News in pics: చిత్రం చెప్పే సంగతులు -02(07-02-2023)

Updated : 07 Feb 2023 20:51 IST
1/17
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న ‘సమతా కుంబ్‌ -2023’లో భాగంగా ఈ రోజు భక్తులతో అంగన్యాసం, కరన్యాసం సహిత మంత్ర అనుష్ఠానం చేయించారు. ఈ సందర్భంగా చినజీయర్‌ స్వామి చిన్నారులకు పెరుమాళ్లపాద తీర్థాన్ని పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న ‘సమతా కుంబ్‌ -2023’లో భాగంగా ఈ రోజు భక్తులతో అంగన్యాసం, కరన్యాసం సహిత మంత్ర అనుష్ఠానం చేయించారు. ఈ సందర్భంగా చినజీయర్‌ స్వామి చిన్నారులకు పెరుమాళ్లపాద తీర్థాన్ని పంపిణీ చేశారు.
2/17
కరన్యాసం చేస్తున్న చిన్నారి కరన్యాసం చేస్తున్న చిన్నారి
3/17
శ్రీశైలంలో శివరాత్రి పర్వదినానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆలయంలో ఏర్పాటు చేసిన విద్యుత్తు కాంతులు మిరిమిట్లు గొలుపుతున్నాయి.. శ్రీశైలంలో శివరాత్రి పర్వదినానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆలయంలో ఏర్పాటు చేసిన విద్యుత్తు కాంతులు మిరిమిట్లు గొలుపుతున్నాయి..
4/17
ఆలయంలో ఏర్పాటు చేసిన విద్యుత్తు కాంతులు ఆలయంలో ఏర్పాటు చేసిన విద్యుత్తు కాంతులు
5/17
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సైబర్‌ క్రైమ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, ప్రముఖులు పాల్గొన్నారు. హెల్ప్‌లైన్‌ నెంబర్‌ కరపత్రికను ఆవిష్కరించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సైబర్‌ క్రైమ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, ప్రముఖులు పాల్గొన్నారు. హెల్ప్‌లైన్‌ నెంబర్‌ కరపత్రికను ఆవిష్కరించారు.
6/17
సదస్సులో పాల్గొన్న ప్రముఖులు సదస్సులో పాల్గొన్న ప్రముఖులు
7/17
కుమురంభీం జిల్లా జైనూర్‌ మండలం నుంచి కర్ణంగూడకు వెళ్తున్నప్పుడు.. అందరి చూపులను ఆకట్టుకునేలా 20అడుగుల ఎత్తున ఓ వలను ఏర్పాటు చేశారు.  దీని కింద సోలార్‌ ఫెన్సింగ్‌తో పాటు చుట్టూ చీరలు కట్టి మధ్యలో పంట పండిస్తున్నారు. అడవి పందులు, పక్షులు రాకుండా ఈ ఏర్పాటు చేసినట్లు రైతు తెలిపాడు. కుమురంభీం జిల్లా జైనూర్‌ మండలం నుంచి కర్ణంగూడకు వెళ్తున్నప్పుడు.. అందరి చూపులను ఆకట్టుకునేలా 20అడుగుల ఎత్తున ఓ వలను ఏర్పాటు చేశారు. దీని కింద సోలార్‌ ఫెన్సింగ్‌తో పాటు చుట్టూ చీరలు కట్టి మధ్యలో పంట పండిస్తున్నారు. అడవి పందులు, పక్షులు రాకుండా ఈ ఏర్పాటు చేసినట్లు రైతు తెలిపాడు.
8/17
నాగ శౌర్య, మాళవిక నాయర్‌ జంటగా అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఈ  సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. నాగ శౌర్య, మాళవిక నాయర్‌ జంటగా అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
9/17
చిత్తూరు జిల్లాలోని నిండ్ర మండలంలో మంత్రి రోజా పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తాగునీటి పైపులైన్‌లను ఆమె ప్రారంభించి ప్రజలతో ముచ్చటించారు. చిత్తూరు జిల్లాలోని నిండ్ర మండలంలో మంత్రి రోజా పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తాగునీటి పైపులైన్‌లను ఆమె ప్రారంభించి ప్రజలతో ముచ్చటించారు.
10/17
హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంతర్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంతర్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి..
11/17
పాల్గొన్న విద్యార్థులు పాల్గొన్న విద్యార్థులు
12/17
హీరో సుహాస్‌ ప్రధాన పాత్రలో షణ్ముఖ ప్రశాంత్‌ తెరకెక్కించిన చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్’.  ఈ చిత్రం విజయపథంలో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా మహిళలు ఈ సినిమాని ఉచితంగా చుసే అవకాశాన్ని చిత్రబృందం కల్పించింది. రెండు తెలుగు రాష్ర్టాల్లో 38 థియేటర్‌లలో ఫిబ్రవరి 8న టికెట్‌ లేకుండా ఈ సినిమాని చూడొచ్చని తెలిపారు. హీరో సుహాస్‌ ప్రధాన పాత్రలో షణ్ముఖ ప్రశాంత్‌ తెరకెక్కించిన చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్’. ఈ చిత్రం విజయపథంలో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా మహిళలు ఈ సినిమాని ఉచితంగా చుసే అవకాశాన్ని చిత్రబృందం కల్పించింది. రెండు తెలుగు రాష్ర్టాల్లో 38 థియేటర్‌లలో ఫిబ్రవరి 8న టికెట్‌ లేకుండా ఈ సినిమాని చూడొచ్చని తెలిపారు.
13/17
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన ‘హాథ్ సే హాథ్’ జోడో యాత్ర రెండో రోజు ములుగు జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి, ఇతర నాయకులు రామప్ప ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన ‘హాథ్ సే హాథ్’ జోడో యాత్ర రెండో రోజు ములుగు జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి, ఇతర నాయకులు రామప్ప ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
14/17
జోడో యాత్రలో కోలాటం ఆడుతున్న మహిళలు జోడో యాత్రలో కోలాటం ఆడుతున్న మహిళలు
15/17
హీరో సుహాస్‌ ప్రధాన పాత్రలో షణ్ముఖ ప్రశాంత్‌ తెరకెక్కించిన చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్’’. ఈ చిత్రం విజయపథంలో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా సినిమా చూసిన హీరో మహేశ్‌బాబు చిత్ర బృందాన్ని అభినందించారు. ‘ మంచి సినిమా. క్లైమాక్స్‌ బాగుంది’ అని ఆయన ట్వీట్‌ చేశారు.  హీరో సుహాస్‌ ప్రధాన పాత్రలో షణ్ముఖ ప్రశాంత్‌ తెరకెక్కించిన చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్’’. ఈ చిత్రం విజయపథంలో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా సినిమా చూసిన హీరో మహేశ్‌బాబు చిత్ర బృందాన్ని అభినందించారు. ‘ మంచి సినిమా. క్లైమాక్స్‌ బాగుంది’ అని ఆయన ట్వీట్‌ చేశారు.
16/17
కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. కశ్మీర పరదేశీ కథానాయిక. మురళీ కిషోర్‌ అబ్బురూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 17న సాయంత్రం సుప్రీం హీరో సాయి థరమ్‌ తేజ్‌ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. కశ్మీర పరదేశీ కథానాయిక. మురళీ కిషోర్‌ అబ్బురూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 17న సాయంత్రం సుప్రీం హీరో సాయి థరమ్‌ తేజ్‌ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
17/17
నూతన సచివాలయం సమీపంలోని వెనక భాగం వద్ద  ప్రధాన రహదారి పక్కన మంచినీటి పైపు పగిలి నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో మంచి నీరు వృథా అవుతోంది. ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. 
నూతన సచివాలయం సమీపంలోని వెనక భాగం వద్ద ప్రధాన రహదారి పక్కన మంచినీటి పైపు పగిలి నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో మంచి నీరు వృథా అవుతోంది. ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు