News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (17-05-2023)

Updated : 17 May 2023 21:30 IST
1/25
హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌, బెంగళూరు జట్ల మధ్య గురువారం మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా ఇరుజట్ల ఆటగాళ్లు స్టేడియంలో ప్రాక్టీస్‌ చేశారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌, బెంగళూరు జట్ల మధ్య గురువారం మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా ఇరుజట్ల ఆటగాళ్లు స్టేడియంలో ప్రాక్టీస్‌ చేశారు.
2/25
రాజకీయ నాయకుడు దేవేందర్‌ గౌడ్ మనవరాలు మయూక.. ‘ఐక్యం’ అనే పాటను సొంతంగా కంపోజ్‌, కొరియోగ్రఫీ చేశారు. మహిళా సాధికారత, సంస్కృతి, వారసత్వ సంపదను కాపాడాలనే ఉద్దేశంతో దీన్ని రూపొందించారు. ఈ పాటను హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో లాంచ్‌ చేశారు. కార్యక్రమంలో లక్ష్మి మంచు, సిద్ధు జొన్నలగడ్డ, సీరత్‌ కపూర్‌, విజయేందర్‌ గౌడ్‌, వీరేంద్ర గౌడ్‌ పాల్గొన్నారు. రాజకీయ నాయకుడు దేవేందర్‌ గౌడ్ మనవరాలు మయూక.. ‘ఐక్యం’ అనే పాటను సొంతంగా కంపోజ్‌, కొరియోగ్రఫీ చేశారు. మహిళా సాధికారత, సంస్కృతి, వారసత్వ సంపదను కాపాడాలనే ఉద్దేశంతో దీన్ని రూపొందించారు. ఈ పాటను హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో లాంచ్‌ చేశారు. కార్యక్రమంలో లక్ష్మి మంచు, సిద్ధు జొన్నలగడ్డ, సీరత్‌ కపూర్‌, విజయేందర్‌ గౌడ్‌, వీరేంద్ర గౌడ్‌ పాల్గొన్నారు.
3/25
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర బుధవారం నంద్యాల జిల్లాలోని మూలమఠం క్యాంప్‌ సైట్‌ నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా లోకేశ్‌కు ప్రజలు, కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు. లోకేశ్‌ దారి పొడవునా ప్రజల సమస్యలు తెలుసకుంటూ ముందుకు సాగారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర బుధవారం నంద్యాల జిల్లాలోని మూలమఠం క్యాంప్‌ సైట్‌ నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా లోకేశ్‌కు ప్రజలు, కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు. లోకేశ్‌ దారి పొడవునా ప్రజల సమస్యలు తెలుసకుంటూ ముందుకు సాగారు.
4/25
హైదరాబాద్‌లోని కొత్తపేట రైతుబజార్ ముందు వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతు కూలీలు తాటి ముంజలను విక్రయించారు. వేసవి ఎండల్లో చల్లటి రుచి కోసం నగరవాసులు వీటిని కొనేందుకు ఆసక్తి చూపారు. హైదరాబాద్‌లోని కొత్తపేట రైతుబజార్ ముందు వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతు కూలీలు తాటి ముంజలను విక్రయించారు. వేసవి ఎండల్లో చల్లటి రుచి కోసం నగరవాసులు వీటిని కొనేందుకు ఆసక్తి చూపారు.
5/25
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా పంజాబ్‌, దిల్లీ జట్ల మధ్య ధర్మశాల వేదికగా మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన పంజాబ్‌ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌కు ముందు ఇరుజట్ల కెప్టెన్‌లు శిఖర్‌ ధావన్‌, డేవిడ్‌ వార్నర్‌ ఇలా నవ్వుతూ ఫొటోకు పోజిచ్చారు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా పంజాబ్‌, దిల్లీ జట్ల మధ్య ధర్మశాల వేదికగా మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన పంజాబ్‌ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌కు ముందు ఇరుజట్ల కెప్టెన్‌లు శిఖర్‌ ధావన్‌, డేవిడ్‌ వార్నర్‌ ఇలా నవ్వుతూ ఫొటోకు పోజిచ్చారు.
6/25
ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌30’(వర్కింగ్ టైటిల్‌). మే 20న తారక్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మే 19న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఓ ఆసక్తికర ఫొటోను ట్విటర్‌లో పంచుకుంది. ‘సముద్రం నిండా రక్తంతో రాసిన అతని కథలు ఉంటాయి’ అని ట్వీట్‌ చేసింది. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌30’(వర్కింగ్ టైటిల్‌). మే 20న తారక్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మే 19న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఓ ఆసక్తికర ఫొటోను ట్విటర్‌లో పంచుకుంది. ‘సముద్రం నిండా రక్తంతో రాసిన అతని కథలు ఉంటాయి’ అని ట్వీట్‌ చేసింది.
7/25
రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఆటగాళ్లు  ధర్మశాలలో బౌద్ధ గురువు దలైలామాను కలిశారు. ఆయనకు ఆర్‌ఆర్‌ జెర్సీ, టోపీ, జ్ఞాపికను అందజేసి సత్కరించారు. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఆటగాళ్లు ధర్మశాలలో బౌద్ధ గురువు దలైలామాను కలిశారు. ఆయనకు ఆర్‌ఆర్‌ జెర్సీ, టోపీ, జ్ఞాపికను అందజేసి సత్కరించారు.
8/25
నూతన సచివాలయం ఎదుట చేపట్టిన అమరవీరుల స్మృతి చిహ్నం పనులు చకచకా సాగుతున్నాయి. బుధవారం సాయంత్రం వాతావరణం చల్లబడటంతో ఆకాశంలో మేఘాల ప్రతిబింబం స్మృతిచిహ్నంపై పడి చూపరులను ఆకట్టుకుంది. నూతన సచివాలయం ఎదుట చేపట్టిన అమరవీరుల స్మృతి చిహ్నం పనులు చకచకా సాగుతున్నాయి. బుధవారం సాయంత్రం వాతావరణం చల్లబడటంతో ఆకాశంలో మేఘాల ప్రతిబింబం స్మృతిచిహ్నంపై పడి చూపరులను ఆకట్టుకుంది.
9/25
‘బ‌ల‌గం’ సినిమా గాయకులు మొగిల‌య్య, కొముర‌మ్మలకు ‘ద‌ళిత బంధు’ పథకం కింద మంజూరైన కారును నేడు మంత్రి దయాకర్‌రావు, బోయినపల్లి వినోద్‌, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు అందజేశారు. ‘బ‌ల‌గం’ సినిమా గాయకులు మొగిల‌య్య, కొముర‌మ్మలకు ‘ద‌ళిత బంధు’ పథకం కింద మంజూరైన కారును నేడు మంత్రి దయాకర్‌రావు, బోయినపల్లి వినోద్‌, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు అందజేశారు.
10/25
భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఖేలో భారత్‌ జీతో’ క్రీడాపోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బ్యాట్‌ పట్టి క్రికెట్‌ ఆడి క్రీడాకారుల్లో హుషారు నింపారు. భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఖేలో భారత్‌ జీతో’ క్రీడాపోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బ్యాట్‌ పట్టి క్రికెట్‌ ఆడి క్రీడాకారుల్లో హుషారు నింపారు.
11/25
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ధర్మశాలలో మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ జట్టు సభ్యులు బౌద్ధ మతగురువు దలైలామాను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ధర్మశాలలో మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ జట్టు సభ్యులు బౌద్ధ మతగురువు దలైలామాను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
12/25
జయతి ముఖ్య పాత్ర పోషించిన ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి.. నాకేందిరా ఈ లొల్లి’ అనే ప్రైవేట్‌ పాటను బుధవారం విడుదల చేశారు. కార్యక్రమంలో చక్రవర్తి, రామ్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. జయతి ముఖ్య పాత్ర పోషించిన ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి.. నాకేందిరా ఈ లొల్లి’ అనే ప్రైవేట్‌ పాటను బుధవారం విడుదల చేశారు. కార్యక్రమంలో చక్రవర్తి, రామ్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
13/25
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆరు రోజులుగా నిర్వహించిన చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహా యాగాన్ని బుధవారం పూర్ణాహుతిలో ముగించారు. కార్యక్రమంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆరు రోజులుగా నిర్వహించిన చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహా యాగాన్ని బుధవారం పూర్ణాహుతిలో ముగించారు. కార్యక్రమంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
14/25
కర్ణాటక కాంగ్రెస్‌ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ వేర్వేరుగా పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. మరోవైపు కర్ణాటక సీఎం పదవి ఎవరికి ఇవ్వాలన్న అంశంపై పార్టీ అధిష్ఠానంలో చర్చలు కొనసాగుతున్నాయి. కర్ణాటక కాంగ్రెస్‌ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ వేర్వేరుగా పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. మరోవైపు కర్ణాటక సీఎం పదవి ఎవరికి ఇవ్వాలన్న అంశంపై పార్టీ అధిష్ఠానంలో చర్చలు కొనసాగుతున్నాయి.
15/25
తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ జాతర ముగింపు ఘట్టాన్ని ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ జాతర ముగింపు ఘట్టాన్ని ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు.
16/25
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సందిస్తూ.. ‘పాపం పసివాడు’ సినిమా పోస్టర్‌ను పోలిన ఈ కార్టూన్‌ను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సందిస్తూ.. ‘పాపం పసివాడు’ సినిమా పోస్టర్‌ను పోలిన ఈ కార్టూన్‌ను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.
17/25
సరిగ్గా ఇదే రోజున 2012లో దిల్లీ డేర్‌ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాళ్లు గేల్‌ 128 పరుగులు, కోహ్లీ 73 రన్స్‌తో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడారు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరు రికార్డు స్థాయిలో 204 పరుగుల భాగస్వామం నమోదు చేశారు. సరిగ్గా ఇదే రోజున 2012లో దిల్లీ డేర్‌ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాళ్లు గేల్‌ 128 పరుగులు, కోహ్లీ 73 రన్స్‌తో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడారు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరు రికార్డు స్థాయిలో 204 పరుగుల భాగస్వామం నమోదు చేశారు.
18/25
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌లో మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌లో మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
19/25
తెలంగాణలో పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షను బుధవారం నిర్వహించారు. విద్యార్థులు ఉదయం నుంచే పరీక్ష కేంద్రాల వద్ద బారులుతీరారు. కరీంనగర్‌లోని పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులను చిత్రంలో చూడవచ్చు. తెలంగాణలో పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షను బుధవారం నిర్వహించారు. విద్యార్థులు ఉదయం నుంచే పరీక్ష కేంద్రాల వద్ద బారులుతీరారు. కరీంనగర్‌లోని పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులను చిత్రంలో చూడవచ్చు.
20/25
అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ, బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌లను వేర్వేరుగా కలిశారు. పునరుత్పాదక ఇంధన రంగం గురించి ముఖేశ్‌ అంబానీతో చర్చించారు. ప్రపంచంపై హాలీవుడ్‌, బాలీవుడ్‌ సినిమాల ప్రభావం గురించి షారుక్‌తో ముచ్చటించారు. అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ, బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌లను వేర్వేరుగా కలిశారు. పునరుత్పాదక ఇంధన రంగం గురించి ముఖేశ్‌ అంబానీతో చర్చించారు. ప్రపంచంపై హాలీవుడ్‌, బాలీవుడ్‌ సినిమాల ప్రభావం గురించి షారుక్‌తో ముచ్చటించారు.
21/25
హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ నగర్‌లో సిరాజ్‌ కొత్తగా కట్టుకున్న ఇంటిని కోహ్లీ, డుప్లెసిస్‌, కేదార్‌ జాదవ్‌, పార్నెల్‌లతో పాటు ఆర్సీబీ జట్టు సభ్యులు కొందరు సందర్శించారు. సిరాజ్‌ ఇంట్లో విందు ఆరగించారు. స్టార్‌ ఆటగాళ్ల రాకతో ఆ ప్రాంతమంతా సందడిగా మారిపోయింది. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ నగర్‌లో సిరాజ్‌ కొత్తగా కట్టుకున్న ఇంటిని కోహ్లీ, డుప్లెసిస్‌, కేదార్‌ జాదవ్‌, పార్నెల్‌లతో పాటు ఆర్సీబీ జట్టు సభ్యులు కొందరు సందర్శించారు. సిరాజ్‌ ఇంట్లో విందు ఆరగించారు. స్టార్‌ ఆటగాళ్ల రాకతో ఆ ప్రాంతమంతా సందడిగా మారిపోయింది.
22/25
ప్రాన్స్‌లో  76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేదికపై బాలీవుడ్‌ భామలు తళుక్కుమన్నారు. బాలీవుడ్‌ నటీమణులు సారా అలీఖాన్‌, ఈషాగుప్తా, మానుషి చిల్లర్‌ ర్యాంప్‌పై హోయలొలికించారు. హాలీవుడ్‌కు చెందిన పలువురు నటులు ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో మెరిశారు. ప్రాన్స్‌లో 76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేదికపై బాలీవుడ్‌ భామలు తళుక్కుమన్నారు. బాలీవుడ్‌ నటీమణులు సారా అలీఖాన్‌, ఈషాగుప్తా, మానుషి చిల్లర్‌ ర్యాంప్‌పై హోయలొలికించారు. హాలీవుడ్‌కు చెందిన పలువురు నటులు ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో మెరిశారు.
23/25
24/25
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న ‘PKSDT’ సినిమా అప్‌డేట్‌ వచ్చేసింది. గురువారం సాయంత్రం 4.14 గంటలకు ఈ మూవీ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. సుముద్రఖని దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న ‘PKSDT’ సినిమా అప్‌డేట్‌ వచ్చేసింది. గురువారం సాయంత్రం 4.14 గంటలకు ఈ మూవీ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. సుముద్రఖని దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.
25/25
 భద్రాచలం  శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి విచ్చేసిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు దేవస్థానం ఈవో రమాదేవి, ఆర్డీవో రత్న కల్యాణి,  తహసీల్దార్‌ శ్రీనివాస్ యాదవ్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి విచ్చేసిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు దేవస్థానం ఈవో రమాదేవి, ఆర్డీవో రత్న కల్యాణి, తహసీల్దార్‌ శ్రీనివాస్ యాదవ్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Tags :

మరిన్ని