News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (04-08-2022)

Updated : 04 Aug 2022 20:36 IST
1/25
శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఉండటంతో సికింద్రాబాద్‌ మొండా మార్కెట్‌ కొనుగోలుదారులతో సందడిగా మారింది. దీంతో ట్రాఫిక్‌ భారీగా స్తంభించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఉండటంతో సికింద్రాబాద్‌ మొండా మార్కెట్‌ కొనుగోలుదారులతో సందడిగా మారింది. దీంతో ట్రాఫిక్‌ భారీగా స్తంభించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
2/25
అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటలో నిర్వహించిన ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ కుమార్తె వివాహ వేడుకకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వధూవరులను ఆశీర్వదించారు. అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటలో నిర్వహించిన ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ కుమార్తె వివాహ వేడుకకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వధూవరులను ఆశీర్వదించారు.
3/25
‘హర్‌ ఘర్ తిరంగా’ ప్రచార నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని తపాలా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘సెల్ఫీ విత్‌ తిరంగా’ వద్ద యువత ఆసక్తిగా ఫొటోలు తీసుకున్నారు. ‘హర్‌ ఘర్ తిరంగా’ ప్రచార నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని తపాలా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘సెల్ఫీ విత్‌ తిరంగా’ వద్ద యువత ఆసక్తిగా ఫొటోలు తీసుకున్నారు.
4/25
జోద్‌పూర్‌లోని పోలీసు కమిషనర్‌ కార్యాలయం వద్ద ఓ నెమలి ఇలా జాతీయ పతాకం స్తంభంపై నిల్చొని పరవశించిపోయింది. జాతీయ పక్షి, జాతీయ జెండా ఒకే చోట కనిపించడంతో ఈ దృశ్యం చూపరులను కనువిందు చేసింది. జోద్‌పూర్‌లోని పోలీసు కమిషనర్‌ కార్యాలయం వద్ద ఓ నెమలి ఇలా జాతీయ పతాకం స్తంభంపై నిల్చొని పరవశించిపోయింది. జాతీయ పక్షి, జాతీయ జెండా ఒకే చోట కనిపించడంతో ఈ దృశ్యం చూపరులను కనువిందు చేసింది.
5/25
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఆయన నివాసంలో కలిసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా మన్మోహన్‌ సింగ్‌ ఆయురారోగ్యాలతో జీవించాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఆయన నివాసంలో కలిసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మన్మోహన్‌ సింగ్‌ ఆయురారోగ్యాలతో జీవించాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.
6/25
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు సెల్‌కాన్‌ సంస్థ సీఎండీ గురు దంపతులు రూ.కోటి విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు సెల్‌కాన్‌ సంస్థ సీఎండీ గురు దంపతులు రూ.కోటి విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.
7/25
ఏడెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్‌లో నిర్మితమైన పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం కేసీఆర్‌ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఏడెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్‌లో నిర్మితమైన పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం కేసీఆర్‌ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు.
8/25
9/25
10/25
జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ కార్ట్‌వీల్‌ గెలాక్సీకి చెందిన అద్భుతమైన ఫొటోలను విడుదల చేసింది. 500 మిలియన్‌ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గెలాక్సీ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. వీటిని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ కార్ట్‌వీల్‌ గెలాక్సీకి చెందిన అద్భుతమైన ఫొటోలను విడుదల చేసింది. 500 మిలియన్‌ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గెలాక్సీ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. వీటిని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది.
11/25
12/25
ఈ చిత్రాన్ని చూస్తే హైదరాబాద్‌ నగరంలో పచ్చని చెట్ల మధ్య దూసుకుపోతున్న మెట్రో రైలులా కనిపిస్తోంది కదూ. బంజారాహిల్స్‌లో పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నిర్మాణ కార్మికుల తాత్కాలిక నివాసాలు ఇవి. ఈ చిత్రం దూరం నుంచి చూసేవారికి పచ్చని ప్రకృతి మధ్యలో వెళ్తున్న రైలుబండిలా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని చూస్తే హైదరాబాద్‌ నగరంలో పచ్చని చెట్ల మధ్య దూసుకుపోతున్న మెట్రో రైలులా కనిపిస్తోంది కదూ. బంజారాహిల్స్‌లో పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నిర్మాణ కార్మికుల తాత్కాలిక నివాసాలు ఇవి. ఈ చిత్రం దూరం నుంచి చూసేవారికి పచ్చని ప్రకృతి మధ్యలో వెళ్తున్న రైలుబండిలా కనిపిస్తోంది.
13/25
హుస్సేన్‌ సాగర్‌లో ప్లాస్టిక్‌ వ్యర్థాల కోసం ఓ వ్యక్తి ఇలా నీటిలోకి దిగి వెతుకుతూ కనిపించాడు. పొట్టకూటికి పుట్టెడు తిప్పలు అంటే ఇదే మరి. హుస్సేన్‌ సాగర్‌లో ప్లాస్టిక్‌ వ్యర్థాల కోసం ఓ వ్యక్తి ఇలా నీటిలోకి దిగి వెతుకుతూ కనిపించాడు. పొట్టకూటికి పుట్టెడు తిప్పలు అంటే ఇదే మరి.
14/25
హైదరాబాద్‌ నగర శివారు హయత్‌ నగర్‌లోని ఓ వ్యవసాయ బావి వద్ద చెట్టుకు గిజిగాడు పక్షులు గూళ్లు కట్టుకుంటున్నాయి. పక్కనే ఉన్న పొలాల్లో గడ్డిపరకలను ముక్కుతో పట్టుకొచ్చి పద్ధతిగా గూళ్లు తీర్చిదిద్దుకుంటున్నాయి. హైదరాబాద్‌ నగర శివారు హయత్‌ నగర్‌లోని ఓ వ్యవసాయ బావి వద్ద చెట్టుకు గిజిగాడు పక్షులు గూళ్లు కట్టుకుంటున్నాయి. పక్కనే ఉన్న పొలాల్లో గడ్డిపరకలను ముక్కుతో పట్టుకొచ్చి పద్ధతిగా గూళ్లు తీర్చిదిద్దుకుంటున్నాయి.
15/25
16/25
17/25
ఒంగోలులో విద్యార్థులు ‘హర్‌ ఘర్‌ తిరంగా’పై అవగాహన కల్పిస్తూ భారీ జాతీయ జెండాతో ఇలా ప్రదర్శన ఇచ్చారు. ఒంగోలులో విద్యార్థులు ‘హర్‌ ఘర్‌ తిరంగా’పై అవగాహన కల్పిస్తూ భారీ జాతీయ జెండాతో ఇలా ప్రదర్శన ఇచ్చారు.
18/25
19/25
వరంగల్‌ మున్సిపల్ కార్పొరేషన్‌లో గ్రేటర్‌ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ సైకిల్‌పై వచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేళ పర్యావరణ హితం కోరుతూ ఆయన సైకిల్‌కు జాతీయజెండా కట్టుకొని రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరంగల్‌ మున్సిపల్ కార్పొరేషన్‌లో గ్రేటర్‌ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ సైకిల్‌పై వచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేళ పర్యావరణ హితం కోరుతూ ఆయన సైకిల్‌కు జాతీయజెండా కట్టుకొని రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
20/25
తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజుకు చేరింది. భువనగిరి నియోజకవర్గంలోని గొల్లగూడెం, ముగ్ధంపల్లి, పెద్దపలుగు తండా, చిన్నరావులపల్లి, గుర్రాలదండి మీదుగా బట్టుగూడెం వరకు నేటి యాత్ర సాగనుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజుకు చేరింది. భువనగిరి నియోజకవర్గంలోని గొల్లగూడెం, ముగ్ధంపల్లి, పెద్దపలుగు తండా, చిన్నరావులపల్లి, గుర్రాలదండి మీదుగా బట్టుగూడెం వరకు నేటి యాత్ర సాగనుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
21/25
పార్లమెంటులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సహచర ఎంపీలతో ముచ్చటిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పార్లమెంటులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సహచర ఎంపీలతో ముచ్చటిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ
22/25
నెల్లూరులో ఈ ఉదయం ఏర్పడిన ట్రాఫిక్‌ జామ్‌ వాహనదారులకు చుక్కలు చూపించింది. రైల్వే అండర్‌పాస్‌ వద్ద నిలిచిన వరద నీటిలో వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పెన్నానది బ్రిడ్జి, వెంకటేశ్వరపురం బ్రిడ్జిపై తీవ్ర రద్దీ నెలకొంది. దాదాపు రెండు గంటలపాటు వాహనాలు ముందుకు కదల్లేదు. ఇదే సమయంలో అటుగా వచ్చిన అంబులెన్స్‌ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. అందులోని బాధితులు తీవ్ర అవస్థలు పడ్డారు. నెల్లూరులో ఈ ఉదయం ఏర్పడిన ట్రాఫిక్‌ జామ్‌ వాహనదారులకు చుక్కలు చూపించింది. రైల్వే అండర్‌పాస్‌ వద్ద నిలిచిన వరద నీటిలో వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పెన్నానది బ్రిడ్జి, వెంకటేశ్వరపురం బ్రిడ్జిపై తీవ్ర రద్దీ నెలకొంది. దాదాపు రెండు గంటలపాటు వాహనాలు ముందుకు కదల్లేదు. ఇదే సమయంలో అటుగా వచ్చిన అంబులెన్స్‌ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. అందులోని బాధితులు తీవ్ర అవస్థలు పడ్డారు.
23/25
24/25
25/25

మరిన్ని