Imran Khan: ఒకే ఒక్కడు.. ఏకంగా 33 స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ పోటీ
పాకిస్థాన్ ఉప ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఏకంగా 33 స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. సంకీర్ణ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే పీటీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
లాహోర్: పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగబోయే జాతీయ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆయన ఒక్కరే 33 స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం జరిగిన పాకిస్థాన్ తెహ్రీక్ - ఇ- ఇన్సాఫ్ (పీటీఐ) కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ వైస్ ఛైర్మన్ షా మహ్మద్ ఖురేషీ వెల్లడించారు.
ఉప ఎన్నికలు జరిగే మొత్తం 33 పార్లమెంటరీ స్థానాలన్నింటి నుంచి పీటీఐ తరఫున ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఒక్కరే పోటీ చేయనున్నట్లు ఖురేషీ తెలిపారు. ముందస్తు ఎన్నికల విషయంలో అధికార పార్టీపై మరింత ఒత్తిడి పెంచేందుకే పీటీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ స్థానాలకు మార్చి 16న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ ఎన్నికల సంఘం గత శుక్రవారం వెల్లడించింది. ఇందులో పంజాబ్ ప్రావిన్స్‌లో 12, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 8, ఇస్లామాబాద్‌లో 3, సింధ్‌లో 9, బలోచిస్థాన్‌లో ఒక స్థానానికి ఈ ఎన్నికలు (Elections) జరగనున్నాయి.
గతేడాది ఏప్రిల్‌లో జరిగిన అవిశ్వాస పరీక్షలో ఓటమి తర్వాత నేషనల్ అసెంబ్లీ సభ్యులు రాజీనామా చేయాలని పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ తమ పార్టీ ఎంపీలకు సూచించారు. అందుకు అనుగుణంగానే పీటీఐ నేతలు రాజీనామా చేశారు. అయితే, ఈ రాజీనామాలను జాతీయ అసెంబ్లీ స్పీకర్ ఒకేసారి ఆమోదించలేదు. వ్యక్తిగతంగా పరిశీలించాల్సి ఉందన్న కారణంతో దశల వారీగా రాజీనామాలను ఆమోదిస్తున్నారు. తాజాగా 33 మంది రాజీనామాలను అంగీకరించగా.. ఆ స్థానాలకు ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.
మిగతా పీటీఐ (PTI) సభ్యుల రాజీనామాలను కూడా అంగీకరిస్తే.. జాతీయ అసెంబ్లీ నుంచి ఇమ్రాన్ ఖాన్ పార్టీ పూర్తిగా వైదొలిగినట్లవుతుంది. కాగా.. పాక్ ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టుతో ముగియనుంది. అక్కడి నుంచి 90 రోజుల్లోగా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, అంతకు ముందుగానే ఎన్నికలను నిర్వహించాలని ఇమ్రాన్ ఖాన్ పార్టీ (పీటీఐ) పట్టుబడుతోంది.
ఇదిలా ఉండగా.. ఇమ్రాన్ ఖాన్ ఇలా ఒకేసారి ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది అక్టోబరులో జరిగిన జాతీయ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ 7 స్థానాల్లో పోటీ చేసి ఆరు చోట్ల విజయం సాధించారు. కాగా.. పాకిస్థాన్ ఎన్నికల్లో ఒక వ్యక్తి ఎన్ని చోట్ల నుంచైనా పోటీ చేయవచ్చు. అయితే, ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే మాత్రం ఏ స్థానాలను వదులుకుంటారో ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
YouTube: యూట్యూబ్ వీడియోలు లైక్ చేస్తే నగదు.. వెలుగులోకి నయా సైబర్ మోసం!
-
Sports News
Virat Kohli: విరాట్ కొత్త టాటూ.. అర్థమేంటో చెప్పేసిన టాటూ ఆర్టిస్ట్
-
Movies News
Telugu Movies: ఈ ఏప్రిల్‌లో ప్రతివారం థియేటర్లో సందడే సందడి
-
Crime News
Hyderabad: డేటా చోరీ కేసులో ప్రముఖ సంస్థలకు నోటీసులు
-
Movies News
Social Look: పూజాహెగ్డే ‘వర్కౌట్ గ్లో’.. ఊటీలో నోరా సందడి
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు