News In Pics: చిత్రం చెప్పే సంగతులు -2 (07-12-2022)

Updated : 07 Dec 2022 20:01 IST
1/12
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వైకాపా ఆధ్వర్యంలో ‘జయహో బీసీ’ సభ నిర్వహించారు. అందు కోసం ఏలూరు నుంచి భారీగా ఆర్టీసీ బస్సులను తరలించారు. సాయంత్రం తగినన్ని బస్సులు లేక విద్యార్థులు ఏలూరు బస్టాండ్‌లో గంటల తరబడి నిరీక్షిస్తూ కనిపించారు. ఉన్న కొద్దిపాటి బస్సుల్లో వేలాడుతూ ప్రయాణిస్తూ ఇళ్లకు చేరుకున్నారు. 
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వైకాపా ఆధ్వర్యంలో ‘జయహో బీసీ’ సభ నిర్వహించారు. అందు కోసం ఏలూరు నుంచి భారీగా ఆర్టీసీ బస్సులను తరలించారు. సాయంత్రం తగినన్ని బస్సులు లేక విద్యార్థులు ఏలూరు బస్టాండ్‌లో గంటల తరబడి నిరీక్షిస్తూ కనిపించారు. ఉన్న కొద్దిపాటి బస్సుల్లో వేలాడుతూ ప్రయాణిస్తూ ఇళ్లకు చేరుకున్నారు.
2/12
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో నిర్వహించిన ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది. పలువురు డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించి మోడళ్లు ర్యాంప్‌ వాక్‌ చేస్తూ హొయలు పోయారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో నిర్వహించిన ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది. పలువురు డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించి మోడళ్లు ర్యాంప్‌ వాక్‌ చేస్తూ హొయలు పోయారు.
3/12
 నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్‌ హాజరయ్యారు. నూతన వధూవరులు సౌజన్య, డా. శ్రావణ్‌ కుమార్‌లను ఆశీర్వదించారు.  నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్‌ హాజరయ్యారు. నూతన వధూవరులు సౌజన్య, డా. శ్రావణ్‌ కుమార్‌లను ఆశీర్వదించారు.
4/12
సినీనటి ప్రణీత కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు తన కూతురు ఆర్న తలనీలాలు సమర్పించారు. సినీనటి ప్రణీత కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు తన కూతురు ఆర్న తలనీలాలు సమర్పించారు.
5/12
సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సైనిక నిధికి తన వంతు సహాయం అందజేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సైనిక నిధికి తన వంతు సహాయం అందజేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ
6/12
మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు బాబీ తెరకెక్కించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ చిత్రబృందం ఈ పోస్టర్‌ విడుదల చేసింది. మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు బాబీ తెరకెక్కించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ చిత్రబృందం ఈ పోస్టర్‌ విడుదల చేసింది.
7/12
హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో-నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ను సినీనటి నిహారిక కొణిదెల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఇతర మోడళ్లతో కలిసి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో-నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ను సినీనటి నిహారిక కొణిదెల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఇతర మోడళ్లతో కలిసి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
8/12
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వైకాపా ఆధ్వర్యంలో ‘జయహో బీసీ’ సభ నిర్వహించారు. సీఎం జగన్‌ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సభకు హాజరయ్యారు. సభలోకి వెళ్తున్న ప్రజలను భద్రతా సిబ్బంది తనిఖీ చేయగా.. మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్లు లభించాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వైకాపా ఆధ్వర్యంలో ‘జయహో బీసీ’ సభ నిర్వహించారు. సీఎం జగన్‌ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సభకు హాజరయ్యారు. సభలోకి వెళ్తున్న ప్రజలను భద్రతా సిబ్బంది తనిఖీ చేయగా.. మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్లు లభించాయి.
9/12
ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు ఆ దేశం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మెసాయిద్‌ సీ లైన్‌లోని జీఎంసీ డైవ్‌లో పలు వాహనాలు, సైకిళ్లు, కాంక్రీట్ శిథిలాలు ఉంచి ‘టైటానిక్‌’ తరహా అనుభూతిని పంచుతోంది. అందులోని వైవిధ్యమైన, రంగురంగుల చేపలు మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు ఆ దేశం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మెసాయిద్‌ సీ లైన్‌లోని జీఎంసీ డైవ్‌లో పలు వాహనాలు, సైకిళ్లు, కాంక్రీట్ శిథిలాలు ఉంచి ‘టైటానిక్‌’ తరహా అనుభూతిని పంచుతోంది. అందులోని వైవిధ్యమైన, రంగురంగుల చేపలు మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి.
10/12
నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ చిత్రం ఖరారైంది. ‘#NBK 108’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ పూజా కార్యక్రమం గురువారం జరగనుందని వెల్లడిస్తూ చిత్రబృందం ఈ పోస్టర్‌ విడుదల చేసింది.	నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ చిత్రం ఖరారైంది. ‘#NBK 108’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ పూజా కార్యక్రమం గురువారం జరగనుందని వెల్లడిస్తూ చిత్రబృందం ఈ పోస్టర్‌ విడుదల చేసింది.
11/12
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్ర రాజస్థాన్‌లో సాగుతోంది. కోటా జిల్లాలో యాత్ర చేస్తున్న ఆయనను ఓ వెంట్రిలాక్విజం కళాకారుడు కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ ఆయన చేతిలోని బొమ్మను తీసుకుని ఇలా పరిశీలించారు.	కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్ర రాజస్థాన్‌లో సాగుతోంది. కోటా జిల్లాలో యాత్ర చేస్తున్న ఆయనను ఓ వెంట్రిలాక్విజం కళాకారుడు కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ ఆయన చేతిలోని బొమ్మను తీసుకుని ఇలా పరిశీలించారు.
12/12
నెల్లూరు నగరంలో తెదేపా ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ-మన బీసీలకు’ కార్యక్రమం నిర్వహించారు. తొలుత వీఆర్సీ సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు.	నెల్లూరు నగరంలో తెదేపా ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ-మన బీసీలకు’ కార్యక్రమం నిర్వహించారు. తొలుత వీఆర్సీ సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు.

మరిన్ని