News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 20 Jun 2022 11:34 IST
1/20
కనుల ఎదుట కనిపించే దైవం తండ్రి.. అమ్మ జన్మనిస్తే, జీవితాన్ని సార్థకం చేసుకునే దిశగా నిత్యం నీడలా వెన్నంటి నిలుస్తూ మార్గనిర్దేశం 

చేస్తారు నాన్న. అటువంటి తండ్రి ఘనతను అక్షర రూపంలో తెలిపారు ఒంగోలులోని రావ్‌ అండ్‌ నాయుడులోని ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు. 

తండ్రుల దినోత్సవాన్ని ఆ కళాశాల ప్రాంగణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.  కనుల ఎదుట కనిపించే దైవం తండ్రి.. అమ్మ జన్మనిస్తే, జీవితాన్ని సార్థకం చేసుకునే దిశగా నిత్యం నీడలా వెన్నంటి నిలుస్తూ మార్గనిర్దేశం చేస్తారు నాన్న. అటువంటి తండ్రి ఘనతను అక్షర రూపంలో తెలిపారు ఒంగోలులోని రావ్‌ అండ్‌ నాయుడులోని ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు. తండ్రుల దినోత్సవాన్ని ఆ కళాశాల ప్రాంగణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
2/20
మహబూబ్‌నగర్‌ శివారులోని కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కు(మయూరి)లోని బటర్‌ ఫ్లై విభాగం వద్ద చిత్రాలు తీసుకునేలా సీతాకోక చిలుకల 

రెక్కల నమూనాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.1.80 లక్షలు వెచ్చించారు.ఇక్కడికి వస్తున్న పర్యాటకులు వాటిని చూసి 

ముచ్చటపడుతున్నారు. సీతాకోక చిలుకల్లా రెక్కల మధ్య నిలబడి ఆనందంగా చిత్రాలు తీసుకుంటున్నారు. ఒకటి చిన్నారులు, మరోటి 

పెద్దవాళ్లు చిత్రాలు దిగేందుకు అనుకూలంగా ఉన్నాయి. వాటికి రెండు వైపులా వేర్వేరు రంగులు ఉన్నాయి. తమకు నప్పే రంగులవైపు 

నిలబడి చిత్రాలు తీసుకుంటున్నారు. మహబూబ్‌నగర్‌ శివారులోని కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కు(మయూరి)లోని బటర్‌ ఫ్లై విభాగం వద్ద చిత్రాలు తీసుకునేలా సీతాకోక చిలుకల రెక్కల నమూనాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.1.80 లక్షలు వెచ్చించారు.ఇక్కడికి వస్తున్న పర్యాటకులు వాటిని చూసి ముచ్చటపడుతున్నారు. సీతాకోక చిలుకల్లా రెక్కల మధ్య నిలబడి ఆనందంగా చిత్రాలు తీసుకుంటున్నారు. ఒకటి చిన్నారులు, మరోటి పెద్దవాళ్లు చిత్రాలు దిగేందుకు అనుకూలంగా ఉన్నాయి. వాటికి రెండు వైపులా వేర్వేరు రంగులు ఉన్నాయి. తమకు నప్పే రంగులవైపు నిలబడి చిత్రాలు తీసుకుంటున్నారు.
3/20
తోతాపురి మామిడికాయ హృదయాకారంలో కనిపించింది. దీన్ని బంగారుపాళ్యం మార్కెట్‌లోకి ఆదివారం అమ్మకానికి తీసుకొచ్చారు. ఇది 

హృదయం(గుండె) ఆకారంలో ఉండటంతో యార్డులోని పలువురు వ్యాపారులు, రైతులు ఆసక్తిగా చూశారు. ఓ రైతు ఆమ్మకానికి 

తీసుకొచ్చినట్లు మామిడి వ్యాపారి తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా కాయల ఆకారాల్లో మార్పులు చోటుచేసుకుంటాయని 

ఉద్యానశాఖ ఏడీ కోటీశ్వరరావు, మండల ఉద్యానశాఖాధికారిణి లక్ష్మీప్రసూన తెలిపారు. తోతాపురి మామిడికాయ హృదయాకారంలో కనిపించింది. దీన్ని బంగారుపాళ్యం మార్కెట్‌లోకి ఆదివారం అమ్మకానికి తీసుకొచ్చారు. ఇది హృదయం(గుండె) ఆకారంలో ఉండటంతో యార్డులోని పలువురు వ్యాపారులు, రైతులు ఆసక్తిగా చూశారు. ఓ రైతు ఆమ్మకానికి తీసుకొచ్చినట్లు మామిడి వ్యాపారి తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా కాయల ఆకారాల్లో మార్పులు చోటుచేసుకుంటాయని ఉద్యానశాఖ ఏడీ కోటీశ్వరరావు, మండల ఉద్యానశాఖాధికారిణి లక్ష్మీప్రసూన తెలిపారు.
4/20
కళ్యాణదుర్గంలోని బళ్లారి-అనంతపురం బైపాస్‌కు వెళ్లే మార్గంలో ఒకే కంపెనీకి చెందిన ఔషధ సీసాలు భారీగా పడేశారు. రోడ్డు పక్కన 

నిర్లక్ష్యంగా పడేశారని, పిల్లలు తెలియకుండా తాగితే పరిస్థితి ఏమిటని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వ వైద్యాధికారి 

లక్ష్మీరాంనాయక్‌ మాట్లాడుతూ ఇవన్నీ ఆయాసం బాధితులు వాడే ఔషధాలని చెప్పారు. కాలం చెల్లిన వీటిని పొరపాటున ఎవరైనా తాగితే 

అనర్థాలు జరుగుతాయన్నారు.  కళ్యాణదుర్గంలోని బళ్లారి-అనంతపురం బైపాస్‌కు వెళ్లే మార్గంలో ఒకే కంపెనీకి చెందిన ఔషధ సీసాలు భారీగా పడేశారు. రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా పడేశారని, పిల్లలు తెలియకుండా తాగితే పరిస్థితి ఏమిటని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వ వైద్యాధికారి లక్ష్మీరాంనాయక్‌ మాట్లాడుతూ ఇవన్నీ ఆయాసం బాధితులు వాడే ఔషధాలని చెప్పారు. కాలం చెల్లిన వీటిని పొరపాటున ఎవరైనా తాగితే అనర్థాలు జరుగుతాయన్నారు.
5/20
నంద్యాల పట్టణం నుంచి కర్నూలుకు వెళ్లే రహదారిలో తమ్మరాజుపల్లె సమీపంలో ప్రజలకు కనువిందు చేస్తున్న వృక్షబంధమిది. ప్రధాన 

రహదారి పక్కనే రెండు ఎత్తయిన తాటిచెట్లను జువ్వి చెట్లు అల్లేశాయి. ఎత్తులో తాటిచెట్లను అధిగమించేందుకు పోటీ పడుతున్నట్లు 

పెరుగుతున్న ఈ చెట్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. నంద్యాల పట్టణం నుంచి కర్నూలుకు వెళ్లే రహదారిలో తమ్మరాజుపల్లె సమీపంలో ప్రజలకు కనువిందు చేస్తున్న వృక్షబంధమిది. ప్రధాన రహదారి పక్కనే రెండు ఎత్తయిన తాటిచెట్లను జువ్వి చెట్లు అల్లేశాయి. ఎత్తులో తాటిచెట్లను అధిగమించేందుకు పోటీ పడుతున్నట్లు పెరుగుతున్న ఈ చెట్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
6/20
ఆర్కేబీచ్‌ విశాఖ మ్యూజియం సమీపంలో డ్రాగన్‌ బొమ్మ మూతి భాగం దెబ్బతినడంతో వస్త్రాన్ని అడ్డుగా కట్టారు. దానికి ఎటువంటి 

మరమ్మతులు చేయకుండా వదిలేశారు. దీంతో డ్రాగన్‌కు మాస్క్‌ పెట్టినట్లుగా ఉందని సందర్శకులు పేర్కొంటున్నారు. తీరానికి ఆకర్షణ తెచ్చే 

బొమ్మల నిర్వహణ సరిగా లేకపోవడంతో దెబ్బతింటున్నాయని అంటున్నారు పర్యాటకులు. ఆర్కేబీచ్‌ విశాఖ మ్యూజియం సమీపంలో డ్రాగన్‌ బొమ్మ మూతి భాగం దెబ్బతినడంతో వస్త్రాన్ని అడ్డుగా కట్టారు. దానికి ఎటువంటి మరమ్మతులు చేయకుండా వదిలేశారు. దీంతో డ్రాగన్‌కు మాస్క్‌ పెట్టినట్లుగా ఉందని సందర్శకులు పేర్కొంటున్నారు. తీరానికి ఆకర్షణ తెచ్చే బొమ్మల నిర్వహణ సరిగా లేకపోవడంతో దెబ్బతింటున్నాయని అంటున్నారు పర్యాటకులు.
7/20
విశాఖ ఆర్కేబీచ్‌లోని కురుసుర జలాంతర్గామి మ్యూజియానికి ఉప్పు గాలుల బెడద ఏర్పడింది. దీనికి ఎప్పటికప్పుడు రంగులు వేస్తున్నా 

తీరం చెంతనే ఉండటంతో తరచూ తుప్పు పడుతోంది. మరింత రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా అధికారులు 

ఆలోచన చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.  విశాఖ ఆర్కేబీచ్‌లోని కురుసుర జలాంతర్గామి మ్యూజియానికి ఉప్పు గాలుల బెడద ఏర్పడింది. దీనికి ఎప్పటికప్పుడు రంగులు వేస్తున్నా తీరం చెంతనే ఉండటంతో తరచూ తుప్పు పడుతోంది. మరింత రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా అధికారులు ఆలోచన చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
8/20
9/20
తన గారాల పట్టి ఈ లోకంలో లేనప్పటికీ ఆమె ఫొటో పెట్టి ఓ తండ్రి పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన ఘటన విశాఖ జిల్లా భీమిలి 

మండలం కృష్ణంరాజుపేట గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే తుపాకుల అప్పలనాయుడు కుమార్తె ప్రవళ్లికారెడ్డి(8)ఈ ఏడాది మార్చి 10న 

బ్లడ్‌ క్యాన్సర్‌తో మృతి చెందింది. చనిపోయిన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఆమె చదివిన ట్యూషన్‌ సెంటర్లో బాలల మధ్య ఆదివారం 

రాత్రి కుమార్తె త్రీడీ ఫొటో పెట్టి ఆమె అందరి మధ్య ఉన్న భావనను కల్పిస్తూ ఘనంగా వేడుకలు జరిపారు.  తన గారాల పట్టి ఈ లోకంలో లేనప్పటికీ ఆమె ఫొటో పెట్టి ఓ తండ్రి పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన ఘటన విశాఖ జిల్లా భీమిలి మండలం కృష్ణంరాజుపేట గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే తుపాకుల అప్పలనాయుడు కుమార్తె ప్రవళ్లికారెడ్డి(8)ఈ ఏడాది మార్చి 10న బ్లడ్‌ క్యాన్సర్‌తో మృతి చెందింది. చనిపోయిన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఆమె చదివిన ట్యూషన్‌ సెంటర్లో బాలల మధ్య ఆదివారం రాత్రి కుమార్తె త్రీడీ ఫొటో పెట్టి ఆమె అందరి మధ్య ఉన్న భావనను కల్పిస్తూ ఘనంగా వేడుకలు జరిపారు.
10/20
చుట్టూరా ఎత్తైన పచ్చని గుట్టలు. మధ్యలో శనిగరం జలాలు. ప్రకృతి మాత పరవశంలా ఎటు చూసినా ఆహ్లాదకర వాతావరణం. 

చిత్రకారుడు గీసిన దృశ్యంలా కనబడుతోంది. ఇది సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి శివారులోని శనిగరం చెరువు పరిసరాల 

అందం. చుట్టూరా ఎత్తైన పచ్చని గుట్టలు. మధ్యలో శనిగరం జలాలు. ప్రకృతి మాత పరవశంలా ఎటు చూసినా ఆహ్లాదకర వాతావరణం. చిత్రకారుడు గీసిన దృశ్యంలా కనబడుతోంది. ఇది సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి శివారులోని శనిగరం చెరువు పరిసరాల అందం.
11/20
రాష్ట్రవ్యాప్తంగా జులై 4న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ‘నాడు-నేడు’ పథకానికి ఎంపిక చేసిన పలు బడుల్లో మాత్రం పనులు టెండర్ల 

దశలోనే ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే పేరొందిన ఎస్‌కేబీఎం మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌లో అదనపు తరగతి గదుల 

నిర్మాణానికి కనీసం పునాదులూ తీయలేదు. 1200 మంది విద్యార్థులున్న ఈ బడిలో ప్రస్తుతం 15 తరగతి గదులే ఉన్నాయి. దీంతో సగం 

మంది విద్యార్థులు చెట్ల కిందే కూర్చుంటున్నారు. ఈ పరిస్థితి చూసి అధికారులు పాఠశాలను ‘నాడు-నేడు’ రెండో విడత కింద ఎంపిక 

చేశారు. రూ.1.68 కోట్లతో బడి ఆవరణలో 14 అదనపు తరగతి గదులు నిర్మించాలని నిర్ణయించారు. కానీ, ఇంతవరకు పునాదులే 

తీయలేదు. రాష్ట్రవ్యాప్తంగా జులై 4న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ‘నాడు-నేడు’ పథకానికి ఎంపిక చేసిన పలు బడుల్లో మాత్రం పనులు టెండర్ల దశలోనే ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే పేరొందిన ఎస్‌కేబీఎం మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి కనీసం పునాదులూ తీయలేదు. 1200 మంది విద్యార్థులున్న ఈ బడిలో ప్రస్తుతం 15 తరగతి గదులే ఉన్నాయి. దీంతో సగం మంది విద్యార్థులు చెట్ల కిందే కూర్చుంటున్నారు. ఈ పరిస్థితి చూసి అధికారులు పాఠశాలను ‘నాడు-నేడు’ రెండో విడత కింద ఎంపిక చేశారు. రూ.1.68 కోట్లతో బడి ఆవరణలో 14 అదనపు తరగతి గదులు నిర్మించాలని నిర్ణయించారు. కానీ, ఇంతవరకు పునాదులే తీయలేదు.
12/20
 విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్లే మార్గంలో 20 కిలోమీటర్ల దూరంలో మూలపాడు గ్రామ సమీపంలో కొండపల్లి రిజర్వ్‌ఫారెస్టులో 

2018లో ఏర్పాటుచేసిన సీతాకోకచిలుకల ఉద్యానవనం ఇది.. అందమైన కొండలు, రకరకాల మొక్కలు ఉండటంతో  సీతాకోకచిలుకలకు 

అనువైన ప్రదేశంగా ఉందని అభివృద్ధి చేశారు.కేవలం విజయవాడ నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి పర్యాటకులు 

వచ్చేవారు. కరోనా నేపథ్యంలో మూసివేసిన ఈ పార్కు నేటికీ తెరవలేదు. ఎంతో వ్యయప్రయాసలతో నిత్యం ఇక్కడికి వచ్చే పర్యాటకులు 

గేట్లు మూసివేసి ఉండటంతో నిరాశతో వెను తిరిగిపోతున్నారు. విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్లే మార్గంలో 20 కిలోమీటర్ల దూరంలో మూలపాడు గ్రామ సమీపంలో కొండపల్లి రిజర్వ్‌ఫారెస్టులో 2018లో ఏర్పాటుచేసిన సీతాకోకచిలుకల ఉద్యానవనం ఇది.. అందమైన కొండలు, రకరకాల మొక్కలు ఉండటంతో సీతాకోకచిలుకలకు అనువైన ప్రదేశంగా ఉందని అభివృద్ధి చేశారు.కేవలం విజయవాడ నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి పర్యాటకులు వచ్చేవారు. కరోనా నేపథ్యంలో మూసివేసిన ఈ పార్కు నేటికీ తెరవలేదు. ఎంతో వ్యయప్రయాసలతో నిత్యం ఇక్కడికి వచ్చే పర్యాటకులు గేట్లు మూసివేసి ఉండటంతో నిరాశతో వెను తిరిగిపోతున్నారు.
13/20
14/20
విజయవాడ ఇన్నర్‌రింగురోడ్డు నుంచి రామవరప్పాడు వద్ద  జాతీయ రహదారిపైకి చేరే మార్గంలో రోడ్డంతా గుంతలమయంగా మారింది. 

వర్షం పడితే వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు.  విజయవాడ ఇన్నర్‌రింగురోడ్డు నుంచి రామవరప్పాడు వద్ద జాతీయ రహదారిపైకి చేరే మార్గంలో రోడ్డంతా గుంతలమయంగా మారింది. వర్షం పడితే వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు.
15/20
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దినాజ్‌పుర్‌లో రహదారి పక్కన దుకాణంలోకి దూసుకెళ్లిన కారు పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దినాజ్‌పుర్‌లో రహదారి పక్కన దుకాణంలోకి దూసుకెళ్లిన కారు
16/20
కశ్మీరీ సోయగాలను తలపిస్తున్న ఈ చిత్రం మన హుస్సేన్‌సాగర్‌లో ఆవిష్కృతమైంది. ఆదివారం కయాకింగ్‌ క్రీడాకారులు సాధన చేస్తుండగా ‘ఈనాడు’ క్లిక్‌మన్పించింది. కశ్మీరీ సోయగాలను తలపిస్తున్న ఈ చిత్రం మన హుస్సేన్‌సాగర్‌లో ఆవిష్కృతమైంది. ఆదివారం కయాకింగ్‌ క్రీడాకారులు సాధన చేస్తుండగా ‘ఈనాడు’ క్లిక్‌మన్పించింది.
17/20
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలోని బంకుల్లో డీజిల్‌, పెట్రోల్‌ దొరకక వినియోగదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంధనం లేదంటూ గత కొన్నిరోజులుగా బంకుల వద్ద ‘నో స్టాక్‌’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు సికింద్రాబాద్‌ ఘటనతో రైళ్ల రాకపోకలకు అవాంతరాలు తలెత్తి డీజిల్‌ సరఫరాకు మరింత ఆటంకం ఏర్పడింది. ఏన్కూరులో మూడు బంకులు ఉన్నాయి. వాటిలోని రెండింటిలో శనివారమే నిల్వలు నిండుకున్నాయి. దీంతో మిగిలిన బంకు వద్ద రైతులు ఆదివారం తెల్లవారుజాము నుంచే డబ్బాలతో ఇలా వరసలో నిల్చున్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలోని బంకుల్లో డీజిల్‌, పెట్రోల్‌ దొరకక వినియోగదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంధనం లేదంటూ గత కొన్నిరోజులుగా బంకుల వద్ద ‘నో స్టాక్‌’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు సికింద్రాబాద్‌ ఘటనతో రైళ్ల రాకపోకలకు అవాంతరాలు తలెత్తి డీజిల్‌ సరఫరాకు మరింత ఆటంకం ఏర్పడింది. ఏన్కూరులో మూడు బంకులు ఉన్నాయి. వాటిలోని రెండింటిలో శనివారమే నిల్వలు నిండుకున్నాయి. దీంతో మిగిలిన బంకు వద్ద రైతులు ఆదివారం తెల్లవారుజాము నుంచే డబ్బాలతో ఇలా వరసలో నిల్చున్నారు.
18/20
బాహ్యవలయ రహదారి(ఓఆర్‌ఆర్‌) సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌లో చాలా విద్యుద్దీపాలు వెలగడం లేదు. పటాన్‌చెరు-కొల్లూరు మధ్య అంధకారం. బాహ్యవలయ రహదారి(ఓఆర్‌ఆర్‌) సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌లో చాలా విద్యుద్దీపాలు వెలగడం లేదు. పటాన్‌చెరు-కొల్లూరు మధ్య అంధకారం.
19/20
ఖైరతాబాద్‌ పైవంతెన పక్కన, పీవీ చౌరస్తా సమీపంలోని లేక్‌వ్యూ పార్కులోని ఈ చిత్రం చూసి పచ్చటి మైదానం అనుకొనేరు. చెరువును నాచు కమ్మేసి కంపు కొడుతుండడంతో నడకకు ఎవరూ వెళ్లడంలేదు. ఖైరతాబాద్‌ పైవంతెన పక్కన, పీవీ చౌరస్తా సమీపంలోని లేక్‌వ్యూ పార్కులోని ఈ చిత్రం చూసి పచ్చటి మైదానం అనుకొనేరు. చెరువును నాచు కమ్మేసి కంపు కొడుతుండడంతో నడకకు ఎవరూ వెళ్లడంలేదు.
20/20
వాతావరణం ఆహ్లాదంగా మారడం... ఇటీవల వర్షాలకు చెరువులో కొత్త నీరు చేరడంతో పక్షులు సరదాగా విహరిస్తున్నాయి. ఆదివారం హయత్‌నగర్‌ కాసారంలో బాతు 11 పిల్లలతో వెళ్తూ ఇలా కనిపించింది. వాతావరణం ఆహ్లాదంగా మారడం... ఇటీవల వర్షాలకు చెరువులో కొత్త నీరు చేరడంతో పక్షులు సరదాగా విహరిస్తున్నాయి. ఆదివారం హయత్‌నగర్‌ కాసారంలో బాతు 11 పిల్లలతో వెళ్తూ ఇలా కనిపించింది.

మరిన్ని