Maldives: భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. ముగ్గురు మాల్దీవుల మంత్రులపై వేటు!

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన లక్షద్వీప్‌ పర్యటనను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసింది.

Updated : 11 Jan 2024 14:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఇటీవలి లక్షద్వీప్‌ పర్యటనపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిపై భారత్‌తోపాటు అంతర్జాతీయంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన మాల్దీవుల (Maldives) ప్రభుత్వం.. ముగ్గురు మంత్రులపై వేటు వేసింది. సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెట్టిన వారిని పదవి నుంచి తప్పించినట్లు మాల్దీవుల విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, ఎవరిపై చర్యలు తీసుకున్నారనేది మాత్రం వెల్లడించలేదు. మాల్దీవుల స్థానిక మీడియా ప్రకారం, మరియం షియునా, మాల్షాతోపాటు మరో మంత్రి హసన్‌ జిహాన్‌లను మంత్రి పదవుల నుంచి తప్పించినట్లు సమాచారం.

లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ పర్యటన.. అక్కసు వెళ్లగక్కిన మాల్దీవులు ఎంపీ

భారత్‌తోపాటు మోదీని ఉద్దేశిస్తూ మాల్దీవుల్లో అధికార పార్టీ నేతలు వ్యాఖ్యలు చేయడంపై అక్కడి విదేశాంగ శాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని.. ప్రభుత్వంతో సంబంధం లేదని పేర్కొంది. మంత్రులు అటువంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ముగ్గురు మంత్రులను తొలగించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు