News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 2 (21-09-2022)

Updated : 21 Sep 2022 20:33 IST
1/19
ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాత్సవ కన్నుమూశారు. గుండెపోటుతో గత నెల 10న దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని 
పూరీ తీరంలో ఆయన సైకత శిల్పాన్ని తీర్చిదిద్ది నివాళి అర్పించారు. ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాత్సవ కన్నుమూశారు. గుండెపోటుతో గత నెల 10న దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన సైకత శిల్పాన్ని తీర్చిదిద్ది నివాళి అర్పించారు.
2/19
హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో అజిత్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘తునివు’. ఇందులో అజిత్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ఫొటోలో ‘తలా’ చేతిలో గన్‌ పట్టుకొని, తెల్లని గడ్డం, చెవిపోగుతో కనిపించారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో అజిత్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘తునివు’. ఇందులో అజిత్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ఫొటోలో ‘తలా’ చేతిలో గన్‌ పట్టుకొని, తెల్లని గడ్డం, చెవిపోగుతో కనిపించారు.
3/19
కర్నూలులోని డోన్‌ ప్రాంతవాసులు రెండు రైల్వే గేట్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సగం డోన్‌ను వేరు చేసే రైల్వే గేటు ప్రధాన సమస్యగా మారినట్లు స్థానికులు చెబుతున్నారు. ఫ్లైఓవర్‌ నుంచి టౌన్‌కు తిరిగిరావాలంటే సుమారు 2కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది. దీంతో ప్రజలంతా దగ్గరిదారి కావడంతో ప్రమాదకరంగా గేటు దాటుతున్నారు. రైలు వస్తున్నా ఖాతరు చేయకుండా కొందరు సాహసాలు చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి అండర్‌పాస్‌ వంతెన ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కర్నూలులోని డోన్‌ ప్రాంతవాసులు రెండు రైల్వే గేట్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సగం డోన్‌ను వేరు చేసే రైల్వే గేటు ప్రధాన సమస్యగా మారినట్లు స్థానికులు చెబుతున్నారు. ఫ్లైఓవర్‌ నుంచి టౌన్‌కు తిరిగిరావాలంటే సుమారు 2కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది. దీంతో ప్రజలంతా దగ్గరిదారి కావడంతో ప్రమాదకరంగా గేటు దాటుతున్నారు. రైలు వస్తున్నా ఖాతరు చేయకుండా కొందరు సాహసాలు చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి అండర్‌పాస్‌ వంతెన ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
4/19
5/19
అమరావతి రైతుల మహాపాదయాత్ర కృష్ణా జిల్లా చల్లపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు స్థానికులతో కలిసి పెద్దఎత్తున మువ్వన్నెల జెండాతో ప్రదర్శన చేపట్టారు. అనంతరం అక్కడి గాంధీ విగ్రహం వద్ద అమరాతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేశారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర కృష్ణా జిల్లా చల్లపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు స్థానికులతో కలిసి పెద్దఎత్తున మువ్వన్నెల జెండాతో ప్రదర్శన చేపట్టారు. అనంతరం అక్కడి గాంధీ విగ్రహం వద్ద అమరాతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేశారు.
6/19
7/19
ఈయన పేరు రిషీ శుక్లా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రం బోపాల్‌లోని ఓ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు . నీలిచిత్రాలు చూడొద్దని యువతకు సందేశమిస్తూ సైకిల్‌ యాత్ర చేపట్టాడు. ఐదు నెలల పాటు 14వేల కిలోమీటర్లు ప్రయాణించాలనే సంకల్పంతో ఆగస్టు 15న బోపాల్‌ నుంచి బయలుదేరాడు. ఇప్పటివరకు సుమారు 2,800 కిలోమీటర్లు ప్రయాణించి ఒంగోలు చేరుకున్నాడు. ఈయన పేరు రిషీ శుక్లా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రం బోపాల్‌లోని ఓ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు . నీలిచిత్రాలు చూడొద్దని యువతకు సందేశమిస్తూ సైకిల్‌ యాత్ర చేపట్టాడు. ఐదు నెలల పాటు 14వేల కిలోమీటర్లు ప్రయాణించాలనే సంకల్పంతో ఆగస్టు 15న బోపాల్‌ నుంచి బయలుదేరాడు. ఇప్పటివరకు సుమారు 2,800 కిలోమీటర్లు ప్రయాణించి ఒంగోలు చేరుకున్నాడు.
8/19
ఝార్ఖండ్‌లోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్‌ రోడ్లకు మరమ్మతులు చేయాలని కోరుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. రోడ్డుపై ఓ నీటి గుంతలో కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణం, మరమ్మతుల బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు. ఝార్ఖండ్‌లోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్‌ రోడ్లకు మరమ్మతులు చేయాలని కోరుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. రోడ్డుపై ఓ నీటి గుంతలో కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణం, మరమ్మతుల బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు.
9/19
మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్‌, కార్తి, ఐశ్వర్యరాయ్‌, త్రిష, జయం రవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఈ నెల 23న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ నెల 30న పొన్నియిన్‌ సెల్వన్‌ తొలిభాగాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు.. మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్‌, కార్తి, ఐశ్వర్యరాయ్‌, త్రిష, జయం రవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఈ నెల 23న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ నెల 30న పొన్నియిన్‌ సెల్వన్‌ తొలిభాగాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు..
10/19
అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది ఘోస్ట్‌’. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను సెప్టెంబర్‌ 25న కర్నూలులో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ‘ది ఘోస్ట్‌’ అక్టోబర్‌ 5న థియేటర్లలో విడుదల కానుంది. అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది ఘోస్ట్‌’. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను సెప్టెంబర్‌ 25న కర్నూలులో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ‘ది ఘోస్ట్‌’ అక్టోబర్‌ 5న థియేటర్లలో విడుదల కానుంది.
11/19
భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన నాలుగో విడత ప్రజా సంగ్రామయాత్ర హైదరాబాద్‌లోని నాగోలులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా గొల్లకురుమలు ఆయన్ను కంబలి, గొర్రెపిల్లతో సత్కరించారు. భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన నాలుగో విడత ప్రజా సంగ్రామయాత్ర హైదరాబాద్‌లోని నాగోలులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా గొల్లకురుమలు ఆయన్ను కంబలి, గొర్రెపిల్లతో సత్కరించారు.
12/19
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తిరుపతిలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. అలిపిరి నుంచి శ్రీహరిధామం వరకు ఈ పరుగు కొనసాగింది.
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తిరుపతిలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. అలిపిరి నుంచి శ్రీహరిధామం వరకు ఈ పరుగు కొనసాగింది.
13/19
కర్ణాటకలో భాజపా ప్రభుత్వం అవినీతి చేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ వినూత్న రీతిలో నిరసన తెలుపుతోంది. బెంగళూరులో ‘పే సీఎం’ పేరుతో గోడప్రతులను అంటించింది. ‘40 శాతం తీసుకుంటాం’ అంటూ వాటిపై రాయడంతో పాటు క్యూఆర్‌ కోడ్‌, సీఎం బసవరాజ్‌ బొమ్మై ఫొటోలను జత చేసింది. ఈ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయగానే 40 పర్సెంట్‌ సర్కార్‌ వెబ్‌సైట్‌కు తీసుకువెళ్తోంది. ఈ సైట్‌లో భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్‌ చేస్తున్న పలు అవినీతి ఆరోపణలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో భాజపా ప్రభుత్వం అవినీతి చేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ వినూత్న రీతిలో నిరసన తెలుపుతోంది. బెంగళూరులో ‘పే సీఎం’ పేరుతో గోడప్రతులను అంటించింది. ‘40 శాతం తీసుకుంటాం’ అంటూ వాటిపై రాయడంతో పాటు క్యూఆర్‌ కోడ్‌, సీఎం బసవరాజ్‌ బొమ్మై ఫొటోలను జత చేసింది. ఈ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయగానే 40 పర్సెంట్‌ సర్కార్‌ వెబ్‌సైట్‌కు తీసుకువెళ్తోంది. ఈ సైట్‌లో భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్‌ చేస్తున్న పలు అవినీతి ఆరోపణలు కనిపిస్తున్నాయి.
14/19
ఈ నెల 25న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌ టికెట్ల జారీలో జాప్యంపై క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వైఖరికి నిరసనగా నగరంలోని జింఖానా మైదానం వద్ద ఆందోళనకు దిగారు. అక్కడే టికెట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ నెల 25న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌ టికెట్ల జారీలో జాప్యంపై క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వైఖరికి నిరసనగా నగరంలోని జింఖానా మైదానం వద్ద ఆందోళనకు దిగారు. అక్కడే టికెట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు.
15/19
16/19
ఆస్ట్రేలియాలోని స్ట్రహాన్‌ సమీప ఓషియన్‌ బీచ్‌లో దాదాపు రెండొందలకు పైగా వేల్స్‌ నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాయి. వీటి పరిస్థితికి గల కారణాలు తెలియరాలేదు. పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఈ వేల్స్‌కు వైద్యసహాయం అందించి కాపాడేందుకు యత్నిస్తున్నారు.. ఆస్ట్రేలియాలోని స్ట్రహాన్‌ సమీప ఓషియన్‌ బీచ్‌లో దాదాపు రెండొందలకు పైగా వేల్స్‌ నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాయి. వీటి పరిస్థితికి గల కారణాలు తెలియరాలేదు. పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఈ వేల్స్‌కు వైద్యసహాయం అందించి కాపాడేందుకు యత్నిస్తున్నారు..
17/19
18/19
జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నగరంలో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఉన్న భారీ భవంతుల చుట్టూ సగానికి దట్టమైన పొగమంచు పడుతూ కనిపించింది. దీంతో చూపరులకు ‘మేఘాల్లోనే భవనాలు నిర్మించారా?’ అనే సందేహం కలిగింది.  జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నగరంలో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఉన్న భారీ భవంతుల చుట్టూ సగానికి దట్టమైన పొగమంచు పడుతూ కనిపించింది. దీంతో చూపరులకు ‘మేఘాల్లోనే భవనాలు నిర్మించారా?’ అనే సందేహం కలిగింది.
19/19
ఈ నెల 27 నుంచి అక్టోబ‌రు 5వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్న తిరుమ‌ల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు విచ్చేయాల‌ని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి.. సీఎం వైఎస్‌ జగన్‌ను ఆహ్వానించారు. వెలగపూడి సచివాలయంలో సీఎంను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ నెల 27 నుంచి అక్టోబ‌రు 5వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్న తిరుమ‌ల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు విచ్చేయాల‌ని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి.. సీఎం వైఎస్‌ జగన్‌ను ఆహ్వానించారు. వెలగపూడి సచివాలయంలో సీఎంను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను అందజేశారు.

మరిన్ని