Rishi Sunak: రిషి సునాక్ కీలక నిర్ణయం.. ఉప ప్రధానిగా డొమినిక్ రాబ్.. పలువురికి ఉద్వాసన!
బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే రిషి సునాక్ తన పనిని ప్రారంభించారు. లిజ్ ట్రస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పలువురిని తమ పదవులకు రాజీనామా చేయాలని సూచించారు.
లండన్: బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే రిషి సునాక్ తన పనిని మొదలుపెట్టారు. బ్రిటన్‌ను ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే దిశగా కసరత్తులో భాగంగా సాయంత్రానికే తన టీమ్‌ని ప్రకటించే పనిని షురూ చేశారు. బ్రిటన్ ఉప ప్రధానిగా డొమినిక్ రాబ్‌ని నియమించిన రిషి.. ప్రస్తుత ఆర్థికమంత్రిగా ఉన్న జెరిమీ హంట్‌ను అదే పదవిలో కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, జేమ్స్ క్లెవర్లీని విదేశాంగ శాఖ కార్యదర్శిగా, బెన్ వాల్సేని డిఫెన్స్ సెక్రటరీగా నియమించారు. పార్లమెంటరీ సెక్రటరీ (చీఫ్ విప్)గా సైమన్ హార్ట్‌ని నియమించగా.. నదిమ్ జాహ్వికి మంత్రిగా అవకాశం కల్పించినప్పటికీ ఆయనకు ఏ శాఖను కేటాయించింది మాత్రం స్పష్టంచేయలేదు.
సుయెల్లా బ్రేవర్మెన్ రీ ఎంట్రీ
లిజ్‌ట్రస్ కేబినెట్‌లో హోం సెక్రటరీగా పనిచేసి ఇటీవల రాజీనామా చేసిన భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రెవర్మన్‌కు రిషి కేబినెట్‌లో చోటు దక్కింది. రిషి జట్టులో సైతం ఆమె హోం సెక్రటరీగానే బాధ్యతలు నిర్వహించనున్నారు. అలాగే, గ్రాంట్ శాప్స్‌ను ఎనర్జీ, ఇండస్ట్రియల్ స్ట్రాటజీ సెక్రటరీగా నియమించారు. రిషిపై పోటీ చేసి తగిన మద్దతు లేకపోవడంతో చివరికి బరిలోంచి వైదొలగిన పెనీ మార్డౌంట్‌ను సైతం రిషి తన జట్టులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు గిల్లియన్ కీగన్‌కు విద్యాశాఖ, మెల్ స్ట్రైడ్‌కు పనులు, పెన్షన్ల బాధ్యతలు అప్పగించారు.
మరోవైపు, లిజ్ ట్రస్ జట్టులో మంత్రులుగా ఉన్న పలువురిని తమ పదవులకు రాజీనామా చేయాలని రిషి కోరినట్టు సమాచారం. జాకబ్ రీస్- మాగ్, బ్రాండన్ లెవైస్, విక్కీ ఫోర్డ్‌ను తమ పదవుల నుంచి వైదొలగాలని సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. తన సొంత మంత్రివర్గాన్ని ప్రకటించడానికి వీలుగా వీరి నుంచి రాజీనామా కోరినట్టు తెలుస్తోంది. రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కాసేపటికే లిజ్ ట్రస్ ప్రభుత్వంలో ఉన్న పలువురు మంత్రులు తమ రాజీనామాలు సమర్పించడం గమనార్హం. ఈ జాబితాలో కిట్ మాల్తౌస్, రాబర్ట్ బక్‌ల్యాండ్, చ్లోల్ స్మిత్, రణిల్ జయవర్దనె వంటి వారు ఉన్నారు. మొదటి నుంచీ తనకు అండగా నిలిచిన వారికి రిషి తన మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Jamuna: ‘గుండమ్మ కథ’.. జమున కోసం మూడేళ్లు ఎదురు చూశారట..!
-
Movies News
Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం
-
India News
Flight: అసహనంతో ‘విమానం హైజాక్’ అంటూ ట్వీట్
-
Movies News
Jamuna: అలనాటి నటి జమున కన్నుమూత
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Marriage: 28 ఏళ్ల కోడలిని పెళ్లాడిన 70 ఏళ్ల మామ