News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 2 (28-09-2022)

Updated : 28 Sep 2022 20:33 IST
1/28
తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు బుధ‌వారం రాత్రి మలయప్ప స్వామివారు హంస వాహనంపై వీణ ధ‌రించి స‌ర‌స్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్రదర్శనలు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు బుధ‌వారం రాత్రి మలయప్ప స్వామివారు హంస వాహనంపై వీణ ధ‌రించి స‌ర‌స్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్రదర్శనలు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.
2/28
3/28
4/28
తెలంగాణ అసెంబ్లీలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, సురభి వాణిదేవి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొని పూల బతుకమ్మల చుట్టూ పాటలు పాడారు. తెలంగాణ అసెంబ్లీలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, సురభి వాణిదేవి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొని పూల బతుకమ్మల చుట్టూ పాటలు పాడారు.
5/28
6/28
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌ సందర్భంగా తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం బయట ఫ్యాన్స్‌ ధోనీ, రోహిత్‌ శర్మల భారీ కటౌట్‌లను ఏర్పాటు చేశారు. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌ సందర్భంగా తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం బయట ఫ్యాన్స్‌ ధోనీ, రోహిత్‌ శర్మల భారీ కటౌట్‌లను ఏర్పాటు చేశారు.
7/28
8/28
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ముండ్లా గ్రామంలోని దుర్యోదన చౌదరీ ఇంట్లోకి బుధవారం 12 అడుగుల కింగ్‌ కోబ్రా ప్రవేశించింది. దీంతో వారు సోంపేటకు చెందిన పాములు పట్టే వ్యక్తి బాలరాజుకు ఫోన్‌ చేసి పిలిపించారు. ఆయన పామును చాకచక్యంగా పట్టుకొని అడవిలో విడిచిపెట్టారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ముండ్లా గ్రామంలోని దుర్యోదన చౌదరీ ఇంట్లోకి బుధవారం 12 అడుగుల కింగ్‌ కోబ్రా ప్రవేశించింది. దీంతో వారు సోంపేటకు చెందిన పాములు పట్టే వ్యక్తి బాలరాజుకు ఫోన్‌ చేసి పిలిపించారు. ఆయన పామును చాకచక్యంగా పట్టుకొని అడవిలో విడిచిపెట్టారు.
9/28
10/28
హైదరాబాద్‌లోని పంజాగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణాన్ని సినీ నటి మెహరీన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నగల దుకాణం ప్రారంభోత్సవం అనంతరం మెహరీన్‌ ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణాన్ని సినీ నటి మెహరీన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నగల దుకాణం ప్రారంభోత్సవం అనంతరం మెహరీన్‌ ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
11/28
12/28
13/28
ప్రముఖ నటుడు చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’. అనంతపురంలో నిర్వహించనున్న ఈ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కోసం చిరంజీవి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. ఈ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న మెగాస్టార్‌.. ‘వస్తున్నా మన సీమకి... మీ  ప్రేమ కోసం’ అని పోస్టు పెట్టారు. ‘గాడ్‌ ఫాదర్‌’ దసరా కానుకగా అక్టోబర్‌ 5న థియేటర్లలో విడుదల కానుంది. ప్రముఖ నటుడు చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’. అనంతపురంలో నిర్వహించనున్న ఈ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కోసం చిరంజీవి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. ఈ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న మెగాస్టార్‌.. ‘వస్తున్నా మన సీమకి... మీ ప్రేమ కోసం’ అని పోస్టు పెట్టారు. ‘గాడ్‌ ఫాదర్‌’ దసరా కానుకగా అక్టోబర్‌ 5న థియేటర్లలో విడుదల కానుంది.
14/28
ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధును ఆమె నివాసంలో కలిశారు. ఈ ఫొటోను సింధు తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. అనుపమ్‌ ఖేర్‌లాంటి గొప్పనటుడిని కలవడం తన అదృష్టమని తెలుపుతూ పోస్టు పెట్టారు. తాము సరదాగా నవ్వుకున్నట్లు, ఎన్నో విలువైన అంశాలపై చర్చించుకున్నట్లు సింధు చెప్పారు. ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధును ఆమె నివాసంలో కలిశారు. ఈ ఫొటోను సింధు తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. అనుపమ్‌ ఖేర్‌లాంటి గొప్పనటుడిని కలవడం తన అదృష్టమని తెలుపుతూ పోస్టు పెట్టారు. తాము సరదాగా నవ్వుకున్నట్లు, ఎన్నో విలువైన అంశాలపై చర్చించుకున్నట్లు సింధు చెప్పారు.
15/28
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాలను పురస్కరించుకొని విజయవాడ ఫెర్రీ ఘాట్‌ వద్ద కృష్ణా నది పరిసరాలను భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ శ్రేణులతో కలిసి శుభ్రం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాలను పురస్కరించుకొని విజయవాడ ఫెర్రీ ఘాట్‌ వద్ద కృష్ణా నది పరిసరాలను భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ శ్రేణులతో కలిసి శుభ్రం చేశారు.
16/28
హైదరాబాద్‌లోని ఆంధ్ర మహిళా సభ కళాశాలలో బుధవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడిపాడుతూ సందడి చేశారు.. హైదరాబాద్‌లోని ఆంధ్ర మహిళా సభ కళాశాలలో బుధవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడిపాడుతూ సందడి చేశారు..
17/28
18/28
శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు వరంగల్‌లోని శ్రీ భద్రకాళి అమ్మవారు.. గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు వరంగల్‌లోని శ్రీ భద్రకాళి అమ్మవారు.. గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.
19/28
రామ్‌చరణ్‌ సినీ రంగంలోకి అరంగేట్రం చేసి నేటికి 15ఏళ్లయింది. ఈ సందర్భంగా ఆయన తండ్రి, ప్రముఖ నటుడు చిరంజీవి.. చెర్రీతో గతంలో కలిసి దిగిన ఫొటోలను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. చిరుత నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు రామ్‌చరణ్‌ తనని తాను మార్చుకున్న తీరు ప్రశంసనీయమని తెలుపుతూ పోస్టు పెట్టారు. తన కుమారుడిని చూసి గర్వపడుతున్నట్లు చెప్పారు. రామ్‌చరణ్‌ సినీ రంగంలోకి అరంగేట్రం చేసి నేటికి 15ఏళ్లయింది. ఈ సందర్భంగా ఆయన తండ్రి, ప్రముఖ నటుడు చిరంజీవి.. చెర్రీతో గతంలో కలిసి దిగిన ఫొటోలను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. చిరుత నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు రామ్‌చరణ్‌ తనని తాను మార్చుకున్న తీరు ప్రశంసనీయమని తెలుపుతూ పోస్టు పెట్టారు. తన కుమారుడిని చూసి గర్వపడుతున్నట్లు చెప్పారు.
20/28
21/28
దసరా పండగ నేపథ్యంలో ఏటా నిర్వహించే ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ అలయ్‌ బలయ్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ బండారు విజయలక్ష్మి పలువురు ప్రముఖులను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ కవిత తదితరులను ఆమె కలిశారు. కాగా.. అక్టోబర్‌ 6న నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఈ  కార్యక్రమం నిర్వహించనున్నారు. దసరా పండగ నేపథ్యంలో ఏటా నిర్వహించే ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ అలయ్‌ బలయ్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ బండారు విజయలక్ష్మి పలువురు ప్రముఖులను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ కవిత తదితరులను ఆమె కలిశారు. కాగా.. అక్టోబర్‌ 6న నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
22/28
23/28
24/28
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు గజలక్ష్మి అలంకారంలో లక్ష్మీతాయారు అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు గజలక్ష్మి అలంకారంలో లక్ష్మీతాయారు అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
25/28
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఇవాళ కేరళలోని పాలక్కడ్ నుంచి ప్రారంభమైంది. పాదయాత్రలో తన వద్దకు వచ్చిన ఓ చిన్నారిని రాహుల్ ఇలా భుజాలపైకి ఎత్తుకున్నారు. ఆపై యాత్ర కొనసాగించారు. ‘భారత్‌ బంగారు భవిష్యత్తు బలమైన భుజాలపై’ అంటూ కాంగ్రెస్‌ ట్విటర్‌లో ఈ చిత్రాన్ని పోస్టు చేసింది. 
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఇవాళ కేరళలోని పాలక్కడ్ నుంచి ప్రారంభమైంది. పాదయాత్రలో తన వద్దకు వచ్చిన ఓ చిన్నారిని రాహుల్ ఇలా భుజాలపైకి ఎత్తుకున్నారు. ఆపై యాత్ర కొనసాగించారు. ‘భారత్‌ బంగారు భవిష్యత్తు బలమైన భుజాలపై’ అంటూ కాంగ్రెస్‌ ట్విటర్‌లో ఈ చిత్రాన్ని పోస్టు చేసింది.
26/28
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో తొలి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా స్టేడియం బయట ఆల్ కేరళ విరాట్‌ కోహ్లీ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన ఈ కటౌట్ చూపరులను ఆకట్టుకుంటోంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో తొలి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా స్టేడియం బయట ఆల్ కేరళ విరాట్‌ కోహ్లీ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన ఈ కటౌట్ చూపరులను ఆకట్టుకుంటోంది.
27/28
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం చిన్న శేష వాహన సేవను వైభవంగా నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో నిర్వహించిన ఈ సేవలో శ్రీమలయప్పస్వామి చిన్నశేషవాహనం పైనుంచి భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఈ వాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం చిన్న శేష వాహన సేవను వైభవంగా నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో నిర్వహించిన ఈ సేవలో శ్రీమలయప్పస్వామి చిన్నశేషవాహనం పైనుంచి భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఈ వాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
28/28

మరిన్ని