News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 22 Jun 2022 22:05 IST
1/25
రొమేనియాలో ప్రభుత్వం అక్కడి ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌కు అధికారాలను పెంచుతూ చట్టాలను మార్చేందుకు నిర్ణయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ పలువురు ఆందోళనకారులు బుచారెస్ట్‌లోని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట భారీ కళ్లను పోలిన మాస్కులు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. రొమేనియాలో ప్రభుత్వం అక్కడి ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌కు అధికారాలను పెంచుతూ చట్టాలను మార్చేందుకు నిర్ణయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ పలువురు ఆందోళనకారులు బుచారెస్ట్‌లోని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట భారీ కళ్లను పోలిన మాస్కులు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు.
2/25
3/25
రిటైర్డ్‌ ఐపీఎస్‌ డా.ఎం.మాలకొండయ్య, సీనియర్‌ ఐఏఎస్‌ డా.పూనం మాలకొండయ్య దంపతుల కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగిన వేడుకలో ఆయన పాల్గొని వధూవరులు పల్లవి, కృష్ణతేజలను ఆశీర్వదించారు. రిటైర్డ్‌ ఐపీఎస్‌ డా.ఎం.మాలకొండయ్య, సీనియర్‌ ఐఏఎస్‌ డా.పూనం మాలకొండయ్య దంపతుల కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగిన వేడుకలో ఆయన పాల్గొని వధూవరులు పల్లవి, కృష్ణతేజలను ఆశీర్వదించారు.
4/25
5/25
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జులై 1న జగన్నాథుడి రథయాత్ర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రదర్శన కోసం పలువురు యువకులు ద్విచక్రవాహనంతో విన్యాసాలను సాధన చేస్తూ కనిపించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జులై 1న జగన్నాథుడి రథయాత్ర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రదర్శన కోసం పలువురు యువకులు ద్విచక్రవాహనంతో విన్యాసాలను సాధన చేస్తూ కనిపించారు.
6/25
బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. దీంతో సిలిహట్‌ నగరంలో స్థానికులు ఇళ్లలోని సామగ్రిని పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. దీంతో సిలిహట్‌ నగరంలో స్థానికులు ఇళ్లలోని సామగ్రిని పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
7/25
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్ మంగళవారం మాస్కులు, టీకాతో పాటు భౌతికదూరం తప్పనిసరి పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ 
గన్‌పౌండ్రిలోని మహబూబియా పాఠశాలలో విద్యార్థులందరు మాస్కులు ధరించి తరగతులు వింటూ కనిపించారు. దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్ మంగళవారం మాస్కులు, టీకాతో పాటు భౌతికదూరం తప్పనిసరి పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ గన్‌పౌండ్రిలోని మహబూబియా పాఠశాలలో విద్యార్థులందరు మాస్కులు ధరించి తరగతులు వింటూ కనిపించారు.
8/25
లండన్‌లోని సోతిబే ఆక్షన్‌ హౌస్‌లో ‘స్టడీ ఫర్‌ పోర్ట్రేట్‌ ఆఫ్‌ లూసేన్‌ ఫ్రెడ్’ అనే చిత్రాన్ని పదర్శనకు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 29న జరగనున్న వేలంలో ఈ చిత్రం సుమారు 35మిలియన్‌ పౌండ్లకు అమ్ముడుపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. లండన్‌లోని సోతిబే ఆక్షన్‌ హౌస్‌లో ‘స్టడీ ఫర్‌ పోర్ట్రేట్‌ ఆఫ్‌ లూసేన్‌ ఫ్రెడ్’ అనే చిత్రాన్ని పదర్శనకు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 29న జరగనున్న వేలంలో ఈ చిత్రం సుమారు 35మిలియన్‌ పౌండ్లకు అమ్ముడుపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
9/25
పేరూరులో నిర్వహిస్తున్న వకుళామాత ఆలయ మహా సంప్రోక్షణకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని అందరికీ మంచి జరగాలని కోరుకున్నారు. పేరూరులో నిర్వహిస్తున్న వకుళామాత ఆలయ మహా సంప్రోక్షణకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని అందరికీ మంచి జరగాలని కోరుకున్నారు.
10/25
11/25
ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఎంపీ సంతోశ్‌కుమార్‌తో కలిసి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. ఈ ఫొటోలను ఎంపీ సంతోశ్‌కుమార్‌ ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాలుపంచుకున్నందుకు సల్మాన్‌ఖాన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టు పెట్టారు. పచ్చదనం పెంపునకు సల్మాన్‌ చేసిన కృషి ఆయన అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఎంపీ సంతోశ్‌కుమార్‌తో కలిసి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. ఈ ఫొటోలను ఎంపీ సంతోశ్‌కుమార్‌ ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాలుపంచుకున్నందుకు సల్మాన్‌ఖాన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టు పెట్టారు. పచ్చదనం పెంపునకు సల్మాన్‌ చేసిన కృషి ఆయన అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.
12/25
13/25
జనగామ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అక్కడి ఖిలాషాపూర్‌ గ్రామంలోని బీఆర్‌ అంబేడ్కర్, సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌‌, బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆ విగ్రహాల వద్ద ఉన్న చెత్త, మట్టికుప్పలను ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్థులకు సూచించారు. జనగామ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అక్కడి ఖిలాషాపూర్‌ గ్రామంలోని బీఆర్‌ అంబేడ్కర్, సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌‌, బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆ విగ్రహాల వద్ద ఉన్న చెత్త, మట్టికుప్పలను ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్థులకు సూచించారు.
14/25
15/25
భారతీయ బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని పరారైన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ను కలిశారు. ఈ ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్న మాల్యా.. తన స్నేహితుడు, యూనివర్సల్ బాస్‌ను కలుసుకోవడం ఆనందంగా ఉందని తెలుపుతూ పోస్టు పెట్టారు. భారతీయ బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని పరారైన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ను కలిశారు. ఈ ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్న మాల్యా.. తన స్నేహితుడు, యూనివర్సల్ బాస్‌ను కలుసుకోవడం ఆనందంగా ఉందని తెలుపుతూ పోస్టు పెట్టారు.
16/25
1998 డీఎస్సీ అభ్యర్థులు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. 24ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించారని హర్షం వ్యక్తం చేస్తూ సీఎంను శాలువాతో సత్కరించారు. 1998 డీఎస్సీ అభ్యర్థులు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. 24ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించారని హర్షం వ్యక్తం చేస్తూ సీఎంను శాలువాతో సత్కరించారు.
17/25
ఆత్మకూరు శాసనసభ స్థానం ఉపఎన్నికను గురువారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఆత్మకూరు ఏఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ప్రత్యేక ఆకృతిలో కూర్చొని అవగాహన కల్పించారు. మేకపాటి గౌతమ్ మృతి చెందడంతో ఈ అసెంబ్లీ స్థానంలో ఉపఎన్నిక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆత్మకూరు శాసనసభ స్థానం ఉపఎన్నికను గురువారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఆత్మకూరు ఏఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ప్రత్యేక ఆకృతిలో కూర్చొని అవగాహన కల్పించారు. మేకపాటి గౌతమ్ మృతి చెందడంతో ఈ అసెంబ్లీ స్థానంలో ఉపఎన్నిక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
18/25
ఎంపీ సంతోశ్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించింది. ప్రముఖ పోలార్‌ ఎక్స్‌ప్లోరర్‌ రాబర్ట్‌ స్వాన్‌ ఈ కార్యక్రమం గొప్పతనాన్ని గుర్తించి దక్షిణ ధ్రువం అంటార్కిటికాలో దీనికి సంబంధించిన పతాకాన్ని ఎగురవేశారు. ఈ ఫొటోలను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్న ఎంపీ సంతోశ్‌కుమార్‌.. రాబర్ట్‌ స్వాన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టు పెట్టారు. ఎంపీ సంతోశ్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించింది. ప్రముఖ పోలార్‌ ఎక్స్‌ప్లోరర్‌ రాబర్ట్‌ స్వాన్‌ ఈ కార్యక్రమం గొప్పతనాన్ని గుర్తించి దక్షిణ ధ్రువం అంటార్కిటికాలో దీనికి సంబంధించిన పతాకాన్ని ఎగురవేశారు. ఈ ఫొటోలను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్న ఎంపీ సంతోశ్‌కుమార్‌.. రాబర్ట్‌ స్వాన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టు పెట్టారు.
19/25
20/25
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 255మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అక్కడి పక్తిక ప్రావిన్స్‌లోని గయాన్‌ జిల్లాలో క్షతగాత్రులను ప్రభుత్వ హెలికాప్టర్‌లో హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 255మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అక్కడి పక్తిక ప్రావిన్స్‌లోని గయాన్‌ జిల్లాలో క్షతగాత్రులను ప్రభుత్వ హెలికాప్టర్‌లో హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు.
21/25
రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో ప్యాలస్‌ స్క్వేర్ వద్ద మాతృభూమి స్మారకం తరహాలో దీపాలు వెలిగించారు. రెండో ప్రపంచ యుద్ధ 

సమయంలో నాజీ దండయాత్రకు గుర్తుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో ప్యాలస్‌ స్క్వేర్ వద్ద మాతృభూమి స్మారకం తరహాలో దీపాలు వెలిగించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ దండయాత్రకు గుర్తుగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
22/25
23/25
ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపదీ ముర్మూ ఈ రోజు తన స్వరాష్ట్రం ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాకు చెందిన 

రాయ్‌రంగ్‌పుర్‌లోని శివాలయానికి వెళ్లారు. గుడిలో నేరుగా దేవుడి దర్శనానికి వెళ్లకుండా.. ఆలయ ప్రాంగణాన్ని చీపురుతో శుభ్రపరిచారు. ఆ 

తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపదీ ముర్మూ ఈ రోజు తన స్వరాష్ట్రం ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాకు చెందిన రాయ్‌రంగ్‌పుర్‌లోని శివాలయానికి వెళ్లారు. గుడిలో నేరుగా దేవుడి దర్శనానికి వెళ్లకుండా.. ఆలయ ప్రాంగణాన్ని చీపురుతో శుభ్రపరిచారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు.
24/25
తెలంగాణ రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి కార్పొరేషన్‌(రెడ్‌ కో) ఛైర్మన్‌గా నియమితులైన వై.సతీశ్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర 

ఫిలిం, టెలివిజన్‌&థియేటర్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమితులైన అనిల్‌ కుర్మాచలం తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి 

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమను నూతన పదవులకు ఎంపిక చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి కార్పొరేషన్‌(రెడ్‌ కో) ఛైర్మన్‌గా నియమితులైన వై.సతీశ్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఫిలిం, టెలివిజన్‌&థియేటర్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమితులైన అనిల్‌ కుర్మాచలం తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమను నూతన పదవులకు ఎంపిక చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
25/25
సాధారణంగా ఇంటి నంబర్లు గేటు, గోడలపై కనిపిస్తుంటాయి. అలా ఉంటే తన ప్రత్యేకత ఏముంటుందని భావించాడో యజమాని. ఇలా 

వినూత్నంగా ఓ రాయిపై తన ఇంటి పేరు, నంబరు చెక్కించి వైవిధ్యాన్ని చాటుకున్నాడు. జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్‌ 10లోనిదీ చిత్రం. సాధారణంగా ఇంటి నంబర్లు గేటు, గోడలపై కనిపిస్తుంటాయి. అలా ఉంటే తన ప్రత్యేకత ఏముంటుందని భావించాడో యజమాని. ఇలా వినూత్నంగా ఓ రాయిపై తన ఇంటి పేరు, నంబరు చెక్కించి వైవిధ్యాన్ని చాటుకున్నాడు. జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్‌ 10లోనిదీ చిత్రం.

మరిన్ని