Krystyna Pyszkova: మిస్‌ వరల్డ్‌ క్రిస్టినా

మిస్‌ వరల్డ్‌- 2024 కిరీటం అందుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి పలు ఆసక్తికర విశేషాలు..

Updated : 10 Mar 2024 12:23 IST
1/15
చెక్‌ రిపబ్లిక్‌ దేశంలోని ట్రినెక్‌ నగరంలో జన్మించారు. తర్వాత, వీరి కుటుంబం ఆ దేశ రాజధాని ప్రాగ్‌కు షిఫ్ట్‌ అయింది. 

2/15
డ్యుయల్‌ డిగ్రీలో.. లా, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ పూర్తి చేశారు. మోడలింగ్‌పై ఆసక్తి ఉండడంతో అటుగా అడుగులు వేశారు.

3/15
2022లో.. లండన్‌లోని ‘ఇలైట్‌ మోడల్‌ మేనేజ్‌మెంట్‌’లో చేరి, మెళకువలు నేర్చుకున్నారు. 

4/15
అదే ఏడాదిలో నిర్వహించిన ‘మిస్‌ చెక్‌ రిపబ్లిక్‌’ పోటీల్లో పాల్గొని, తొలి ప్రయత్నంలోనే కిరీటం దక్కించుకున్నారు. 

5/15
సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా ఉండే ఆమె ‘క్రిస్టినా పిస్కో ఫౌండేషన్‌’ స్థాపించారు. ఆర్థికంగా వెనుకబడిన చిన్నారులకు విద్య దూరం కాకూడదని భావించిన క్రిస్టినా టాంజానియాలో ఓ పాఠశాలను నెలకొల్పారు. 

6/15
24 ఏళ్ల ఈ ప్రపంచ సుందరి ఎత్తు 180 సెం.మీ. ఇంగ్లిష్‌, జర్మన్‌, పోలిష్‌ (పోలాండ్‌), స్లోవక్‌ (చెక్‌ రిపబ్లిక్‌, స్లోవకియా).

7/15
మ్యూజిక్‌, ఆర్ట్‌పై ప్యాషన్‌. ఫ్లూట్‌, వయొలిన్ ప్లే చేయడమంటే మహా ఇష్టం. 
 
8/15
‘‘పలు కారణాల వల్ల ఇప్పటికీ ఎంతోమంది చిన్నారులు పాఠశాలలకు వెళ్లడం లేదు. అలాంటి వారిని చేరదీసి, విలువైన విద్యను అందించడమే నా లక్ష్యం’’ అంటూ ఫైనల్‌ రౌండ్‌లో ప్రసంగించి క్రిస్టినా మంచి మనసు చాటుకున్నారు. 

9/15
విజేతగా తనను ప్రకటించిన అనంతరం క్రిస్టినా మాట్లాడుతూ.. ప్రపంచ సుందరి కిరీటం సాధించాలనే తన కల నిజమైందంటూ ఆనందం వ్యక్తం చేశారు. గ్లోబల్‌ ప్లాట్‌ఫామ్‌పై  చెక్‌ రిపబ్లిక్‌కు ప్రాతినిధ్యం వహించడం తనకు దక్కిన గౌరవమన్నారు.

10/15
చెక్‌ రిపబ్లిక్‌ నుంచి ప్రపంచ సుందరి కిరీటం అందుకున్న రెండో మహిళగా క్రిస్టినా నిలిచారు. అంతకు ముందు ఆ దేశం తరఫున టటానా కుచరోవా ఆ కిరీటం అందుకున్నారు.

11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని