News In pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 25 Jun 2022 20:32 IST
1/22
జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తండ్రి కొణిదెల వెంకట్‌రావు జయంతి సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ తల్లి అంజనాదేవి కౌలు రైతు భరోసా యాత్ర నిధికి రూ.లక్షన్నర విరాళంగా అందజేశారు. పార్టీకి రూ.లక్ష విరాళం ఇచ్చారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో పవన్‌కల్యాణ్‌కు ఇందుకు సంబంధించిన చెక్కులను ఆమె అందజేశారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తండ్రి కొణిదెల వెంకట్‌రావు జయంతి సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ తల్లి అంజనాదేవి కౌలు రైతు భరోసా యాత్ర నిధికి రూ.లక్షన్నర విరాళంగా అందజేశారు. పార్టీకి రూ.లక్ష విరాళం ఇచ్చారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో పవన్‌కల్యాణ్‌కు ఇందుకు సంబంధించిన చెక్కులను ఆమె అందజేశారు.
2/22
కర్నూలు జిల్లా కల్లూరు మండలం బస్తిపాడుకు చెందిన రైతు రామాంజనేయులు తన రెండేళ్ల కుమార్తె కోసం కాడెద్దులకు ఊయల కట్టి దుక్కి దున్నే పనిలో నిమగ్నమయ్యాడు. పొలం పనిలో తల్లి నిమగ్నమవగా.. లయబద్ధంగా నడుస్తున్న జోడెడ్ల అడుగుల సవ్వడితో చిన్నారి హాయిగా నిద్రించింది. నాన్న ఆప్యాయత, అమ్మ అనురాగం, శ్రమజీవుల ప్రేమానురాగాలకు దర్పణం ఈ చిత్రం. కర్నూలు జిల్లా కల్లూరు మండలం బస్తిపాడుకు చెందిన రైతు రామాంజనేయులు తన రెండేళ్ల కుమార్తె కోసం కాడెద్దులకు ఊయల కట్టి దుక్కి దున్నే పనిలో నిమగ్నమయ్యాడు. పొలం పనిలో తల్లి నిమగ్నమవగా.. లయబద్ధంగా నడుస్తున్న జోడెడ్ల అడుగుల సవ్వడితో చిన్నారి హాయిగా నిద్రించింది. నాన్న ఆప్యాయత, అమ్మ అనురాగం, శ్రమజీవుల ప్రేమానురాగాలకు దర్పణం ఈ చిత్రం.
3/22
4/22
రిజర్వ్‌ బ్యాంకు మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు 1960-61 సంవత్సరాల్లో ఏలూరు రామచంద్రరావుపేటలోని ఈదర సుబ్బమ్మదేవి నగరపాలకోన్నత పాఠశాలలో 6, 7 తరగతులు చదువుకున్నారు. బాల్య స్మృతులను గుర్తు చేసుకుంటూ 7-8-2010న రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌ హోదాలో పాఠశాలను సందర్శించారు. అప్పటికి చలామణిలో కరెన్సీ నోట్ల నమూనాలను, విద్యార్థుల కోసం ఆటపరికరాలను ప్రధానోపాధ్యాయులు తనికెళ్ల గోపాలకృష్ణకు అందజేశారు. నాటి కరెన్సీ నోట్ల జ్ఞాపకాలు నేటికీ చెక్కు చెదరలేదు. గోడపై ఉన్న కరెన్సీ నోట్ల నమూనాలపై దువ్వూరి సుబ్బారావు సంతకాలను విద్యార్థులకు చూపించి బాగా చదువుకొని ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు. రిజర్వ్‌ బ్యాంకు మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు 1960-61 సంవత్సరాల్లో ఏలూరు రామచంద్రరావుపేటలోని ఈదర సుబ్బమ్మదేవి నగరపాలకోన్నత పాఠశాలలో 6, 7 తరగతులు చదువుకున్నారు. బాల్య స్మృతులను గుర్తు చేసుకుంటూ 7-8-2010న రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌ హోదాలో పాఠశాలను సందర్శించారు. అప్పటికి చలామణిలో కరెన్సీ నోట్ల నమూనాలను, విద్యార్థుల కోసం ఆటపరికరాలను ప్రధానోపాధ్యాయులు తనికెళ్ల గోపాలకృష్ణకు అందజేశారు. నాటి కరెన్సీ నోట్ల జ్ఞాపకాలు నేటికీ చెక్కు చెదరలేదు. గోడపై ఉన్న కరెన్సీ నోట్ల నమూనాలపై దువ్వూరి సుబ్బారావు సంతకాలను విద్యార్థులకు చూపించి బాగా చదువుకొని ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు.
5/22
బంగ్లాదేశ్‌లో శనివారం ఆ దేశంలోకెల్లా పొడవైన వంతెనను ప్రారంభించారు. ఢాకా శివారులోని పద్మ నదిపై 6.15కిలోమీటర్ల పొడవుతో దీన్ని నిర్మించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. బంగ్లాదేశ్‌లో శనివారం ఆ దేశంలోకెల్లా పొడవైన వంతెనను ప్రారంభించారు. ఢాకా శివారులోని పద్మ నదిపై 6.15కిలోమీటర్ల పొడవుతో దీన్ని నిర్మించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
6/22
7/22
సరిగ్గా ఇదే రోజున 1983లో భారత్‌ చరిత్రాత్మక విజయాన్ని దక్కించుకొని క్రికెట్‌లో ప్రపంచకప్‌ను సాధించింది. ఇందుకు సంబంధించిన ఫొటోను మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ప్రతి భారతీయుడి కల ఆరోజు నిజమైందని, అది మనం గర్వపడాల్సిన క్షణమని తెలిపారు. తాను, తన లాంటి ఎంతో మంది ఆ గెలుపును స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించినట్లు చెబుతూ పోస్టు పెట్టారు. సరిగ్గా ఇదే రోజున 1983లో భారత్‌ చరిత్రాత్మక విజయాన్ని దక్కించుకొని క్రికెట్‌లో ప్రపంచకప్‌ను సాధించింది. ఇందుకు సంబంధించిన ఫొటోను మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ప్రతి భారతీయుడి కల ఆరోజు నిజమైందని, అది మనం గర్వపడాల్సిన క్షణమని తెలిపారు. తాను, తన లాంటి ఎంతో మంది ఆ గెలుపును స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించినట్లు చెబుతూ పోస్టు పెట్టారు.
8/22
అమెరికా పర్యటనలో ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ న్యూజెర్సీ ఎడిసన్‌లోని సాయి దత్తపీఠాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పండితులు వేద మంత్రోచ్ఛరణలతో ఆయనకు స్వాగతం పలికారు. సీజేఐ అనంతరం సాయిబాబాను, శివ, విష్ణు మందిరాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ న్యూజెర్సీ ఎడిసన్‌లోని సాయి దత్తపీఠాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పండితులు వేద మంత్రోచ్ఛరణలతో ఆయనకు స్వాగతం పలికారు. సీజేఐ అనంతరం సాయిబాబాను, శివ, విష్ణు మందిరాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
9/22
10/22
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు త‌న వ్యక్తిగ‌త స‌హాయ‌కుడైన శ్రీనివాస్‌ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయించారు. వివాహ వేడుకలో పాల్గొని వధూవరులు శ్రీనివాస్‌, చంద్రికలను ఆశీర్వదించారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు త‌న వ్యక్తిగ‌త స‌హాయ‌కుడైన శ్రీనివాస్‌ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయించారు. వివాహ వేడుకలో పాల్గొని వధూవరులు శ్రీనివాస్‌, చంద్రికలను ఆశీర్వదించారు.
11/22
అజీత్‌ బజాజ్‌, ఆయన కుమార్తె దీయా బజాజ్‌ అలస్కాలోని డెనాలి పర్వతాన్ని అధిరోహించారు. అంతకు ముందు వీరిద్దరు కలిసి ఎవరెస్టును అధిరోహించిన మొదటి తండ్రి, కుమార్తెగా రికార్డు సాధించారు. 
ప్రస్తుతం 7 ఖండాల్లో 7 పర్వతాలను అధిరోహించి ‘ఎక్స్‌ప్లోరర్‌ గ్రాండ్‌ స్లామ్’ను సైతం పూర్తి చేశారు. అజీత్‌ బజాజ్‌, ఆయన కుమార్తె దీయా బజాజ్‌ అలస్కాలోని డెనాలి పర్వతాన్ని అధిరోహించారు. అంతకు ముందు వీరిద్దరు కలిసి ఎవరెస్టును అధిరోహించిన మొదటి తండ్రి, కుమార్తెగా రికార్డు సాధించారు. ప్రస్తుతం 7 ఖండాల్లో 7 పర్వతాలను అధిరోహించి ‘ఎక్స్‌ప్లోరర్‌ గ్రాండ్‌ స్లామ్’ను సైతం పూర్తి చేశారు.
12/22
ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ యూఏఈ మంత్రి షేక్‌ నహ్యన్‌ బిన్‌ ముబారక్‌ అల్‌ నహ్యన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విభిన్న జాతుల ప్రజల సంస్కృతులపై(సాంస్కృతిక వైవిధ్యం) సినిమాలు ఎలా ప్రభావం చూపుతాయనే అంశంపై వారు చర్చించారు. ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ యూఏఈ మంత్రి షేక్‌ నహ్యన్‌ బిన్‌ ముబారక్‌ అల్‌ నహ్యన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విభిన్న జాతుల ప్రజల సంస్కృతులపై(సాంస్కృతిక వైవిధ్యం) సినిమాలు ఎలా ప్రభావం చూపుతాయనే అంశంపై వారు చర్చించారు.
13/22
14/22
ఇది అమెరికాలోని నెవెడా రాష్ట్రం లాస్ట్‌ చర్చ్‌లో ఉన్న అంతర్జాతీయ కార్ల ఫారెస్ట్‌. ఇక్కడ పెద్ద సంఖ్యలో పాతబడిన కార్లు, ట్రక్కులు, ఇతర వాహనాలను నిట్ట నిలువుగా ప్రదర్శనకు ఉంచుతారు. వాటిపై ఆకట్టుకునే గ్రాఫిటీ చిత్రాలను తీర్చిదిద్దుతారు. ఈ కార్ల ఫారెస్ట్‌ ఏళ్లుగా సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఇది అమెరికాలోని నెవెడా రాష్ట్రం లాస్ట్‌ చర్చ్‌లో ఉన్న అంతర్జాతీయ కార్ల ఫారెస్ట్‌. ఇక్కడ పెద్ద సంఖ్యలో పాతబడిన కార్లు, ట్రక్కులు, ఇతర వాహనాలను నిట్ట నిలువుగా ప్రదర్శనకు ఉంచుతారు. వాటిపై ఆకట్టుకునే గ్రాఫిటీ చిత్రాలను తీర్చిదిద్దుతారు. ఈ కార్ల ఫారెస్ట్‌ ఏళ్లుగా సందర్శకులను ఆకట్టుకుంటోంది.
15/22
16/22
అఫ్గానిస్థాన్ పక్తికా ప్రావిన్స్‌లోని గయాన్‌ గ్రామంలో భూకంప బాధిత కుటుంబాలకు అందించాల్సిన సాయాన్ని ఇలా వరుసలో పేర్చి ఉంచారు. బుధవారం అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే. అఫ్గానిస్థాన్ పక్తికా ప్రావిన్స్‌లోని గయాన్‌ గ్రామంలో భూకంప బాధిత కుటుంబాలకు అందించాల్సిన సాయాన్ని ఇలా వరుసలో పేర్చి ఉంచారు. బుధవారం అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే.
17/22
పలువురు ఆందోళనకారులు జర్మనీలోని మునిచ్‌లో నిర్వహించిన ఓ నిరసన ప్రదర్శనలో జీ7 దేశాల అధినేతల వేషధారణతో ఆకట్టుకున్నారు. జర్మనీలోని ఎల్మాలో ఈ నెల 26 నుంచి 28 వరకు జీ7 దేశాల సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రదర్శన చేపట్టారు. కరోనా టీకాలు మనుషుల్ని కాపాడాటానికా? లేదా కార్పొరేట్‌ సంస్థలా లాభార్జనకా?అని అర్థం వచ్చేలా ఫొటోలకు పోజులిస్తూ నిరసన తెలిపారు. పలువురు ఆందోళనకారులు జర్మనీలోని మునిచ్‌లో నిర్వహించిన ఓ నిరసన ప్రదర్శనలో జీ7 దేశాల అధినేతల వేషధారణతో ఆకట్టుకున్నారు. జర్మనీలోని ఎల్మాలో ఈ నెల 26 నుంచి 28 వరకు జీ7 దేశాల సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రదర్శన చేపట్టారు. కరోనా టీకాలు మనుషుల్ని కాపాడాటానికా? లేదా కార్పొరేట్‌ సంస్థలా లాభార్జనకా?అని అర్థం వచ్చేలా ఫొటోలకు పోజులిస్తూ నిరసన తెలిపారు.
18/22
19/22
జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం ఉదయం పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీతో సమావేశమయ్యారు. పార్టీ సభలు, కార్యక్రమాలకు అనుసరించాల్సిన ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం ఉదయం పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీతో సమావేశమయ్యారు. పార్టీ సభలు, కార్యక్రమాలకు అనుసరించాల్సిన ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు.
20/22
21/22
తిరుమల వసంత మండపంలో శనివారం ఉదయం శోడశ దినాత్మక అరణ్యకాండ పారాయణం ప్రారంభించారు. తిరుమల వసంత మండపంలో శనివారం ఉదయం శోడశ దినాత్మక అరణ్యకాండ పారాయణం ప్రారంభించారు.
22/22

మరిన్ని