Putin: అణు యుద్ధం ముప్పు పెరుగుతోంది..: పుతిన్‌ హెచ్చరిక

రష్యా(russia) కు అణు ఉన్మాదం లేదని పుతిన్‌ (Vladimir Putin) పేర్కొన్నారు. తాము ముందస్తుగా అణ్వాయుధాలను ఉపయోగించబోమని వెల్లడించారు. 

Published : 08 Dec 2022 10:16 IST

ఇంటర్నెట్‌డెస్క్: అణు యుద్ధం ముప్పు రోజురోజుకూ పెరుగుతోందని రష్యా(russia) అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌(Vladimir Putin) హెచ్చరించారు. అయితే రష్యా (russia) ఉన్మాదంగా ప్రవర్తించబోదని ఆయన పేర్కొన్నారు. మొదట తామే అణ్వస్త్రాలు వినియోగించబోమని తెలిపారు. రష్యాలోని మానవహక్కుల మండలి వార్షిక సమావేశంలో వీడియో లింక్‌ ద్వారా ప్రసంగిస్తూ పుతిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఉక్రెయిన్‌లో యుద్ధం సుదీర్ఘ ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు. అణు ముప్పు పెరుగుతోందన్న విషయంలో దాచేందుకు ఏమీ లేదని పుతిన్‌ (Vladimir Putin) అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా రష్యా (russia) మొదటగా అణ్వస్త్రాలను ప్రయోగించడం గానీ, వాటిని చూపి బెదిరించడంగానీ చేయబోమని చెప్పారు. అణ్వాయుధాల సంగతి తమకు తెలుసని.. అందుకే ఉన్మాదంగా వ్యవహరించబోమని వెల్లడించారు. ప్రపంచం మొత్తం తిరిగి ఈ ఆయుధాలను రేజర్ల వలే బ్రాండింగ్‌ చేయబోమని వ్యాఖ్యానించారు. 

ప్రపంచంలోనే అత్యాధునిక అణ్వస్త్రాలు రష్యా (russia) వద్ద ఉన్నాయని పుతిన్‌(Vladimir Putin) ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇతర దేశాల భూభాగాలపై తమ అణ్వాయుధాలు లేవంటూ పరోక్షంగా అమెరికాను విమర్శించారు. టర్కీ, ఇతర ఐరోపా దేశాల్లో అమెరికా అణ్వాయుధాలను మోహరించడాన్ని ప్రస్తావిస్తూ అగ్రరాజ్యంపై విమర్శలు చేశారు. కేవలం ఆత్మరక్షణకే రష్యా (russia) అణ్వాయుధాలను వాడుతుందని పేర్కొన్నారు. 

మరోవైపు పుతిన్‌(Vladimir Putin) వ్యాఖ్యలపై అమెరికా (USA) స్పందించింది. పుతిన్‌(Vladimir Putin)వి బాధ్యతలేని వ్యాఖ్యలుగా అభివర్ణించింది. అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ స్పందిస్తూ ‘‘అణ్వాయుధాలపై  ఏది పడితే అది మాట్లాడటం బాధ్యతా రాహిత్యమవుతుంది’’ అని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని