News In Pics : చిత్రం చెప్పే సంగతులు-2 (24-11-2022)

Updated : 24 Nov 2022 22:04 IST
1/24
విజయవాడ ఎస్‌ఎస్‌ కల్యాణ మండపంలో పాలిటెక్‌ ఫెస్ట్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన రోబో తుపాకీ, ‘పెడల్‌తో తొక్కే సైకిల్ కారు‘ కృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. విజయవాడ ఎస్‌ఎస్‌ కల్యాణ మండపంలో పాలిటెక్‌ ఫెస్ట్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన రోబో తుపాకీ, ‘పెడల్‌తో తొక్కే సైకిల్ కారు‘ కృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
2/24
సైకిల్‌ కారు సైకిల్‌ కారు
3/24
కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారు బుధవారం సాయంత్రం హనుమంత వాహనంపై పట్టాభిరాముడి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయ వీధుల్లో ఊరేగుతున్న అమ్మవారిని భక్తులు దర్శించుకొని పరవశించిపోయారు. కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారు బుధవారం సాయంత్రం హనుమంత వాహనంపై పట్టాభిరాముడి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయ వీధుల్లో ఊరేగుతున్న అమ్మవారిని భక్తులు దర్శించుకొని పరవశించిపోయారు.
4/24
ప్రధాన నరేంద్ర మోదీ గురువారం గుజరాత్‌లోని బవ్లాలో ఎన్నికల ప్రచారసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలు ఆయన్ను ఇలా ఆప్యాయంగా పలకరించారు. ఆమె 104ఏళ్ల మానెక్‌ బెన్‌ అని.. బానిసత్వాన్ని, స్వాతంత్ర్య సంబరాల్ని చూసిన మహిళ అని పేర్కొంటూ కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ ట్విటర్‌లో పోస్టు పెట్టారు. ప్రధాన నరేంద్ర మోదీ గురువారం గుజరాత్‌లోని బవ్లాలో ఎన్నికల ప్రచారసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలు ఆయన్ను ఇలా ఆప్యాయంగా పలకరించారు. ఆమె 104ఏళ్ల మానెక్‌ బెన్‌ అని.. బానిసత్వాన్ని, స్వాతంత్ర్య సంబరాల్ని చూసిన మహిళ అని పేర్కొంటూ కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ ట్విటర్‌లో పోస్టు పెట్టారు.
5/24
హైదరాబాద్‌లోని ఉప్పల్ కూడలిలో కొత్తగా నిర్మిస్తున్న స్కైవాక్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం నాలుగు కూడళ్లు కలిపి 6 ద్వారాలు ఉంటాయని సిబ్బంది తెలిపారు. రెండు నెలల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ కూడలిలో కొత్తగా నిర్మిస్తున్న స్కైవాక్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం నాలుగు కూడళ్లు కలిపి 6 ద్వారాలు ఉంటాయని సిబ్బంది తెలిపారు. రెండు నెలల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు.
6/24
మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీలో గురువారం స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించి గోల్డ్‌ మెడల్‌ పొందిన ఓ విద్యార్థిని.. పతకాన్ని తన చిన్నారి కుమార్తెకు చూపిస్తూ సంబరపడిపోయారు. పట్టాలు పొందిన ఆనందంలో సెల్ఫీ తీసుకుంటున్న విద్యార్థినులను రెండో చిత్రంలో చూడవచ్చు.. మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీలో గురువారం స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించి గోల్డ్‌ మెడల్‌ పొందిన ఓ విద్యార్థిని.. పతకాన్ని తన చిన్నారి కుమార్తెకు చూపిస్తూ సంబరపడిపోయారు. పట్టాలు పొందిన ఆనందంలో సెల్ఫీ తీసుకుంటున్న విద్యార్థినులను రెండో చిత్రంలో చూడవచ్చు..
7/24
కర్నూలు రింగురోడ్డు నుంచి నంద్యాల వెళ్లే కొండ అంచు మార్గం ప్రమాదకరంగా మారింది. ఇటీవల కొండ చుట్టూ మట్టి తవ్వకాలు చేపడుతుండటంతో రహదారి పక్కన ఉన్న బండరాళ్లు బీటలువారుతున్నాయి. ఏ మాత్రం అవి కిందపడినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. నిత్యం వందలాది వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. కర్నూలు రింగురోడ్డు నుంచి నంద్యాల వెళ్లే కొండ అంచు మార్గం ప్రమాదకరంగా మారింది. ఇటీవల కొండ చుట్టూ మట్టి తవ్వకాలు చేపడుతుండటంతో రహదారి పక్కన ఉన్న బండరాళ్లు బీటలువారుతున్నాయి. ఏ మాత్రం అవి కిందపడినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. నిత్యం వందలాది వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు.
8/24
విశాఖ ఆర్కే బీచ్‌లో సాయంత్రం వేళ అస్తమిస్తున్న సూర్యుడు ఇలా కనువిందు చేశాడు. ఈ చిత్రంలో క్రేన్‌ సూర్యుడిని ఎత్తుతోందా అన్నట్లుగా కనిపించి ఆకట్టుకుంది.. విశాఖ ఆర్కే బీచ్‌లో సాయంత్రం వేళ అస్తమిస్తున్న సూర్యుడు ఇలా కనువిందు చేశాడు. ఈ చిత్రంలో క్రేన్‌ సూర్యుడిని ఎత్తుతోందా అన్నట్లుగా కనిపించి ఆకట్టుకుంది..
9/24
సూర్యాస్తమయ సమయంలో స్తంభంపై ఉన్న పక్షి దృశ్యం అందంగా కనిపించింది. సూర్యాస్తమయ సమయంలో స్తంభంపై ఉన్న పక్షి దృశ్యం అందంగా కనిపించింది.
10/24
మార్గశిర మాసం ప్రారంభమైన సందర్భంగా విశాఖ వన్‌టౌన్‌లోని కనకమహాలక్ష్మీ ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. మార్గశిర మాసం ప్రారంభమైన సందర్భంగా విశాఖ వన్‌టౌన్‌లోని కనకమహాలక్ష్మీ ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
11/24
అడివి శేష్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘హిట్‌2’. మీనాక్షి చౌదరి కథనాయిక. ఈ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఈ నెల 28న హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నారు. డిసెంబర్‌ 2న ‘హిట్‌2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అడివి శేష్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘హిట్‌2’. మీనాక్షి చౌదరి కథనాయిక. ఈ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఈ నెల 28న హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నారు. డిసెంబర్‌ 2న ‘హిట్‌2’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
12/24
టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా తన కుమారుడు ఇజాన్‌ మీర్జా, సోదరి ఆనమ్‌ మీర్జా కుమార్తె దువాతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. తనకు తెలిసిన, తెలుసుకోవాలనుకుంటున్న స్వచ్ఛమైన ప్రేమ ఇదేనంటూ ఆమె పోస్టు పెట్టారు. టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా తన కుమారుడు ఇజాన్‌ మీర్జా, సోదరి ఆనమ్‌ మీర్జా కుమార్తె దువాతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. తనకు తెలిసిన, తెలుసుకోవాలనుకుంటున్న స్వచ్ఛమైన ప్రేమ ఇదేనంటూ ఆమె పోస్టు పెట్టారు.
13/24
డోనెట్స్క్‌ రీజియన్‌లో ఉక్రెయిన్‌ సైనికులు రష్యా బలగాలపై తమ ఆయుధ సంపత్తితో ఎదురుదాడికి దిగుతూ కనిపించారు. డోనెట్స్క్‌ రీజియన్‌లో ఉక్రెయిన్‌ సైనికులు రష్యా బలగాలపై తమ ఆయుధ సంపత్తితో ఎదురుదాడికి దిగుతూ కనిపించారు.
14/24
పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. సినిమాలోని కీలక ఘట్టాలను రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన భారీ సెట్‌లో అక్టోబర్‌ చివరి వారం నుంచి చిత్రీకరిస్తున్నారు. సుమారు 900మంది నటీనటులు ఇందులో పాలుపంచుకుంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. సినిమాలోని కీలక ఘట్టాలను రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన భారీ సెట్‌లో అక్టోబర్‌ చివరి వారం నుంచి చిత్రీకరిస్తున్నారు. సుమారు 900మంది నటీనటులు ఇందులో పాలుపంచుకుంటున్నారు.
15/24
మూసారాంబాగ్ మూసీ వంతెన వద్ద ద్విచక్రవాహనానికి నంబర్ ప్లేట్ సరిగా లేకుండా ప్రయాణిస్తున్న ఓ పోలీసు. మూసారాంబాగ్ మూసీ వంతెన వద్ద ద్విచక్రవాహనానికి నంబర్ ప్లేట్ సరిగా లేకుండా ప్రయాణిస్తున్న ఓ పోలీసు.
16/24
ఏపీలో ఆక్వారంగ సంక్షోభంపై మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ‘ఆక్వా రైతులకు ఇదేం ఖర్మ’ పేరుతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించి సదస్సును ప్రారంభించారు. ఏపీలో ఆక్వారంగ సంక్షోభంపై మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ‘ఆక్వా రైతులకు ఇదేం ఖర్మ’ పేరుతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించి సదస్సును ప్రారంభించారు.
17/24
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిర్వహించిన డిజైర్‌ డిజైనర్‌ ఎగ్జిబిషన్‌లో నటి, మోడల్‌ శ్రీలేఖ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిర్వహించిన డిజైర్‌ డిజైనర్‌ ఎగ్జిబిషన్‌లో నటి, మోడల్‌ శ్రీలేఖ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
18/24
తిరుచానూరు ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వార్షిక కార్తిక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా గురు‌, శుక్రవారాల్లో గ‌జ, గ‌రుడ వాహ‌న‌ సేవ‌లు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో అమ్మవారిని అలంక‌రించేందుకు తిరుమ‌ల శ్రీ‌వారి ల‌క్ష్మీకాసుల హారాన్ని గురువారం ఉద‌యం శోభాయాత్రగా తిరుచానూరుకు తీసుకువచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాసులహారాన్ని ఊరేగింపుగా తిరుచానూరుకు తీసుకువచ్చారు. తిరుచానూరు ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వార్షిక కార్తిక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా గురు‌, శుక్రవారాల్లో గ‌జ, గ‌రుడ వాహ‌న‌ సేవ‌లు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో అమ్మవారిని అలంక‌రించేందుకు తిరుమ‌ల శ్రీ‌వారి ల‌క్ష్మీకాసుల హారాన్ని గురువారం ఉద‌యం శోభాయాత్రగా తిరుచానూరుకు తీసుకువచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాసులహారాన్ని ఊరేగింపుగా తిరుచానూరుకు తీసుకువచ్చారు.
19/24
హైదరాబాద్‌లోని దుర్గం చెరువు వద్ద వాటర్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ మహిళలు, పిల్లలు సెయిలింగ్‌ నేర్చుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు వద్ద వాటర్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ మహిళలు, పిల్లలు సెయిలింగ్‌ నేర్చుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.
20/24
ఈ చిత్రాల్లో కన్పిస్తున్నవి పచ్చపీతలు(మడ్‌ క్రాబ్‌). పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సముద్ర తీరంలో లభించే వీటికి మార్కెట్లో అధిక డిమాండ్‌ ఉంది. కిలో రూ.1200-1500 ధర పలుకుతున్నాయి. వ్యాపారులు ఇక్కడ వీటిని కొని చెన్నై, బెంగళూరు తదితర నగరాలకు తరలించి.. అక్కడ్నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.  ఈ చిత్రాల్లో కన్పిస్తున్నవి పచ్చపీతలు(మడ్‌ క్రాబ్‌). పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సముద్ర తీరంలో లభించే వీటికి మార్కెట్లో అధిక డిమాండ్‌ ఉంది. కిలో రూ.1200-1500 ధర పలుకుతున్నాయి. వ్యాపారులు ఇక్కడ వీటిని కొని చెన్నై, బెంగళూరు తదితర నగరాలకు తరలించి.. అక్కడ్నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
21/24
మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో తీసుకున్న ఫొటోను ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌ అలీం హకీం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘RC15’ సినిమాలో చరణ్‌ లుక్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం షెడ్యూల్ నిమిత్తం వీరు న్యూజిలాండ్‌లో ఉన్నారు.	మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో తీసుకున్న ఫొటోను ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌ అలీం హకీం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘RC15’ సినిమాలో చరణ్‌ లుక్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం షెడ్యూల్ నిమిత్తం వీరు న్యూజిలాండ్‌లో ఉన్నారు.
22/24
కార్తిక మాసం ముగింపు సందర్భంగా యానాం రాజీవ్‌ బీచ్‌లోని పుష్కర స్నాన ఘాట్‌, శివం బాత్‌ పరిసరాలు భక్తుల రద్దీతో కిక్కిరిశాయి.	కార్తిక మాసం ముగింపు సందర్భంగా యానాం రాజీవ్‌ బీచ్‌లోని పుష్కర స్నాన ఘాట్‌, శివం బాత్‌ పరిసరాలు భక్తుల రద్దీతో కిక్కిరిశాయి.
23/24
కార్తికమాసం ముగింపు, పోలి స్వర్గం సందర్భంగా ఇవాళ తెల్లవారుజామున విజయవాడ కృష్ణానదీ తీరంలోని పున్నమిఘాట్‌, భవానీ ఘాట్‌లు దీపకాంతులతో మెరిసిపోయాయి. మహిళలు అరటి దొప్పలలో దీపాలు వెలిగించి భక్తితో నమస్కరించి నదిలో వదిలి మొక్కులు చెల్లించుకున్నారు.	కార్తికమాసం ముగింపు, పోలి స్వర్గం సందర్భంగా ఇవాళ తెల్లవారుజామున విజయవాడ కృష్ణానదీ తీరంలోని పున్నమిఘాట్‌, భవానీ ఘాట్‌లు దీపకాంతులతో మెరిసిపోయాయి. మహిళలు అరటి దొప్పలలో దీపాలు వెలిగించి భక్తితో నమస్కరించి నదిలో వదిలి మొక్కులు చెల్లించుకున్నారు.
24/24
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో సాగుతోంది. ఈ యాత్రలో రాహుల్ సోదరి ప్రియాంక.. ఆమె భర్త రాబర్ట్ వాద్రా పాల్గొన్నారు.	కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో సాగుతోంది. ఈ యాత్రలో రాహుల్ సోదరి ప్రియాంక.. ఆమె భర్త రాబర్ట్ వాద్రా పాల్గొన్నారు.

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని