News in Pics : చిత్రం చెప్పే సంగతులు(20-03-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 20 Mar 2024 03:50 IST
1/10
హైదరాబాద్‌: పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న ఓ జంట ఆదిలాబాద్‌ నుంచి వచ్చి నగరంలోని ట్యాంక్‌బండ్‌పై ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ నిర్వహించుకుంటున్నారు.  కావాల్సిన సామగ్రితోపాటు పోర్టబుల్‌ డ్రెస్‌ చేంజ్‌ టెంట్‌ కూడా వెంట తెచ్చుకున్నారు.

2/10
విశాఖపట్నం: ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రీకరణలో భాగంగా ప్రముఖ హీరో రామ్‌చరణ్‌ ఇటీవల విశాఖ వచ్చారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో రామ్‌చరణ్‌ బీచ్‌లో విహరించారు. భార్య ఉపాసన, కూతురుతో కలసి తీరం అందాలను ఆస్వాదించారు. సంబంధిత ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. వైజాగ్‌ తమ హృదయాలను దోచుకుందని పేర్కొన్నారు.

3/10
నల్గొండ: నూతనకల్‌ మండలం యడవెల్లి గ్రామంలో చీమలకుంట చెరువు నాలుగు నెలల కిందట నీటితో నిండిపోయి జలకళ సంతరించుకుంది. పిచ్చుకలు తమ గూళ్లను అల్లుకోవడానికి కుంట వద్ద చెట్టు కోసం అన్వేషిస్తున్నాయి. శత్రువుల బారి నుంచి రక్షణ లభిస్తుందని ముళ్లున్న తుమ్మ చెట్టును ఎంచుకొని పదుల సంఖ్యలో పిచ్చుకలు గూళ్లు కట్టుకొన్నాయి. ఉదయం, సాయంత్రం పిచ్చుకల కిలకిలరావాలతో తుమ్మచెట్టు అందరిని ఆకట్టుకుంటోంది.

4/10
ఒడిశా: ఒకప్పుడు ఇళ్ల బయట కిచకిచ శబ్దాలతో సందడి చేసే పిచ్చుకలు అంతటా కాంక్రీటు భవనాలతో కనుమరుగవుతున్నాయి. బుల్లిప్రాణుల్ని కాపాడేందుకు అంతా ముందుకు రావాలని బ్రహ్మపురానికి చెందిన కళాకారుడు సత్యనారాయణ మహరణా విన్నవించారు. బుధవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ఆయన మంగళవారం సైకత యానిమేషన్‌ తీర్చిదిద్దాడు.

5/10
తమిళనాడు: లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై మంగళవారం ముఖానికి రంగులు అద్దుకుని అవగాహన కల్పిస్తున్న చెన్నైలోని కన్యకాపరమేశ్వరి కళాశాల విద్యార్థినులు.

6/10
విశాఖపట్నం: మన్యంలో వేసవిలోనూ మంచు కురిసింది. గత కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి.మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి ఇబ్బందులకు గురిచేసింది. మూడు గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం, ఆ తర్వాత పొగమంచు కురిసింది.వేసవి తాపం నుంచి కాస్త ఉపశమనం లభించింది.

7/10
కర్ణాటక: చారిత్రక బళ్లారి కనకదుర్గమ్మ సిడిబండి జాతర వైభవం మంగళవారం కనుల పండగలా సాగింది. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు తరలిరావడంతో ఉక్కునగరి జన ఉప్పెనను తలపించింది. అమ్మవారిని వెండికవచాలతో ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

8/10
గుంటూరు: మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి రాజాధిరాజ వాహనంపై నృసింహుని గ్రామోత్సవం నిర్వహించారు.అనంతరం భక్తజన సంరక్షణకు స్వామివారు కంకణ బద్ధుడై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్‌ రామకోటిరెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షించారు.

9/10
హైదరాబాద్‌: అసలే వేసవి కాలం.. వేడి నుంచి ఉపశమనం కోసం ఎన్నెన్నో వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి. వెస్ట్‌మారేడుపల్లి రహదారిపై విక్రయిస్తున్న చిన్న ఛార్జింగ్‌ ఫ్యాన్లు ఇవి.

10/10
శ్రీకాకుళం నగర పరిధిలో పెద్దపాడు రోడ్డులో కనిపించిన చిత్రమే. ఆటోవాలాల కక్కుర్తి పిల్లల ప్రాణాల మీదకు తీసుకొస్తోంది.  నిత్యం పరిమితికి మించి ఇలాంటి ఆటోలు నగరం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి.. పోలీసులకు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు.

Tags :

మరిన్ని