ఐలవ్‌యూ చెప్పిన అభిమాని.. స్పందించిన నటి - heroin malaviaka replied to love proposed fan
close
Updated : 08/02/2021 19:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐలవ్‌యూ చెప్పిన అభిమాని.. స్పందించిన నటి

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియాలో సినీ ప్రముఖులు పోస్టులు పెట్టడం.. వాటికి నెటిజన్లు కామెంట్‌ చేయడం మామూలే. అయితే.. అన్నిసార్లూ కాకపోయినా.. కొన్నిసార్లు తమ పోస్టులకు వచ్చిన కామెంట్లపై సెలబ్రిటీలు స్పందిస్తుంటారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి జరిగింది. తమిళ స్టార్‌ హీరో ధనుష్‌, మాళవిక మోహనన్‌ జంటగా ఓ సినిమా వస్తోంది. కార్తీక్‌ నరేన్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొంతకాలంగా రాత్రింబవళ్లూ తీరికలేకుండా హైదరాబాద్‌లో చిత్రీకరణ పనులు సాగుతున్నాయి. కాగా.. ఆ షెడ్యూల్‌ తాజాగా పూర్తయింది. ఈ విషయాన్ని హీరోయిన్‌ మాళవిక అభిమానులతో పంచుకుంది. ధనుష్‌తో కలిసి సినిమా సెట్లో దిగిన ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేసింది.

‘ధనుష్‌ను కలవడం ఎంతో ఆనందంగా ఉంది. మీతో పనిచేయడం వల్ల ఎంతో నేర్చుకున్నా. మీ నవ్వులు మిస్‌ అవుతున్నా. తర్వాతి షెడ్యూల్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మనిద్దరం మ్యాగీ ప్రేమికులం’ అంటూ ఆమె రాసుకొచ్చింది. అయితే.. ఆ పోస్టుకు స్పందనగా హీరోయిన్‌ను ఉద్దేశిస్తూ ‘ఐలవ్‌యూ మ్యాగీ’ అని ఒక అభిమాని కామెంట్‌ చేయగా.. దానికి ఆ హీరోయిన్‌ స్పందించింది. ‘మాగీని ప్రేమించేవాళ్లందర్నీ నేను ఇష్టపడతాను’ అంటూ ఆమె తనదైన స్టైల్‌లో సరదాగా స్పందించింది. ఇటీవల మాళవిక నటించిన మాస్టర్‌ చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..

ఉప్పెన నుంచి స్పెషల్‌ సాంగ్‌

‘సలార్‌’ విలన్‌ ఫిక్స్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని