస్థ తెలిపింది.

అవి అణు బెదిరింపులు కావు.. అమెరికా వక్రీకరించింది: క్రెమ్లిన్‌

‘మాక్ 8’ అంటే.. ధ్వని వేగానికి ఎనిమిది రెట్లు ఎక్కువ వేగం. ‘మాక్‌ 5’కు మించి దూసుకెళ్లే క్షిపణులను అడ్డుకోవడం గగనతల రక్షణ వ్యవస్థలకు సవాలుగా మారుతుంది. తిరుగుబాటుదారులకు అండగా నిలుస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాన్‌.. తమవద్ద హైపర్‌సోనిక్‌ క్షిపణులు ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించింది. హూతీలు ప్రస్తుతం దాడులకు ఉపయోగిస్తోన్న ఆయుధాలు ఈ దేశమే సమకూర్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే వీటిని ఇరాన్‌ ఖండిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు