దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన వాజ్‌పేయీ

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

ఈనాడు, అమరావతి: దేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయీ అని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. గొప్ప రాజనీతిజ్ఞుడిగా ఆయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. వాజ్‌పేయీ నాలుగో వర్ధంతి సందర్భంగా మంగళవారం రాజ్‌భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాజపేయీతో కలిసి వివిధ హోదాల్లో పనిచేసే అవకాశం తనకు దక్కిందని గవర్నర్‌ గుర్తుచేసుకున్నారు.

కశ్మీర్‌లో ప్రమాదంపై దిగ్భ్రాంతి

కశ్మీర్‌లో ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులకు చెందిన వాహనం ప్రమాదానికి గురై పలువురు సిబ్బంది మృతి చెందటం, మరికొందరు గాయపడటం పట్ల గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఐటీబీపీ సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురికావటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


మరిన్ని

ap-districts
ts-districts