- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Mount Everest: అంతటి ఎవరెస్టు.. ఆయన ముందు దిగదుడుపే!
26 సార్లు అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన నేపాలీ షెర్పా
ఖాఠ్మండూ: హిమాలయాలను అధిరోహించడం సవాళ్లతో కూడుకున్న విషయం. అందులోనూ.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ‘మౌంట్ ఎవరెస్ట్’ను ఎక్కడమంటే ప్రాణాలకు తెగించినట్లే! అలాంటి శిఖరాన్ని ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 26 సార్లు పాదాక్రాంతం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించారు నేపాల్‌కు చెందిన కామీ రీటా షెర్పా. ఈ క్రమంలో ఏడాది క్రితం నెలకొల్పిన తన రికార్డును తానే బద్దలుకొట్టడం గమనార్హం. నేపాల్ పర్యాటక శాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. 52 ఏళ్ల కామీ తాజాగా శనివారం మరోసారి ఎవరెస్టును ఎక్కి.. ఈ సరికొత్త రికార్డు నెలకొల్పారు. సంప్రదాయ ఆగ్నేయ మార్గంలో 10 మంది ఇతర అధిరోహకులకూ ఆయన నాయకత్వం వహించారు. కామీ రీటా తన రికార్డును తానే అధిగమించి.. సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పినట్లు కాఠ్మండూలోని పర్యాటకశాఖ డైరెక్టర్ జనరల్ తారానాథ్ అధికారి తెలిపారు.
ఈ శిఖరాగ్రానికి చేరుకునేందుకు.. కామీ రీటా ఎంచుకున్న మార్గం 1953లో న్యూజిలాండ్‌కు చెందిన సర్ ఎడ్మండ్ హిల్లరీ, నేపాల్‌కు చెందిన షెర్పా టెన్సింగ్ నార్కే ప్రారంభించారు. ఎవరెస్టును ఎక్కిన మొదటి వ్యక్తులుగా ఈ ఇద్దరికి గుర్తింపు ఉంది. కాలక్రమంలో.. ఈ మార్గం అత్యంత ఆదరణ పొందింది. ఇదిలా ఉండగా.. నేపాల్ ప్రభుత్వం ఈ ఏడాది ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు 316 అనుమతులు జారీ చేసింది. మే వరకు ఈ సీజన్ కొనసాగనుంది. గత ఏడాది రికార్డు స్థాయిలో 408 పర్మిట్లు ఇచ్చింది. విదేశీ మారక ద్రవ్యం కోసం పర్వతారోహకులపై ఎక్కువగా ఆధారపడే ఈ హిమాలయ దేశం.. 2019లో మాత్రం పర్వత ప్రాంతాల్లో రద్దీకి, అనేక మంది సాహసికుల మరణాలకు కారణమయిందనే విమర్శలు ఎదుర్కొంది. హిమాలయన్ డేటాబేస్ ప్రకారం 1953 మొదలు ఇప్పటివరకు 10,657 సార్లు ఈ పర్వతాన్ని అధిరోహించారు. చాలా మంది ఒకటి కంటే ఎక్కువసార్లు ఎక్కారు. 311 మంది మరణించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Ukraine: రహస్యంగా ‘ఆపరేషన్ క్రిమియా’
-
General News
Gorantla Madhav: ప్రైవేటు ఫొరెన్సిక్ ల్యాబ్ ఎలా ప్రామాణికం?: ఏపీ సీఐడీ చీఫ్ సునీల్
-
General News
BJP: జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలి: కె.లక్ష్మణ్
-
Politics News
Congress: సోనియా అపాయింట్మెంట్ కోరిన కోమటిరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి
-
Movies News
Thiru review: రివ్యూ: తిరు
-
Politics News
Vijayashanthi: భాజపా రాష్ట్ర నాయకత్వంపై విజయశాంతి అసంతృప్తి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (18/08/2022)
- Madhavan: ‘రాకెట్రీ.. మాధవన్ ఇంటిని కోల్పోయాడు’
- Viral video: యూనిఫాంలో పోలీసుల ‘నాగిని డ్యాన్స్’.. వైరల్‌గా మారిన వీడియో
- Kabul: కాబుల్ మసీదులో భారీ పేలుడు.. భారీగా ప్రాణనష్టం?