పెద్దలకు వాడే ఆ మందులు పిల్లలకొద్దు
close

ప్రధానాంశాలు

Updated : 17/06/2021 09:06 IST

పెద్దలకు వాడే ఆ మందులు పిల్లలకొద్దు

కొవిడ్‌పై కేంద్రం మార్గదర్శకాలు

దిల్లీ: కొవిడ్‌ చికిత్సకు గాను పెద్దలకు వాడే అనేక ఔషధాలను పిల్లలకు సిఫార్సు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు పిల్లలకు కొవిడ్‌ చికిత్స లేదా నివారణకు ఐవర్‌మెక్టిన్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, ఫావిపిరవిర్‌ వంటి మందులను గానీ.. డాక్సీసైక్లిన్‌, అజిత్రోమైసిన్‌ వంటి యాంటీబయోటిక్స్‌ను గానీ వాడొద్దని తెలిపింది. కొంత విరామం తర్వాత కొవిడ్‌ కేసులు పెరగొచ్చన్న అంచనాల నేపథ్యంలో పిల్లలకు కొవిడ్‌ సంరక్షణ సేవల నిర్వహణకు సంబంధించి కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ బుధవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా సోకే పిల్లల కోసం ప్రస్తుతం ఉన్న కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలను మరింతగా పెంచాలని పేర్కొంది. ప్రత్యేకించి పిల్లల చికిత్సకు అవసరమయ్యే అదనపు పరికరాలు, మౌలిక వసతులు, సిబ్బందిని సమకూర్చుకోవాలని స్పష్టం చేసింది. పిల్లల్లో కొవిడ్‌కు సంబంధించి అన్ని స్థాయిల్లో సమాచారాన్ని సేకరించేందుకు జాతీయ రిజిస్ట్రీని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. చిన్నారులకు కరోనా టీకా అందుబాటులోకి వస్తే ప్రాధాన్యత క్రమంలో అందించనున్నట్లు తెలిపింది.

మార్గదర్శకాలివే..
* లాక్‌డౌన్‌ తర్వాత, పాఠశాలలు తెరిచిన అనంతరం లేదా రానున్న నెలల్లో మూడో ఉద్ధృతి వచ్చి.. కేసులు పెరిగినట్లయితే కట్టడి చేసేందుకు ప్రైవేటు, ప్రభుత్వ రంగాల భాగస్వామ్యం అవసరం. రెండో ఉద్ధృతిలో గరిష్ఠంగా నమోదైన కేసుల ఆధారంగా ఆయా జిల్లాల్లో పిల్లల కోసం అదనపు పడకల ఏర్పాటు వంటి అంచనాలు రూపొందించాలి.
* తగినంతగా శిక్షణ పొందిన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలి. అధికారులు ప్రత్యేకించి పిల్లల ఆసుపత్రులు, పడకలు వంటివి ఏర్పాటు చేయాలి. పిల్లలతో పాటు తల్లిదండ్రులను కూడా అనుమతించేలా ప్రత్యేక ప్రాంతాల్లో వైద్య వసతులను కల్పించాలి. ప్రత్యేకించి ఐసీయూ, హెచ్‌డీయూ సేవలను కూడా పెంపొందించాలి.
* ఎక్కువ మంది పిల్లల్లో లక్షణాలు ఉండకపోవడం లేదా స్వల్ప లక్షణాలు కనిపించడం ఉంటుంది. అలాంటి పిల్లలకు ఇళ్ల వద్దే తల్లిదండ్రులు సంరక్షణ ఏర్పాట్లు చూసేలా సహకరించాలి. లక్షణాలు కనిపిస్తే జ్వరానికి పారాసిటమల్‌ ఇవ్వడంతో పాటు శ్వాస తీరు, ఆక్సిజన్‌ స్థాయి వంటివాటిని పరిశీలిస్తుండాలి. ఇళ్ల వద్ద పిల్లలకు సేవలందించే విషయంలో ఆశా, ఎంపీడబ్ల్యూ కార్యకర్తలు భాగస్వాములు కావాలి. ఆసుపత్రుల్లో చేర్చాల్సిన అవసరం ఉంటుందా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుండాలి.
* కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు శిక్షణ ఇవ్వడం చాలా ముఖ్యం. అలాగే కొవిడ్‌పై తగిన సమాచారం అందిస్తూ చైతన్య పరుస్తుండాలి. ఆరోగ్య సేవల్లో నాణ్యత పెంచడం, సామర్థ్యం పెంపు విషయమై జిల్లా ఆసుపత్రులు, వైద్య కళాశాలలు చర్యలు చేపట్టాలి. ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా టెలిమెడిసెన్‌ సేవలను అందుబాటులోకి తేవాలి.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన