మైక్రోమాక్స్ ఇన్‌ 2బీ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు ఇవే..

మైక్రోమాక్స్ ఇన్‌ 2బీ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు ఇవే..

1/10

బడ్జెట్ శ్రేణి మార్కెట్ లక్ష్యంగా మైక్రోమాక్స్ ఇన్‌ 2బీ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన మైక్రోమాక్స్ ఇన్‌ 1బీకి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. రెండు వేరియంట్లలో తీసుకొస్తున్న ఈ ఫోన్ ఫీచర్లు..ధర వివరాలివిగో..

2/10

భద్రతపరంగా ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌తోపాటు ఫేస్‌ఐడీ సెక్యూరిటీ ఫీచర్‌ని ఇన్‌ 2బీ సపోర్ట్ చేస్తుంది.

3/10

ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. యూఎస్‌బీ టైప్‌-సీ ఛార్జ్‌ ఇస్తున్నారు. ఇది 10వాట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

4/10

ఇన్‌ 2బీలో మూడు కెమెరాలున్నాయి. వెనుకవైపు 13 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 2ఎంపీ సెకండరీ కెమెరా ఇస్తున్నారు. ముందు భాగంలో సెల్ఫీల కోసం 5ఎంపీ కెమెరా అమర్చారు.

5/10

గేమింగ్‌ ప్రియుల కోసం 30 శాతం అధిక గ్రాఫిక్ సామర్థ్యం కలిగిన హై-పవర్ చిప్‌సెట్ ఉపయోగించారు.

6/10

ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో మైక్రోమాక్స్ ఇన్‌ 2బీ పనిచేస్తుంది.

7/10

ఇందులో యూనీసాక్ టీ610 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 4జీబీ, 6జీబీ ర్యామ్‌ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది.

8/10

మైక్రోమాక్స్ ఇన్‌ 2బీలో 440 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో అల్ట్రాబ్రైట్‌ 6.52-అంగుళాల హెచ్‌డీ+ మినీ డ్రాప్ డిస్‌ప్లే ఇస్తున్నారు.

9/10

ఆగస్టు 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి మైక్రోమాక్స్‌ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. బ్లాక్‌, బ్లూ, గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది.

10/10

4జీబీ ర్యామ్‌/ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ ధర ₹7,999‌గాను, 6జీబీ ర్యామ్‌/ 64జీబీ వేరియంట్‌ ధర ₹8,999గా మైక్రోమాక్స్ నిర్ణయించింది.


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని