నా హృదయం ముక్కలైంది: తమన్‌ - my heart jus broke into pieces says thaman
close
Published : 25/04/2021 16:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా హృదయం ముక్కలైంది: తమన్‌

కన్నీళ్లు పెట్టుకున్న సంగీత దర్శకుడు

హైదరాబాద్‌: తన హృదయం ముక్కలయ్యిందని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ కంపోజర్‌గా వరుస హిట్‌ ఆల్బమ్స్‌తో మెప్పిస్తున్న తమన్‌ తాజాగా ఆన్‌లైన్‌లో ఓ వీడియో చూసి భావోద్వేగానికి లోనయ్యారు. తమిళనాడుకు చెందిన ఓ నెటిజన్‌.. రోడ్డు పక్కన ఆకలితో ఉన్న వృద్ధురాలికి ఆహారం, మంచి నీళ్లు అందించాడు. తన ఆకలి తీరుస్తున్నందుకు ఆ వృద్ధురాలు ఎంతో ఆనందించింది. వెంటనే తన వద్ద ఉన్న కొంత మొత్తాన్ని ఆ వ్యక్తికి అందించబోయింది. అతను వద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ వృద్ధురాలి కళ్లలో ఉన్న ఆనందం, చిరునవ్వు ప్రతి ఒక్కరి హృదయాల్ని ద్రవింపచేస్తోంది.

కాగా, తాజాగా ఈ వీడియో చూసిన తమన్‌.. తన ట్విటర్‌ వేదికగా ఓ సంతోషకరమైన విషయాన్ని తెలియచేశారు. తాను ఓ వృద్ధాశ్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిపారు. ‘ఈ వీడియో చూసి నా హృదయం ముక్కలయ్యింది. ఓ వృద్ధాశ్రమాన్ని నిర్మించాలనే ఆలోచన నాలో మొదలైంది. నా కోరికకు త్వరలోనే కార్యరూపం ఇస్తాను. దానికి తగిన ధైర్యాన్ని, స్థిరత్వాన్ని దేవుడు నాకు అందిస్తాడని ఆశిస్తున్నాను. కన్నీళ్లతో ఈ మెస్సేజ్‌ పెడుతున్నాను. మీరు కూడా దయచేసి ఆహారాన్ని వృథా చేయకండి. అవసరమైన వారికి దానిని అందించండి’’ అని కోరారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని