ఈ పిల్లాడి పేరు HTML
close

తాజా వార్తలు

Published : 17/06/2021 01:35 IST

ఈ పిల్లాడి పేరు HTML

ఇంటర్నెట్‌డెస్క్‌: సాంకేతికత అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో ప్రజలు తమ పిల్లలకు పేర్లను పెట్టడంలో చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఎంత స్మార్ట్‌గా అంటే.. ఆ పేర్లు ఎవరికీ అర్థం కానంత. ప్రపంచ కుబేరులలో ఒకరైన ఎలన్‌ మస్క్‌ గతేడాది తనకు కొడుకు పుట్టగా ‘ఎక్స్‌ఏఈఏఎక్స్‌ఐఐ మస్క్‌’ (X ÆAE-Xii Musk) అని పలకడానికే ఇబ్బందిగా ఉన్న పేరు పెట్టి వార్తల్లో నిలిచారు. తాజాగా అలాంటి మరొక పేరు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. 

ఫిలిప్పీన్‌కు చెందిన వెబ్‌డెవలపర్‌ మ్యాక్‌ పాస్కల్‌ అనే వ్యక్తి ఇంటర్నెట్‌ మీద ఉన్న మక్కువతో ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ అయిన ‘హెచ్‌టీఎమ్‌ఎల్‌’ ను తన కొడుకు పేరుకు తగిలించాడు. వెరసి పిల్లాడి పేరు ‘హైపర్‌ టెక్ట్స్‌ మార్క్‌అప్‌ లాంగ్వేజ్‌ రాయో పాస్కల్‌’ (HTML Rayo Pascual) అయింది. పిల్లాడి ఫొటోను, విచిత్రమైన ఈ పేరును మ్యాక్ పాస్కల్‌ సోదరి  ‘సిన్సియర్లీ పాస్కల్‌’ ఫేస్బుక్‌ ద్వారా పంచుకోగా మిశ్రమ స్పందన లభిస్తోంది. కాగా ఆ పేరు వల్ల పిల్లాడిని తన తోటివాళ్లు బడిలో ఎగతాళి చేస్తారని నెటిజన్లు అంటుంటే.. పాఠశాల స్థాయి పిల్లలకు హెచ్‌టీఎమ్‌ఎల్‌ అంటే ఏంటో తెలియదు కాబట్టి ఎలాంటి సమస్య ఉండదని ఆమె బదులు ఇచ్చారు. అయితే పాస్కల్‌ కుటుంబంలో ఇలాంటి పేర్లు పెట్టుకోవడం కొత్తేమీ కాదని సిన్సియర్లీ పాస్కల్‌ చెప్పుకొచ్చారు. మ్యాక్‌ పాస్కల్‌ అసలు పేరు ‘మాకరోని 85’ కాగా, అతని మరో సోదరి పేరు ‘స్పఘెట్టి 88’. ఇక సిన్సియర్లీ పాస్కల్‌ పూర్తి పేరు ‘సిన్సియర్లీ యువర్స్‌ 98’. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని