News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (23-05-2023)

Updated : 23 May 2023 15:17 IST
1/12
ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో నూతనంగా నిర్మించిన ఆ రాష్ట్ర హైకోర్టు భవనమిది. ఈ భవన సముదాయాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం ప్రారంభించనున్నారు 
ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో నూతనంగా నిర్మించిన ఆ రాష్ట్ర హైకోర్టు భవనమిది. ఈ భవన సముదాయాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం ప్రారంభించనున్నారు
2/12
మద్యం మత్తులో బతికున్న పాము తలను నోటితో నమిలాడు ఓ వ్యక్తి. తమ ఇళ్లను రైల్వే అధికారులు ఖాళీ చేయిస్తున్నారన్న ఆగ్రహంతో ఈ చర్యకు పాల్పడ్డాడు. ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. లాల్కువాన్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించారనే కారణంతో అధికారులు అక్కడి వారందరినీ ఖాళీ చేయిస్తున్నారు. 

3/12
పలు దేశాలకు చెందిన ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని టాలీవుడ్‌ హీరో రామ్‌ చరణ్‌ పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదన్న చరణ్‌.. ప్రకృతి అందాలకు నెలవైన కశ్మీర్‌లో ఈ కార్యక్రమం జరగడం సంతోషకరమని చెప్పారు. జీ-20 సదస్సు జరుగుతున్న ఇదే ఆడిటోరియంలో 2016లో తన సినిమా షూటింగ్‌ జరిగిందని గుర్తు చేసుకున్నారు. పలు దేశాలకు చెందిన ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని టాలీవుడ్‌ హీరో రామ్‌ చరణ్‌ పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదన్న చరణ్‌.. ప్రకృతి అందాలకు నెలవైన కశ్మీర్‌లో ఈ కార్యక్రమం జరగడం సంతోషకరమని చెప్పారు. జీ-20 సదస్సు జరుగుతున్న ఇదే ఆడిటోరియంలో 2016లో తన సినిమా షూటింగ్‌ జరిగిందని గుర్తు చేసుకున్నారు.
4/12
 పాతపట్నంలో నీలమణిదుర్గ అమ్మవారి సంబరాల సందడి నెలకొంది. విద్యుద్దీపాలతో ఆలయం కాంతులీనుతోంది. అమ్మవారికి మంగళవారం ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి పూజలు చేసి మొక్కులు చెల్లించుకోనున్నారు. 

5/12
ఆస్పరి మండలంలోని ములుగుందంలో నీటి సమస్య వేధిస్తోంది. నాలుగువేల మంది జనాభా ఉన్న ఇక్కడ ఇంటింటి కుళాయిలు లేవు. దస్తగిరిస్వామి దర్గా వెనుక భాగంలో ఉన్న మూడు నీటి ట్యాంకుల వద్ద జనం నీటి కోసం ఎప్పుడు ఎదురుచూస్తునే ఉంటారు. రెండు చక్రాల బండ్లను తయారు చేసుకొని దాదాపు 6 నుంచి 8 బిందెల్ని అందులో చొప్పించి వాటిని నింపి ఇళ్లకు తీసుకెళ్తుంటారు. ఆస్పరి మండలంలోని ములుగుందంలో నీటి సమస్య వేధిస్తోంది. నాలుగువేల మంది జనాభా ఉన్న ఇక్కడ ఇంటింటి కుళాయిలు లేవు. దస్తగిరిస్వామి దర్గా వెనుక భాగంలో ఉన్న మూడు నీటి ట్యాంకుల వద్ద జనం నీటి కోసం ఎప్పుడు ఎదురుచూస్తునే ఉంటారు. రెండు చక్రాల బండ్లను తయారు చేసుకొని దాదాపు 6 నుంచి 8 బిందెల్ని అందులో చొప్పించి వాటిని నింపి ఇళ్లకు తీసుకెళ్తుంటారు.
6/12
జూబ్లిహిల్స్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రం ఆవరణలో పాత ఇనుప సామగ్రితో రూపొందించిన నెమలి.. పచ్చని చెట్ల మధ్య సందర్శకులను ఆకట్టుకుంటోంది. 
జూబ్లిహిల్స్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రం ఆవరణలో పాత ఇనుప సామగ్రితో రూపొందించిన నెమలి.. పచ్చని చెట్ల మధ్య సందర్శకులను ఆకట్టుకుంటోంది.
7/12
సోమవారం ఉదయం కురిసిన వర్షానికి ఆయా ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు స్వల్పంగా అంతరాయం కలిగింది. అసెంబ్లీ సమీపంలోని రహదారిపై వర్షపు నీరు నిలవడంతో డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది తొలగిస్తూ కనిపించారు.

8/12
భగభగ మండుతున్న ఎండలతో ప్రజలు, వివిధ వ్యాపారాలు నిర్వహించుకునే వారు వేడిని తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ప్రజలు బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. వ్యాపారులు దుకాణాల ముందు షేడ్‌ నెట్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వేములవాడ పట్టణంలోని ఆలయ ప్రధాన రహదారి పొడవునా షేడ్‌ నెట్లు కట్టుకుని ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు. భగభగ మండుతున్న ఎండలతో ప్రజలు, వివిధ వ్యాపారాలు నిర్వహించుకునే వారు వేడిని తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ప్రజలు బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. వ్యాపారులు దుకాణాల ముందు షేడ్‌ నెట్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వేములవాడ పట్టణంలోని ఆలయ ప్రధాన రహదారి పొడవునా షేడ్‌ నెట్లు కట్టుకుని ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు.
9/12
నిజామాబాద్‌ నూతన కలెక్టరేట్‌ను గతేడాది సెప్టెంబరులో ప్రారంభించారు. పాలనంతా ఇక్కడి నుంచే సాగుతోంది. రెండో అంతస్తుపై భాగంలో గోడకు తేనె తుట్టె పెట్టడంతో దానికి సమీప గదుల్లో పనిచేసే సిబ్బంది భయపడుతున్నారు. కిటికీ పక్కనే ఉండటంతో రోజు తలుపులు మూసేస్తున్నారు. వేసవి కావడం, గాలి సరిగా రాక ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. నిజామాబాద్‌ నూతన కలెక్టరేట్‌ను గతేడాది సెప్టెంబరులో ప్రారంభించారు. పాలనంతా ఇక్కడి నుంచే సాగుతోంది. రెండో అంతస్తుపై భాగంలో గోడకు తేనె తుట్టె పెట్టడంతో దానికి సమీప గదుల్లో పనిచేసే సిబ్బంది భయపడుతున్నారు. కిటికీ పక్కనే ఉండటంతో రోజు తలుపులు మూసేస్తున్నారు. వేసవి కావడం, గాలి సరిగా రాక ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు.
10/12
కామారెడ్డి కలెక్టరేట్‌కు వచ్చే వారిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చేవారిపై నిఘా పెంచారు. అర్జీదారులు వెంట తెచ్చుకున్న సంచుల్లో, ప్లాస్టిక్‌ కవర్లలో ఏయే వస్తువులు ఉంటున్నాయో గమనిస్తున్నారు. గత వారం ఓ మహిళ సంచిలో యాసిడ్‌ సీసా వెంట తెచ్చుకోగా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి మరింత అప్రమత్తమై తనిఖీలు కట్టుదిట్టం చేస్తున్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌కు వచ్చే వారిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చేవారిపై నిఘా పెంచారు. అర్జీదారులు వెంట తెచ్చుకున్న సంచుల్లో, ప్లాస్టిక్‌ కవర్లలో ఏయే వస్తువులు ఉంటున్నాయో గమనిస్తున్నారు. గత వారం ఓ మహిళ సంచిలో యాసిడ్‌ సీసా వెంట తెచ్చుకోగా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి మరింత అప్రమత్తమై తనిఖీలు కట్టుదిట్టం చేస్తున్నారు.
11/12
శారీరకంగా వైకల్యం ఉంటేనేమీ.. యాదాద్రి లక్ష్మీనరసింహుడిని దర్శించుకోవాలని క్షేత్రానికి చేరుకున్నారు. కొండపైకి, అక్కడి నుంచి ఆలయంలోకి దివ్యాంగులను తీసుకెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో అవస్థలు పడుతూ వచ్చారు. పంచనారసింహులను దర్శించుకొని తమ భక్తితో పాటు దీక్షను చాటుకున్నారు. దేవస్థానం దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. శారీరకంగా వైకల్యం ఉంటేనేమీ.. యాదాద్రి లక్ష్మీనరసింహుడిని దర్శించుకోవాలని క్షేత్రానికి చేరుకున్నారు. కొండపైకి, అక్కడి నుంచి ఆలయంలోకి దివ్యాంగులను తీసుకెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో అవస్థలు పడుతూ వచ్చారు. పంచనారసింహులను దర్శించుకొని తమ భక్తితో పాటు దీక్షను చాటుకున్నారు. దేవస్థానం దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
12/12
వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక మూగజీవాలైతే అల్లాడిపోతున్నాయి. బొమ్మలరామారం మండలం మైలారం గ్రామంలో ఉదయం 11 గంటలకే భానుడి తాపం తాళలేక గొర్రెలు ఇలా చెట్టు కిందికి చేరాయి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక మూగజీవాలైతే అల్లాడిపోతున్నాయి. బొమ్మలరామారం మండలం మైలారం గ్రామంలో ఉదయం 11 గంటలకే భానుడి తాపం తాళలేక గొర్రెలు ఇలా చెట్టు కిందికి చేరాయి.
Tags :

మరిన్ని