అమరవీరులుచిరస్మరణీయులు
eenadu telugu news
Published : 22/10/2021 05:24 IST

అమరవీరులుచిరస్మరణీయులు

రేపల్లె పట్టణంలో నిర్వహించిన ప్రదర్శనలో పోలీసులు

విధి నిర్వహణలో ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులు చిరస్మరణీయులని వారి త్యాగాలను పలువురు కొనియాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లావ్యాప్తంగా పోలీసులు రక్తదానం, వీరుల గొప్పతనాన్ని కీర్తిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. గుంటూరులో అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, గ్రామీణ ఎస్పీ విశాల్‌ గున్నీ, అమరుల కుటుంబసభ్యులు నివాళి అర్పించారు. శాంతిభద్రతల పరిరక్షణలో, కొవిడ్‌ కట్టడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు చెప్పారు. పోలీసులు ఒత్తిడిని అధిగమించడానికి ఆరోగ్యంపై శ్రద్ధపెట్టి ప్రతిరోజు నడక, యోగా చేయాలని సూచించారు. - న్యూస్‌టుడే, గుంటూరు, రేపల్లె అర్బన్‌

స్తూపం వద్ద నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని