Plane Crash: అఫ్గానిస్థాన్‌లో కుప్పకూలిన విమానం

అఫ్గానిస్థాన్‌లో ఓ విమానం కుప్పకూలింది. ఇది భారత్‌కు చెందినదిగా తొలుత ప్రచారం జరిగింది. కానీ, అది మన దేశానికి చెందినది కాదని డీజీసీఏ వివరణ ఇచ్చింది. 

Updated : 21 Jan 2024 14:34 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ (Afghanistan)లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మొరాకోకు చెందిన ఛార్టర్డ్‌ విమానం కుప్పకూలింది. ఆదివారం ఉదయం బదాక్షన్‌ ప్రావిన్స్‌లోని జెబాక్‌ జిల్లా తోప్‌ఖానా కొండల్లో ఇది ప్రమాదానికి గురైనట్లు అఫ్గాన్‌ పోలీసులు తెలిపారు. తొలుత ఇది భారత్‌కు చెందినదని అఫ్గాన్ వార్తా సంస్థ టోలో పేర్కొంది. అయితే, ఈ వార్తలను డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) ఖండించింది. అది మొరాకోకు చెందిన ఫాల్కన్‌ జెట్‌ విమానమని, దానిని ఎయిర్‌ అంబులెన్స్‌గా ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. థాయ్‌లాండ్‌ నుంచి రష్యా రాజధాని మాస్కోకు బయల్దేరిన ఈ విమానం భారత్‌లోని గయ విమానాశ్రయంలో ఇంధనం కోసం ఆగినట్లు వెల్లడించింది.

మరోవైపు ఇది రష్యాకు చెందిన విమానంగా అంతర్జాతీయ వార్తా కథనాలు పేర్కొన్నాయి. తమ దేశానికి చెందిన ఫాల్కన్‌ జెట్‌ విమానం ఆరుగురు ప్రయాణికులతో శనివారం రాత్రి నుంచి రాడార్‌తో సంబంధాలు కోల్పోయిందని రష్యన్‌ విమానయాన శాఖ వెల్లడించినట్లు తెలిపాయి. ఈ ప్రమాదం మారుమూల ప్రాంతంలో జరగడంతో సహాయక బృందాలు అక్కడికి చేరుకోవడం కష్టంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని