Ice Batukamma: ఆకట్టుకుంటున్న 10 అడుగుల ఐస్‌ బతుకమ్మ

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ సంబురాలను హోటల్ మేనేజ్‌మెంట్  విద్యార్థులు వినూత్న రీతిలో నిర్వహించారు. బేగంపేట్‌లో.. హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు మంచుతో 10 అడుగుల బతుకమ్మను రూపొందించారు. ఇందుకు 400 కిలోల ఐస్ బ్లాకులు వినియోగించినట్లు విద్యార్థులు తెలిపారు. ప్రాక్టికల్ ఎక్స్ టర్నల్ పరీక్షలో భాగంగా ఐస్ బతుకమ్మను తయారు చేసినట్లు చెప్పారు. ఐదుగురు పీజీ విద్యార్థులు, అధ్యాపకులు ఐదుగంటలు శ్రమించి అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు వివరించారు. సంప్రదాయ తంగెడుపూలతోపాటు విద్యుత్ దీపాలతో చక్కగా అలంకరించిన బతుకమ్మ చూపరులను ఆకట్టుకుంటోంది. 

Published : 26 Sep 2022 10:59 IST

Tags :

మరిన్ని