News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 2 (31-07-2022)

Updated : 31 Jul 2022 20:41 IST
1/20
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సాన్వీక కూచిపూడి రంగప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన నృత్య ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సాన్వీక కూచిపూడి రంగప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన నృత్య ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.
2/20
3/20
హైదరాబాద్‌ నగరంలో ఆదివారం సాయంత్రం మరోసారి వర్షం దంచికొట్టింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, లక్డీకపూల్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్డుపైనే నీరు నిలిచిపోయింది. ముషీరాబాద్‌, చిక్కడపల్లి, రాంనగర్‌, కవాడిగూడ, దోమల్‌గూడ, భోలక్‌పూర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, జవహర్ నగర్ తదితర ప్రాంతాల్లోనూ వర్షం పడింది. హైదరాబాద్‌ నగరంలో ఆదివారం సాయంత్రం మరోసారి వర్షం దంచికొట్టింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, లక్డీకపూల్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్డుపైనే నీరు నిలిచిపోయింది. ముషీరాబాద్‌, చిక్కడపల్లి, రాంనగర్‌, కవాడిగూడ, దోమల్‌గూడ, భోలక్‌పూర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, జవహర్ నగర్ తదితర ప్రాంతాల్లోనూ వర్షం పడింది.
4/20
5/20
హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌ కట్టమైసమ్మ, కొత్తపేట ఖిల్లా మైసమ్మ ఆలయాల్లో ఆదివారం బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలను సమర్పించారు. హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌ కట్టమైసమ్మ, కొత్తపేట ఖిల్లా మైసమ్మ ఆలయాల్లో ఆదివారం బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలను సమర్పించారు.
6/20
7/20
వర్షం వస్తే చాలు ఆదిలాబాద్‌లోని ఖానాపూర్‌ చెరువు చుట్టూ ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్న ప్రజలు దినదిన గండంగా బతుకుతున్నారు. భారీ వర్షాలు వస్తే చెరువులో నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని బాధితులు వాపోతున్నారు. చెరువు కట్టపై ఆక్రమణలు ఉన్నాయని ఆరోపణలున్నా, వీటిలో చాలావరకు అధికారులు అనుమతులు ఇచ్చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. వర్షం వస్తే చాలు ఆదిలాబాద్‌లోని ఖానాపూర్‌ చెరువు చుట్టూ ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్న ప్రజలు దినదిన గండంగా బతుకుతున్నారు. భారీ వర్షాలు వస్తే చెరువులో నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని బాధితులు వాపోతున్నారు. చెరువు కట్టపై ఆక్రమణలు ఉన్నాయని ఆరోపణలున్నా, వీటిలో చాలావరకు అధికారులు అనుమతులు ఇచ్చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
8/20
9/20
హైదరాబాద్‌ హైటెక్‌సిటీలోని ఓ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో కొత్త రకం ఐస్‌క్రీమ్‌ను లాంచ్‌ చేశారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఐస్‌క్రీమ్‌లు తింటూ, ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌ హైటెక్‌సిటీలోని ఓ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో కొత్త రకం ఐస్‌క్రీమ్‌ను లాంచ్‌ చేశారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఐస్‌క్రీమ్‌లు తింటూ, ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
10/20
11/20
కామన్వెల్త్‌ క్రీడల్లో వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో భారత క్రీడాకారుడు 19 ఏళ్ల జెరెమీ లాల్‌ రిన్నుంగా అద్భుత ప్రదర్శనతో అబ్బురపరిచాడు. 67 కేజీల విభాగంలో ఏకంగా పసిడి సాధించాడు. స్నాచ్‌ ఈవెంట్‌లో 140 కేజీలు ఎత్తి కామన్వెల్త్‌ క్రీడల్లో రికార్డు సృష్టిస్తూ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో మొత్తంగా 160 కిలోలు ఎత్తాడు. దీంతో మొత్తంగా 300 కిలోలకు పైగా ఎత్తి ఓవరాల్‌గానూ రికార్డు సృష్టించాడు.. కామన్వెల్త్‌ క్రీడల్లో వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో భారత క్రీడాకారుడు 19 ఏళ్ల జెరెమీ లాల్‌ రిన్నుంగా అద్భుత ప్రదర్శనతో అబ్బురపరిచాడు. 67 కేజీల విభాగంలో ఏకంగా పసిడి సాధించాడు. స్నాచ్‌ ఈవెంట్‌లో 140 కేజీలు ఎత్తి కామన్వెల్త్‌ క్రీడల్లో రికార్డు సృష్టిస్తూ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో మొత్తంగా 160 కిలోలు ఎత్తాడు. దీంతో మొత్తంగా 300 కిలోలకు పైగా ఎత్తి ఓవరాల్‌గానూ రికార్డు సృష్టించాడు..
12/20
ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత నిశ్చితార్థ వేడుకను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత నిశ్చితార్థ వేడుకను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు.
13/20
14/20
మాధవన్‌ ప్రధాన పాత్రలో ప్రముఖ ఇస్రో శాస్ర్తవేత్త నంబి నారాయణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ‌’. ఈ సినిమాకు ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా మాధవన్‌, నంబి నారాయణ్‌ను ఆయన సత్కరించారు. సినిమా బాగుందని ప్రశంసించారు. మాధవన్‌ ప్రధాన పాత్రలో ప్రముఖ ఇస్రో శాస్ర్తవేత్త నంబి నారాయణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ‌’. ఈ సినిమాకు ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా మాధవన్‌, నంబి నారాయణ్‌ను ఆయన సత్కరించారు. సినిమా బాగుందని ప్రశంసించారు.
15/20
16/20
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర తన ట్విటర్‌ ఖాతాలో ఆసక్తికర పోస్టును పంచుకున్నారు. గతంలో ఇటలీలోని ఓ ఎగ్జిబిషన్‌లో ‘లైఫ్‌ ఈజ్‌ షార్ట్‌.. ఎంజాయ్‌ ఇట్‌ బిఫోర్ మెల్ట్స్‌(జీవితం చాలా చిన్నది.. కరిగే లోగా ఆనందించండి)’ అనే పేరుతో ఏర్పాటు చేసిన కళాఖండం ఫొటోను షేర్‌ చేశారు. ఇది శక్తిమంతమైన ఫొటో.. ఈ ఆదివారానికి ఇదే సరైన సందేశం అని తెలిపారు. ఈ భూమి మీద మనం ఆనందించే జీవితమంతా.. ఓ చిన్న ప్రయాణం లాంటిదని ఆనంద్‌ మహీంద్రా చెప్పారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర తన ట్విటర్‌ ఖాతాలో ఆసక్తికర పోస్టును పంచుకున్నారు. గతంలో ఇటలీలోని ఓ ఎగ్జిబిషన్‌లో ‘లైఫ్‌ ఈజ్‌ షార్ట్‌.. ఎంజాయ్‌ ఇట్‌ బిఫోర్ మెల్ట్స్‌(జీవితం చాలా చిన్నది.. కరిగే లోగా ఆనందించండి)’ అనే పేరుతో ఏర్పాటు చేసిన కళాఖండం ఫొటోను షేర్‌ చేశారు. ఇది శక్తిమంతమైన ఫొటో.. ఈ ఆదివారానికి ఇదే సరైన సందేశం అని తెలిపారు. ఈ భూమి మీద మనం ఆనందించే జీవితమంతా.. ఓ చిన్న ప్రయాణం లాంటిదని ఆనంద్‌ మహీంద్రా చెప్పారు.
17/20
మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే ఉంటుందని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. డెంగ్యూ నివారణలో భాగంగా ఆయన తన ఇంటి పరిసరాలను స్వయంగా శుభ్రం చేశారు. దోమల వ్యాప్తి అరికట్టేందుకు ప్రజలంతా ప్రతి ఆదివారం పది నిమిషాలు సమయం కేటాయించి తమ ఇళ్ల చుట్టూ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే ఉంటుందని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. డెంగ్యూ నివారణలో భాగంగా ఆయన తన ఇంటి పరిసరాలను స్వయంగా శుభ్రం చేశారు. దోమల వ్యాప్తి అరికట్టేందుకు ప్రజలంతా ప్రతి ఆదివారం పది నిమిషాలు సమయం కేటాయించి తమ ఇళ్ల చుట్టూ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
18/20
19/20
గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ అఖిల భార గో సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 40మంది సభ్యులు హైదరాబాద్‌ నుంచి తిరుమలకు మహా పాదయాత్ర చేపట్టారు. హిమాయత్‌నగర్‌లోని తితిదే దేవాలయం వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మాజీ ఐపీఎస్‌ అధికారి వీవీ లక్ష్మీనారాయణ కలిసి జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. 
గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ అఖిల భార గో సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 40మంది సభ్యులు హైదరాబాద్‌ నుంచి తిరుమలకు మహా పాదయాత్ర చేపట్టారు. హిమాయత్‌నగర్‌లోని తితిదే దేవాలయం వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మాజీ ఐపీఎస్‌ అధికారి వీవీ లక్ష్మీనారాయణ కలిసి జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు.
20/20
సినీనటుడు కల్యాణ్‌రామ్‌ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు ‘బింబిసార’ చిత్రబృంద సభ్యులు కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటించిన ‘బింబిసార’ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది. సినీనటుడు కల్యాణ్‌రామ్‌ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు ‘బింబిసార’ చిత్రబృంద సభ్యులు కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటించిన ‘బింబిసార’ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది.

మరిన్ని