Ukraine Crisis: ఉక్రెయిన్‌కు అమెరికా యుద్ధ విమానాలు.. తోసిపుచ్చిన బైడెన్‌!

ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలు అందజేయమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. తమ గగనతలాన్ని కాపాడుకునేందుకు యుద్ధ విమానాలను అందజేయాలని ఉక్రెయిన్‌ చాలా కాలంగా మిత్ర దేశాలను కోరుతోన్న విషయం తెలిసిందే.

Published : 01 Feb 2023 01:49 IST

వాషింగ్టన్‌: రష్యా(Russia)ను ఎదుర్కొనేందుకు యుద్ధ విమానాలు(Fighter Jets) అందజేయాలని పాశ్చాత్య దేశాలకు ఉక్రెయిన్‌(Ukraine) పదేపదే విజ్ఞప్తి చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఆ దేశానికి ఎఫ్‌-16, ఇతర యుద్ధ విమానాలు పంపే అవకాశాలను అమెరికా(America) అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden) తాజాగా కొట్టిపారేశారు. అమెరికా యుద్ధ విమానాలను అందజేస్తుందా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బైడెన్‌ స్పందిస్తూ.. ‘లేదు’ అని సమాధానం ఇచ్చారు. జర్మనీ(Germany) సైతం తమ ఫైటర్‌ జెట్‌లను అందజేసే అంశాన్ని ఇప్పటికే తోసిపుచ్చింది.

రష్యాతో యుద్ధం కొనసాగుతోన్న వేళ.. తమ గగనతలాన్ని రక్షించుకునేందుకు అత్యాధునిక యుద్ధ విమానాలను అందజేయాలని ఉక్రెయిన్‌ చాలా కాలంగా మిత్ర దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది. అయితే, వాటి సరఫరాతో యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందని అమెరికా తదితర దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధ విమానాల సరఫరా విషయంలో వెనకడుగేస్తున్నాయి. కానీ.. యుద్ధ ట్యాంకులు పంపేందుకు ఇటీవల ముందుకొచ్చాయి. 31 అబ్రామ్‌ యుద్ధ ట్యాంకులను సరఫరా చేస్తామని అమెరికా, లెపర్డ్‌‌-2 ట్యాంకులను అందజేస్తామని జర్మనీలు ఇటీవలే ప్రకటించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని