close

తాజా వార్తలు

‘దిశ’ నిందితులను వెంటనే శిక్షించాల్సిందే!

లోక్‌సభలో ముక్తకంఠంతో కోరిన ఎంపీలు

దిల్లీ: హైదరాబాద్‌లో యువ వెటర్నరీ వైద్యురాలు ‘దిశ’ హత్యోదంతంపై లోక్‌సభలో చర్చ జరుగుతోంది. నిందితులను వెంటనే శిక్షించాలంటూ ఎంపీలు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ ఘటనపై చర్చ జరపాలంటూ తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చిన నేపథ్యంలో జీరో అవర్‌లో స్పీకర్‌ ఓం బిర్లా చర్చకు అనుమతించారు.

ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ హోం మంత్రి చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. జాతీయ రహదారిపై హత్య జరిగితే పోలీసులు అడ్డుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం భాజపా ఎంపీ బండి సంజయ్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’ ఘటన దేశ వ్యాప్తంగా చెడు వాతావరణాన్ని సృష్టించిందన్నారు. ప్రజలను చైతన్యపరచడంలో నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి ఘటనలు జరుగుతాయని తెలిపారు. నిందితులకు వెంటనే శిక్షలు అమలు చేస్తే తప్ప న్యాయం జరగదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారని ఆయన గుర్తు చేశారు. ఘటన జరిగినప్పుడే కాకుండా.. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, చట్టంలో మార్పులు తీసుకొస్తే తప్ప మార్పు సాధ్యం కాదని ఆయన సభకు వివరించారు.

దిశ హత్యాచార ఘటనను తెదేపా తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అందరూ కోరుకుంటున్నారని తెలిపారు. మహిళలకు రక్షణ కరైవన పరిస్థితులు ఏర్పడటం దురదృష్టకరమన్నారు. దిశను అత్యంత క్రూరంగా చంపేశారని వైకాపా ఎంపీ వంగా గీత  విచారం వ్యక్తం చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ ఘటనను  అందరూ ఖండించాలన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడాలంటేనే భయపడేలా చట్టం తీసుకురావాలని ఆమె సభకు వివరించారు. మహిళలు బయటికి వెళ్తే ఇంటికి క్షేమంగా వస్తారో..రారో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ అమానవీయ ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయాలని లోక్‌సభలో డిమాండ్‌ చేశారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.