News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 27 May 2022 20:26 IST
1/22
చైనాలోని షాంఘైలో ఓ నిర్మాణ సంస్థలోని కార్మికులు ఇలా రోడ్లపై హెల్మెట్లు, కుర్చీలు అడ్డుగా పడేయడంతో పాటు ఒక రకమైన వాయువును పిచికారీ చేస్తూ లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. చైనాలోని షాంఘైలో సుమారు రెండు నెలలుగా కరోనా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని నిరసనలు చేస్తున్నారు. చైనాలోని షాంఘైలో ఓ నిర్మాణ సంస్థలోని కార్మికులు ఇలా రోడ్లపై హెల్మెట్లు, కుర్చీలు అడ్డుగా పడేయడంతో పాటు ఒక రకమైన వాయువును పిచికారీ చేస్తూ లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. చైనాలోని షాంఘైలో సుమారు రెండు నెలలుగా కరోనా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని నిరసనలు చేస్తున్నారు.
2/22
ఆదిలాబాద్‌ పట్టణంలో శుక్రవారం సాయంత్రం జోరువాన కురిసింది. దీంతో అప్పటివరకు వివిధ పనుల్లో నిమగ్నమైన పట్టణవాసులు ఉరుకులు పరుగులు పెట్టారు. సుమారు 45నిమిషాలు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో పట్టణవాసులు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందారు. ఆదిలాబాద్‌ పట్టణంలో శుక్రవారం సాయంత్రం జోరువాన కురిసింది. దీంతో అప్పటివరకు వివిధ పనుల్లో నిమగ్నమైన పట్టణవాసులు ఉరుకులు పరుగులు పెట్టారు. సుమారు 45నిమిషాలు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో పట్టణవాసులు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందారు.
3/22
4/22
తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌-సుప్రవ హరిచందన్‌ దంపతులను హైదరాబాద్‌ విమానాశ్రయంలోని విశ్రాంతి భవనంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌-సుప్రవ హరిచందన్‌ దంపతులను హైదరాబాద్‌ విమానాశ్రయంలోని విశ్రాంతి భవనంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
5/22
6/22
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకం సాధించిన నిఖత్‌ జరీన్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. నిఖత్‌ జరీన్‌తోపాటు షూటర్‌ ఇషా సింగ్‌, ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ సౌమ్య కూడా హైదరాబాద్‌ చేరుకున్నారు. వీరికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో తెలంగాణ మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, వేముల ప్రశాంత్ రెడ్డి, శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. దారిపొడవునా క్రీడాకారులకు జాతీయ జెండాలతో స్వాగతం పలికారు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకం సాధించిన నిఖత్‌ జరీన్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. నిఖత్‌ జరీన్‌తోపాటు షూటర్‌ ఇషా సింగ్‌, ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ సౌమ్య కూడా హైదరాబాద్‌ చేరుకున్నారు. వీరికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో తెలంగాణ మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, వేముల ప్రశాంత్ రెడ్డి, శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. దారిపొడవునా క్రీడాకారులకు జాతీయ జెండాలతో స్వాగతం పలికారు
7/22
8/22
9/22
దిల్లీలో నిర్వహించిన డ్రోన్‌ మహోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ డ్రోన్‌ను గాల్లోకి పంపారు. దిల్లీలో నిర్వహించిన డ్రోన్‌ మహోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ డ్రోన్‌ను గాల్లోకి పంపారు.
10/22
11/22
1845లో క్వీన్‌ విక్టోరియా ధరించిన మరకతం, వజ్రాలు పొదిగిన కిరీటం ఇది. క్వీన్‌ ఎలిజెబెత్‌-2 సింహాసనం అధిష్ఠించి 70 ఏళ్లవుతున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా లండన్‌లో ఏర్పాటు చేసిన సోత్బే ఎగ్జిబిషన్‌లో ఈ కిరీటాన్ని ప్రదర్శనకు ఉంచారు. 1845లో క్వీన్‌ విక్టోరియా ధరించిన మరకతం, వజ్రాలు పొదిగిన కిరీటం ఇది. క్వీన్‌ ఎలిజెబెత్‌-2 సింహాసనం అధిష్ఠించి 70 ఏళ్లవుతున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా లండన్‌లో ఏర్పాటు చేసిన సోత్బే ఎగ్జిబిషన్‌లో ఈ కిరీటాన్ని ప్రదర్శనకు ఉంచారు.
12/22
భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ దిల్లీలోని శాంతి వనంలో ఆయనకు నివాళి అర్పించారు. ప్రధానిగా, స్వాతంత్ర్య సంగ్రామ యోధుడిగా నెహ్రూ దేశానికి చేసిన సేవలను కాంగ్రెస్‌ నేతలు గుర్తు చేసుకున్నారు. భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ దిల్లీలోని శాంతి వనంలో ఆయనకు నివాళి అర్పించారు. ప్రధానిగా, స్వాతంత్ర్య సంగ్రామ యోధుడిగా నెహ్రూ దేశానికి చేసిన సేవలను కాంగ్రెస్‌ నేతలు గుర్తు చేసుకున్నారు.
13/22
14/22
గాజువాక నుంచి రెండోరోజు సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర ప్రారంభమైంది. కార్యక్రమానికి ప్రజలు, వైకాపా కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. గాజువాక నుంచి రెండోరోజు సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర ప్రారంభమైంది. కార్యక్రమానికి ప్రజలు, వైకాపా కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.
15/22
16/22
కుటుంబంలోని వ్యక్తులు మృతి చెందితే ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఆ బాధ నుంచి బయట పడాలనుకునే వారికోసం, ఆత్మీయులకు కడసారి నివాళి అర్పించాలనుకునే వారి కోసం అమెరికాలోని డాన్‌ ఫిషర్‌ అనే సర్ఫర్‌ నూతన మార్గాన్ని కనిపెట్టాడు. దీనికి ‘వన్‌ లాస్ట్‌ వేవ్‌’ అని పేరు పెట్టాడు. చనిపోయిన ఆత్మీయుల పేరును కుటుంబ సభ్యులు ఈయనకు ఈమెయిల్, ఫోన్‌, ప్రత్యక్ష మార్గాల్లో చెబుతుంటారు. వాటిని ఆయన తన సర్ఫ్‌ బోర్డుపై రాసి అక్కడ ఈస్టన్‌ బీచ్‌లో సర్ఫింగ్‌ చేస్తుంటాడు. దీంతో వారికి శాంతి చేకూరుతుందని, కుటుంబ సభ్యులకు బాధ తగ్గుతుందని భావిస్తుంటారు. ఇప్పటికే వందల సంఖ్యలో పేర్లు రాగా రెండు సర్ఫింగ్‌ బోర్డులు పేర్లతో నిండిపోయాయి. కుటుంబంలోని వ్యక్తులు మృతి చెందితే ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఆ బాధ నుంచి బయట పడాలనుకునే వారికోసం, ఆత్మీయులకు కడసారి నివాళి అర్పించాలనుకునే వారి కోసం అమెరికాలోని డాన్‌ ఫిషర్‌ అనే సర్ఫర్‌ నూతన మార్గాన్ని కనిపెట్టాడు. దీనికి ‘వన్‌ లాస్ట్‌ వేవ్‌’ అని పేరు పెట్టాడు. చనిపోయిన ఆత్మీయుల పేరును కుటుంబ సభ్యులు ఈయనకు ఈమెయిల్, ఫోన్‌, ప్రత్యక్ష మార్గాల్లో చెబుతుంటారు. వాటిని ఆయన తన సర్ఫ్‌ బోర్డుపై రాసి అక్కడ ఈస్టన్‌ బీచ్‌లో సర్ఫింగ్‌ చేస్తుంటాడు. దీంతో వారికి శాంతి చేకూరుతుందని, కుటుంబ సభ్యులకు బాధ తగ్గుతుందని భావిస్తుంటారు. ఇప్పటికే వందల సంఖ్యలో పేర్లు రాగా రెండు సర్ఫింగ్‌ బోర్డులు పేర్లతో నిండిపోయాయి.
17/22
18/22
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండలో పర్యటించారు. రెండు రోజుల క్రితం గ్రామంలో వైకాపా కార్యకర్తల దాడిలో గాయపడిన తెదేపా నాయకులు నర్సింహామూర్తి, రవిని ఆయన పరామర్శహంచారు. తమ కార్యకర్తలకు కష్టం వస్తే అర్ధరాత్రైనా వస్తానని వారికి భరోసా ఇచ్చారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండలో పర్యటించారు. రెండు రోజుల క్రితం గ్రామంలో వైకాపా కార్యకర్తల దాడిలో గాయపడిన తెదేపా నాయకులు నర్సింహామూర్తి, రవిని ఆయన పరామర్శహంచారు. తమ కార్యకర్తలకు కష్టం వస్తే అర్ధరాత్రైనా వస్తానని వారికి భరోసా ఇచ్చారు.
19/22
20/22
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ‘యోగా ఉత్సవ్‌’ నిర్వహించారు. కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రులు శర్బానంద సోనోవాల్‌, కిషన్‌రెడ్డి, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. జూన్‌ 21న ప్రపంచ యోగా దినోత్సవం సన్నాహకాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ‘యోగా ఉత్సవ్‌’ నిర్వహించారు. కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రులు శర్బానంద సోనోవాల్‌, కిషన్‌రెడ్డి, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. జూన్‌ 21న ప్రపంచ యోగా దినోత్సవం సన్నాహకాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
21/22
22/22

మరిన్ని