close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కాయలు సహజసిద్ధంగా మాగేందుకు ఇథిలీన్‌ తోడ్పడుతుందా?

దానికి కేంద్రం, ఆహార భద్రత, ప్రమాణ మండలి అనుమతి ఉందా: హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: ఇథిఫాన్‌ పొట్లాల నుంచి విడుదలయ్యే ఇథిలీన్‌ వాయువు, కాయలు సహజ సిద్ధంగా మాగడానికి తోడ్పడుతుందో లేదో చెప్పాలని కేంద్రంతోపాటు కేంద్ర ఆహార భద్రత, ప్రమాణ మండలి (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)లను హైకోర్టు వివరణ కోరింది. ఒకవేళ ఇథిలీన్‌ వాయువుతో కాయలను మాగబెట్టేందుకు కేంద్రం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐలు అనుమతించిన పక్షంలో, ఇథిఫాన్‌ను క్రిమి సంహారక మందుగా ఎందుకు పేర్కొంటున్నారో చెప్పాలంది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని కేంద్రాన్ని, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐలను ఆదేశించింది. మామిడి సహా వివిధ రకాల కాయలను మాగబెట్టేందుకు నిషేధిత కార్బైడ్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తుండటంపై ‘ఈనాడు’లో ‘పండు..పండు..పండు..ఆరోగ్యం పుండు..రసాయనం దాని పేరు’ అనే శీర్షికతో 2015 ఆగస్టు 10వ తేదీన ప్రచురితమైంది. ఈ కథనాన్ని హైకోర్టు సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించి విచారణ చేపట్టిన సంగతి విదితమే. ఈ పిటిషన్‌తోపాటు ఇథిఫాన్‌ పొట్లాలు(ప్యాకెట్లు) విక్రయిస్తున్న దుకాణాలపై పోలీసులు దాడులు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఎస్‌జీఎస్‌ ఇంటర్నేషనల్‌, గోల్డ్‌రైప్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లు దాఖలు చేసిన మరో రెండు పిటిషన్‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు సహాయకుడు, సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఇథిలీన్‌ వాడకాన్ని ఆమోదించినప్పటికీ, దాని వినియోగంలో నిర్దిష్ట విధానాన్ని అనుసరించాల్సి ఉందని పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఇథిలీన్‌ వినియోగానికి ఆమోదం ఉన్నప్పటికీ పోలీసులు దుకాణదారులపై కేసులు నమోదు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారన్నారు.  వాదనలను విన్న ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు