Ukraine: ఎవరిదీ పాపం.. ఎంతవరకీ శోకం

ఎంతో మంది తల్లులకు కడుపు కోత మిగిల్చింది. లోకం తెలియని చిన్నారులెందరినో అనాథలను చేసింది. భార్యను పొరుగు దేశం పంపించి భర్త స్వదేశం కోసం పోరాడాల్సి వచ్చింది. కళ్ల ముందే కట్టుకున్న ఇల్లు కూలుతుంటే, అయినవారు దూరమవుతుంటే వెక్కివెక్కి ఏడవాల్సిన దుస్థితిని కల్పించింది.  ఇవన్నీ ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర పర్యవసనాలు. ఈ దాడికి ఈ నెల 24తో ఏడాది పూర్తి కానుంది. యుద్ధ కాలంలోని దయనీయమైన చిత్రాలు మీకోసం..

Updated : 16 Feb 2023 15:44 IST
1/23
ప్రాణాలు అరచేత పట్టుకొని ఉక్రెయిన్‌ నుంచి హంగేరి చేరుకున్న తన కుమార్తెను ప్రేమగా ఆలింగనం చేసుకుంటున్న తల్లి(ఫిబ్రవరి 28, 2022). ప్రాణాలు అరచేత పట్టుకొని ఉక్రెయిన్‌ నుంచి హంగేరి చేరుకున్న తన కుమార్తెను ప్రేమగా ఆలింగనం చేసుకుంటున్న తల్లి(ఫిబ్రవరి 28, 2022).
2/23
యుద్ధ కాలంలో సైనికులుగా మారిన ఉక్రెయిన్‌ పౌరులు ఓ చేత గన్‌, మరో చేత గిటార్‌ పట్టుకొని కనిపించారు.(ఫిబ్రవరి 28, 2022) యుద్ధ కాలంలో సైనికులుగా మారిన ఉక్రెయిన్‌ పౌరులు ఓ చేత గన్‌, మరో చేత గిటార్‌ పట్టుకొని కనిపించారు.(ఫిబ్రవరి 28, 2022)
3/23
తన శునకంతో పాటు పోలండ్‌ సరిహద్దుకు తరలివెళ్తూ కంటతడి పెడుతున్న మహిళ(ఫిబ్రవరి 28, 2022) తన శునకంతో పాటు పోలండ్‌ సరిహద్దుకు తరలివెళ్తూ కంటతడి పెడుతున్న మహిళ(ఫిబ్రవరి 28, 2022)
4/23
ఉక్రెయిన్‌లోని మిర్హార్డ్‌కు చెందిన హన్నా పావ్‌లోవ్‌నా పోలండ్‌ సరిహద్దుకు చేరుకుంది. కానీ తన తల్లి, 12, 8 ఏళ్ల కుమారులు ఉక్రెయిన్‌లోనే ఉండటంతో ఇలా రోదించింది. (ఫిబ్రవరి 28, 2022) ఉక్రెయిన్‌లోని మిర్హార్డ్‌కు చెందిన హన్నా పావ్‌లోవ్‌నా పోలండ్‌ సరిహద్దుకు చేరుకుంది. కానీ తన తల్లి, 12, 8 ఏళ్ల కుమారులు ఉక్రెయిన్‌లోనే ఉండటంతో ఇలా రోదించింది. (ఫిబ్రవరి 28, 2022)
5/23
ఉక్రెయిన్‌లోని క్రమటోర్స్‌ రైల్వే స్టేషన్‌ నుంచి తరలివెళ్తున్న భార్యకు వీడ్కోలు చెబుతున్న సైనికుడు.(ఫిబ్రవరి 27, 2022) ఉక్రెయిన్‌లోని క్రమటోర్స్‌ రైల్వే స్టేషన్‌ నుంచి తరలివెళ్తున్న భార్యకు వీడ్కోలు చెబుతున్న సైనికుడు.(ఫిబ్రవరి 27, 2022)
6/23
కీవ్‌లో భూగర్భంలో ఏర్పాటు చేసిన బాంబ్‌ షెల్టర్‌లో తమ శునకాలతో పాటు ఆశ్రయం పొందుతున్న ఓ జంట(ఫిబ్రవరి 27, 2022) కీవ్‌లో భూగర్భంలో ఏర్పాటు చేసిన బాంబ్‌ షెల్టర్‌లో తమ శునకాలతో పాటు ఆశ్రయం పొందుతున్న ఓ జంట(ఫిబ్రవరి 27, 2022)
7/23
తన పెంపుడు పిల్లితో కలిసి పోలండ్‌ సరిహద్దుకు వెళ్తున్న ఉక్రెయిన్‌ మహిళ(ఫిబ్రవరి 27, 2022) తన పెంపుడు పిల్లితో కలిసి పోలండ్‌ సరిహద్దుకు వెళ్తున్న ఉక్రెయిన్‌ మహిళ(ఫిబ్రవరి 27, 2022)
8/23
ఉక్రెయిన్‌ నుంచి హంగేరి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఓ శరణార్థి బాలుడు ఏడ్వటం స్థానికులను కలచివేసింది.(ఫిబ్రవరి 27, 2022) ఉక్రెయిన్‌ నుంచి హంగేరి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఓ శరణార్థి బాలుడు ఏడ్వటం స్థానికులను కలచివేసింది.(ఫిబ్రవరి 27, 2022)
9/23
ఉక్రెయిన్‌ నుంచి హంగేరి సరిహద్దుకు చేరుకున్న ఇద్దరు చిన్నారులు ఆ దేశంలోకి వెళ్లేందుకు దీనంగా వేచి చూస్తూ కనిపించారు.(ఫిబ్రవరి 2022) ఉక్రెయిన్‌ నుంచి హంగేరి సరిహద్దుకు చేరుకున్న ఇద్దరు చిన్నారులు ఆ దేశంలోకి వెళ్లేందుకు దీనంగా వేచి చూస్తూ కనిపించారు.(ఫిబ్రవరి 2022)
10/23
కీవ్‌లో జరిగిన క్షిపణి దాడిలో తన ఇల్లు కూలిపోవడంతో కంటతడి పెడుతున్న మహిళ(ఫిబ్రవరి 26, 2022) కీవ్‌లో జరిగిన క్షిపణి దాడిలో తన ఇల్లు కూలిపోవడంతో కంటతడి పెడుతున్న మహిళ(ఫిబ్రవరి 26, 2022)
11/23
పోలండ్‌లో నివసిస్తున్న ఇనా కార్పంకో.. తన కుమారుడు వన్యా ఉక్రెయిన్‌ నుంచి పోలండ్‌ సరిహద్దుకు చేరుకోవడంతో భావోద్వేగానికి గురై ఆనంద బాష్పాలు రాల్చారు.( మార్చి 9, 2022) పోలండ్‌లో నివసిస్తున్న ఇనా కార్పంకో.. తన కుమారుడు వన్యా ఉక్రెయిన్‌ నుంచి పోలండ్‌ సరిహద్దుకు చేరుకోవడంతో భావోద్వేగానికి గురై ఆనంద బాష్పాలు రాల్చారు.( మార్చి 9, 2022)
12/23
రేపటిని చూస్తామో లేదో అనే భయంతో ఉక్రెయిన్‌ సైనికులు ఇద్దరు కీవ్‌లో వివాహం చేసుకున్నారు.(మార్చి 6, 2022) రేపటిని చూస్తామో లేదో అనే భయంతో ఉక్రెయిన్‌ సైనికులు ఇద్దరు కీవ్‌లో వివాహం చేసుకున్నారు.(మార్చి 6, 2022)
13/23
పోలండ్‌లోకి అనుమతించాలంటూ సరిహద్దు వద్ద ప్లకార్డులను ప్రదర్శిస్తున్న ఉక్రెయిన్‌ శరణార్థులు(ఫిబ్రవరి 27, 2022). యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌  దేశ పౌరులు వివిధ దేశాలకు శరణార్థులుగా వలస వెళ్లారు. పోలండ్‌లోకి అనుమతించాలంటూ సరిహద్దు వద్ద ప్లకార్డులను ప్రదర్శిస్తున్న ఉక్రెయిన్‌ శరణార్థులు(ఫిబ్రవరి 27, 2022). యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ దేశ పౌరులు వివిధ దేశాలకు శరణార్థులుగా వలస వెళ్లారు.
14/23
ఉక్రెయిన్‌లోని ఇర్పిన్‌లో గాయపడిన ప్రజలకు సహాయం చేస్తున్న సైనికులు( మార్చి 6) ఉక్రెయిన్‌లోని ఇర్పిన్‌లో గాయపడిన ప్రజలకు సహాయం చేస్తున్న సైనికులు( మార్చి 6)
15/23
బుచాలో జరిగిన దాడుల్లో తన భర్త మృతి చెందడంతో రోదిస్తున్న తన్య నెడాష్‌కివిస్కా( ఏప్రిల్‌ 4) బుచాలో జరిగిన దాడుల్లో తన భర్త మృతి చెందడంతో రోదిస్తున్న తన్య నెడాష్‌కివిస్కా( ఏప్రిల్‌ 4)
16/23
కీవ్‌ నగరాన్ని వీడేందుకు పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్‌కు తరలివచ్చిన ప్రజలు(మార్చి 4) కీవ్‌ నగరాన్ని వీడేందుకు పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్‌కు తరలివచ్చిన ప్రజలు(మార్చి 4)
17/23
తమ వివాహం అయిన మరుసటి రోజే నూతన దంపతులు యరీనా అరైవా, సివతొస్లావ్‌ ఉక్రెయిన్‌ కోసం సైన్యంలో చేరి పోరాటం సాగించారు(ఫిబ్రవరి 25 2022) తమ వివాహం అయిన మరుసటి రోజే నూతన దంపతులు యరీనా అరైవా, సివతొస్లావ్‌ ఉక్రెయిన్‌ కోసం సైన్యంలో చేరి పోరాటం సాగించారు(ఫిబ్రవరి 25 2022)
18/23
కీవ్‌ రైల్వే స్టేషన్‌ నుంచి వెళ్తూ ఓ మహిళ భర్తకు ఇలా వీడ్కోలు పలికింది. తన భర్త మాత్రం ఉక్రెయిన్‌ కోసం యుద్ధం చేయడానికి అక్కడే ఉండిపోయాడు. కీవ్‌ రైల్వే స్టేషన్‌ నుంచి వెళ్తూ ఓ మహిళ భర్తకు ఇలా వీడ్కోలు పలికింది. తన భర్త మాత్రం ఉక్రెయిన్‌ కోసం యుద్ధం చేయడానికి అక్కడే ఉండిపోయాడు.
19/23
యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ దేశం నుంచి బయట పడేందుకు కీవ్‌ రైల్వేస్టేషన్‌లో రైలు సీటు కోసం ప్రయత్నిస్తున్న ప్రజలు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ దేశం నుంచి బయట పడేందుకు కీవ్‌ రైల్వేస్టేషన్‌లో రైలు సీటు కోసం ప్రయత్నిస్తున్న ప్రజలు.
20/23
యుద్ధం కారణంగా కీవ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి వెళ్తూ తన భర్తకు వీడ్కోలు చెబుతున్న మహిళ యుద్ధం కారణంగా కీవ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి వెళ్తూ తన భర్తకు వీడ్కోలు చెబుతున్న మహిళ
21/23
కీవ్‌లో క్షిపణి దాడి జరిగి ఇల్లు, ఆస్తులు కోల్పోవడంతో రోదిస్తున్న మహిళ కీవ్‌లో క్షిపణి దాడి జరిగి ఇల్లు, ఆస్తులు కోల్పోవడంతో రోదిస్తున్న మహిళ
22/23
యుద్ధ ట్యాంకు పక్కన మృతి చెందిన సైనికుడు యుద్ధ ట్యాంకు పక్కన మృతి చెందిన సైనికుడు
23/23
మేరియుపోల్‌: యుద్ధం కారణంగా మృతి చెందిన కుమారుడి మృతదేహం వద్ద రోదిస్తున్న తండ్రి మేరియుపోల్‌: యుద్ధం కారణంగా మృతి చెందిన కుమారుడి మృతదేహం వద్ద రోదిస్తున్న తండ్రి

మరిన్ని