చెబితే వినలా, ధర తక్కువని పెట్రోలుకు బదులు విమాన ఇంధనం వేయించాడు!
latestnews
కానిస్టేబుళ్ల కార్ఖానా..!
న్యూస్‌టుడే-బీర్కూర్‌
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతీ, యువకులకు పోలీస్‌ ఉద్యోగాలను సాధించాలనే తపన ఉన్నా.. అందుకు కావాల్సిన శిక్షణ తీసుకునే స్థోమత లేనివారికి ఉచితంగా పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు ఓ పోలీస్‌ ఉన్నతాధికారి. ఆయనే బీర్కూర్‌ మండలంలోని రైతునగర్‌ గ్రామానికి చెందిన పాలేటి సత్యనారాయణ. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ నగర ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. తన మిత్రుల సహకారంతో ‘జన్మభూమి’ స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఉచిత శిక్షణకు శ్రీకారం చుట్టారు.

హైదరాబాద్‌లో నగర అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ తన చిన్ననాటి 8 మంది మిత్రుల సహకారంతో పుట్టిన వూరైన రైతునగర్‌లో మూడేళ్ల క్రితం ‘జన్మభూమి స్వచ్ఛంద సేవా సంస్థ’ను స్థాపించి పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈయన హైదరాబాద్‌లోని పోలీస్‌ శిక్షణ అకాడమిక్‌లో కొత్తగా ఎంపికైన, ఇన్‌ సర్వీస్‌ కానిస్టేబుల్‌ స్థాయి నుంచి సీఐ స్థాయి వరకు.. వారికి న్యాయసంబంధ, వ్యక్తిత్వ వికాసం, ప్రజల పోలీస్‌, కమ్యూనిటీ ఓరియంట్‌ వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువతీ, యువకులు పదో తరగతి, ఇంటర్మీడియేట్‌ వరకు చదువుకుని ఉన్నత చదువులు అభ్యసించే ఆర్థిక స్థోమత లేనివారికి పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని మార్గనిర్దేశం చేసేవారు లేకపోవడాన్ని గమనించారు. దీంతో ఆయన ట్రస్టు మిత్రులతో చర్చించి గ్రామీణ ప్రాంతాల యువతీ, యువకులు పోలీస్‌ రంగాన్ని ఎంచుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకు ఉచితంగా శిక్షణ తరగతులను ప్రారంభించారు.

నమూనా పరీక్షల ద్వారా ఎంపిక..
పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నగ్రామీణ ప్రాంత యువతీ, యువకులకు ఏడాది క్రితం అన్ని సబ్జెక్టులపై నమూనా పరీక్షలు నిర్వహించారు. మూడు దశల వారీగా 200 మందికి పరీక్షలు నిర్వహించి అందులో అత్యధిక మార్కులు పొందిన 60 మందిని ఉచిత శిక్షణ తరగతులకు ఎంపిక చేశారు. అనంతరం గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించి హైదరాబాద్‌ నగరం నుంచి నలుగురు ఎస్సైలను పిలిచి కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించేందుకు ఏ విధంగా కష్టపడాలో అవగాహన కల్పించారు. రాత పరీక్ష, దేహ దారుధ్యం పరీక్షల్లో మెలకువలు నేర్పించి విజయం సాధించేందుకు సలహాలు, సూచనలు అందజేశారు.

60 మందికి శిక్షణ
తెలంగాణ ప్రభుత్వం పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ప్రకటన జారీ చేయడంతో ట్రస్టు నిర్వాహకులు కొద్ది రోజుల కిత్రం ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించారు. రాత పరీక్షకు సంబంధించిన చదువు సామగ్రి (స్టడీ మెటీరియల్‌) ఎనిమిది పుస్తకాలను ట్రస్టు సభ్యుడు పాండురంగారావుతో సహకారంతో 60 మంది అభ్యర్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. అందజేసిన సామగ్రిలో హైదరాబాద్‌లోని పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చే సంస్థ రూపొందించిన పాఠ్యాంశాలు ఉన్నాయి. ఇందులో తెలంగాణ సంప్రదాయలు, చరిత్ర, సాహిత్యం, జాగ్రఫీ వంటి అంశాలపై ప్రభుత్వ ఉపాధ్యాయలతో శిక్షణ అందిస్తున్నారు. అందజేసిన వాటిలో జనరల్‌ ఇంగ్లిష్‌, అర్థమెటిక్స్‌, చరిత్ర, రాజకీయం, జాగఫ్రీ, జనరల్‌ స్టడీస్‌, రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ, ఆర్థికశాస్త్రం వంటి సబ్జెక్టులపై శిక్షణ ఇస్తున్నారు. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. దాంతోపాటు ఉపాధ్యాయులకు ప్రభుత్వం వరుస సెలవులు ఇస్తే ఎన్ని రోజులు సెలువులుంటే అన్ని రోజులు సేవా సంస్థలో సభ్యులుగా ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయులు అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు.

శిక్షణ సద్వినియోగం చేసుకుని ఉద్యోగం సాధిస్తా
నవీన్‌, బీర్కూర్‌ మండలం, మైలారం
నేను డిగ్రీతోపాటు డీఎడ్‌ పూర్తి చేశాను. గతంలో ఎలాంటి శిక్షణ తీసుకోకుండా ఏఆర్‌ కానిస్టేబుల్‌కు ప్రయత్నించి కొద్దిపాటి మార్కులతో ఉద్యోగం కోల్పోయాను. జన్మభూమి సేవా సంస్థ నిర్వాహకులు నిర్వహించిన నమూనా రాత పరీక్షల్లో అత్యధిక మార్కులు పొంది ఉచితంగా శిక్షణ తరగతులకు ఎంపికయ్యాను. వీరు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని తప్పనిసరిగా కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధిస్తాను.

శిక్షణ తీసుకోనే స్థోమత లేక...
శ్వేత, బాన్సువాడ మండలం హన్మాజీపేట్‌
మాది నిరుపేద కుటుంబం. మా తల్లిదండ్రులు కూలీ పని చేసి నన్ను చదివించారు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాను. నాకు కానిస్టేబుల్‌ ఉద్యోగం అంటే చాలా ఇష్టం. కానిస్టేబుల్‌కు శిక్షణ ఇప్పించే స్థోమత మా తల్లిదండ్రులకు లేదు. ప్రభుత్వం కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం ప్రకటన జారీ చేసింది. సత్యనారాయణ సార్‌ సహకారంతో శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించి మా తల్లిదండ్రులకు అండగా నిలుస్తాను.

నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి
సత్యనారాయణ, హైదరాబాద్‌ నగర ఏసీపీ
గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు ఈ ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి. చాలా మంది తక్కువ చదివి ఉద్యోగం సంపాదించి స్థిరపడాలనే వారికి ఇదొక వరంవంటింది. పోలీస్‌ కానిస్టేబుల్‌కు శిక్షణ తీసుకునే స్థోమత లేని యువతీ, యువకులకు మంచి అవకాశం కల్పించామనే సంతోషం ఉంది.

అవకాశాన్ని వదులుకోవద్దు
పాండురంగారావు, చదువు సామగ్రి దాత
ప్రభుత్వం నిరుద్యోగులకు పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు కోసం ప్రకటన జారీ చేసింది. ఈ అవకాశాన్ని యువకులు వదులుకోవద్దు. చాలా మంది పట్టణ ప్రాంతాలకు వెళ్లి శిక్షణ తీసుకోనే స్థోమత లేని వారికి రైతునగర్‌ గ్రామంలో మా ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలి.

శిక్షణ తరగతులకు స్పందన బాగుంది
శోభన్‌, శిక్షణ తరగతుల ఇన్‌ఛార్జి
రైతునగర్‌ గ్రామంలో నిర్వహిస్తున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు యువతీ, యువకుల నుంచి స్పందన బాగుంది. సబ్జెక్టుల వారీగా ప్రభుత్వ ఉపాధ్యాయులతో శిక్షణ ఇస్తున్నాం.


స్ఫూర్తిమంత్రం!

తూర్పు నౌకాదళ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే అపూర్వ ఘట్టం విశాఖ సాగర తీరాన ఆవిష్కృతమైంది. యాభైకి పైగా దేశాలు...

Full Story...

ముహూర్తం కుదిరింది ఖరారు మిగిలింది

హైదరాబాద్‌ మహానగర పాలకసంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల క్రతువు ముగియడంతో మేయర్‌ ఎన్నికకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎంజీ గోపాల్‌...

అప్పులిచ్చారా... కప్పిపుచ్చారా!

కలిసిరాని ప్రకృతి, కలిసిరాని ధరలు, విపణిలో అక్రమాలు వెరసి సేద్యమంటేనే రైతులు హడలుతున్నారు. ఎన్ని ప్రతికూలతలు ఉన్నా... లక్షలాది మంది ఇప్పటికీ...

మేడారంలో అధికారులకు ప్రత్యేక యూనిఫాం!

జాతర ఇప్పుడే మొదలైందా అన్నట్లుగా భక్తులు వరదలా వస్తున్నారు. ప్రతిరోజూ మేడారం కిక్కిరిసిపోతోంది. అధికారులు ముందే మేల్కోవాల్సిన అవసరం ఏర్పడింది.

‘కంచె’లు.. కొంచెమే

ప్రభుత్వ భూమిని రక్షించాలని ఫిర్యాదు చేసినా స్పందించని యంత్రాంగం తీరిది. హుజురాబాద్‌ మండలం ఇప్పలనర్సింగపూర్‌ గ్రామంలో సీడ్‌మిల్లును అనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని....

నిధులిచ్చినా..నెమ్మదే!

జిల్లాలో ఏళ్లతరబడి కొనసా..గుతున్న నాలుగు ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. ఖరీఫ్‌కు.. లేదంటే రబీకి సాగునీరంటూ కాలం వెళ్లదీయడమే...

‘బండ’బడ.. ఇదేమి ఆగడం?

ఏదైనా ప్రభుత్వ ఆస్తిని అమ్మాలంటే ఆషామాషీ కాదు. తొలుత దాని విలువను నిర్ణయిస్తారు. నిబంధనల ప్రకారం టెండరు నిర్వహించి ఎక్కువ ధర ఎవరు ఇస్తామంటే వారికే దానిని...

తప్పుదారి

జిల్లాలో అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అక్రమ పద్ధతిలో సొమ్ము చేసుకోవాలనుకున్న కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. డబ్బులకు కక్కుర్తిపడి రసాయనాలను సైతం అమ్మేసుకుంటున్నారు.

‘శత’విధీ..

ఒకటీ.. రెండూ కాదు.. ఏకంగా శత కోటి రూపాయలు వెచ్చించిన నిర్మించిన పథకం అది.. దీన్ని ఏ ప్రయోజనం ఆశించి నిర్మించారో అది ప్రస్తుతం అవసరం లేకుండా...

మధ్యాహ్న భోజనం నాణ్యత పరిహాసం

నవీపేట ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సొరకాయపప్పు కలిపి చేసిన భోజనం చేసిన కొద్దిసేపటికి ఒకొరితరువాత ఒకరు వాంతులు...

ఒప్పంద ఉద్యోగం.. అధికారులపై పెత్తనం

చేసేది ఒప్పంద (కాంట్రాక్టు) ఉద్యోగం.. పెత్తనం మాత్రం గజిటెడ్‌ అధికారులపై.. మరి అటువంటి ఉద్యోగి చెప్పినట్లు అధికారులు వింటారా? అంటే ఎవరైనా సరే అంతగా శ్రద్ధ పెట్టరనే...

ఎత్తిపోతల ధర్మ‘వరం’

దుర్గి మండలం ధర్మవరానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరం ఇచ్చారు. గ్రామ పరిధిలో 3500 ఎకరాలకు సాగునీరు అందించడానికి రూ.35 కోట్ల విడుదలకు ముఖ్యమంత్రి...

సొమ్ము నేసేశారు

శవాలపైన కూడా కాసులు ఏరుకోవడమంటే ఇదే. ప్రకృతి ప్రకోపించి బతుకులు కకావికలమైన చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం విదిల్చిన ఆ కాస్త నిధులపైనా దళారుల కన్ను...

నీరు దారి మళ్లొద్దు!

కృష్ణా, గుంటూరు జిల్లాల తాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జునసాగర్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో, ఈ నీటిని సక్రమంగా పంపిణీ చేయడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.

అడుగడుగునా ఆక్రమణ

1959, 1985, 2010లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రాచీన కట్టడాలు, పురావస్తు క్షేత్రాలు, శిథిలావశేషాల పరిరక్షణ చట్టం ప్రకారం జాతీయ ప్రాధాన్యత కట్టడంగా లేపాక్షిని గుర్తించారు.

దీక్షకు దన్ను

కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పలు గ్రామాల్లో...

ఎత్తిపోతలకు కొత్తరూపు

మెట్ట భూములకు ప్రతి నీటి బిందువు అమృత సింధువే. బీడువారిన పొలాలకు జలసిరి అందించి సస్యశ్యామలం చేయటానికి ప్రవహించే నీటిని ఎత్తిపోసేలా పలు పథకాలకు రూపకల్పన చేస్తున్నా...

చేతులు దులుపుకొన్నారా? చేతులు తడుపుకొన్నారా?

అవుకు మండలం పాతచెర్లోపల్లిగ్రామ పరిధిలో అక్రమ క్వారీ తవ్వకాల గుట్టును విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ రట్టు చేసింది. పదేళ్ల నుంచి ఈ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరుగుతుంటే అధికారుల దృష్టికి రాలేదా?

లెక్క లేదు

దేశాభివృద్ధికి పల్లెలు పట్టుకొమ్మలు.. అలాంటి పల్లెల ప్రగతికి విడుదలయ్యే నిధులు పక్కదారి పడుతున్నాయి. పంచాయతీల ఆలనాపాలనా చూడాల్సిన పాలకులు నిధులు కైంకర్యం...

కష్టాల జడి కన్నీటి తడి

వర్షాభావ పరిస్థితుల ప్రభావం ఈ ఏడాదీ పొగాకు రైతులను వెన్నాడుతోంది.. పొగాకు పంట దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపుతోంది.. గత ఏడాదితో పోలీస్తే ఈసారి పొగ నాట్లు ఆలస్యం కావడం..

కూలితే.. కళ్లుతెరుస్తారేమో!

మీరు రూ. 5 కోట్లతో ఇల్లు కట్టుకున్నారు. పదడుగుల వెడల్పుతో ప్రధాన ద్వారానికి ఏర్పాట్లు చేసి... ఐదడుగుల మేరకే తలుపు బిగిస్తే! ఏమవుతుంది? చూసిన వారు నవ్వుతారు.

అహో సార్వభౌమ

ఆకాశం గర్జించినట్టు దూసుకెళ్లిన యుద్ధ విమానాలు... సాగరాన నిప్పులు చిమ్ముతూ పేలిన బాంబులు... త్రివర్ణపతాకాన్ని సగర్వంగా ఎగరేస్తూ ‘చేతక్‌’ హెలికాప్టర్ల విన్యాసాలు...

పాలకులేరీ?

పంచాయతీలకు 2013లో ఎన్నికలు జరిగాయి. సుమారు మూడేళ్లు కావస్తుంది. నేటికీ పలు పంచాయతీలకు పాలకులు కరవయ్యారు. జిల్లాలో సర్పంచులు, వార్డుసభ్యులు కలిపి 74...

మసి పూసి మాయచేసి!

ఇది ఏలూరు అగ్నిమాపక కేంద్ర కూడలి నుంచి కొత్త బస్టాండ్‌కు వెళ్లే దారి. ఇక్కడ కొత్త డ్రెయిన్‌ నిర్మిస్తున్నారు. ఇక్కడ వివిధ రకాల హోటళ్లు, దుకాణాలు, ఖరీదైన ఇళ్లు, ఆర్టీసీ గ్యారేజీ...