దహీ శాండ్‌విచ్‌

ఈ లాక్‌డౌన్‌ సమయంలో తొందరగా సిద్ధమయ్యే అల్పాహారాలు కావాలంటే దహీ శాండ్‌విచ్‌ ప్రయత్నించవచ్ఛు అందమైన ఉదయాన్ని నూనెలేని స్వచ్ఛమైన ఆహారంతో ఆనందంగా ప్రారంభించవచ్ఛు.

Published : 26 Apr 2020 00:50 IST

లాక్‌డౌన్‌ స్పెషల్‌

లాక్‌డౌన్‌ సమయంలో తొందరగా సిద్ధమయ్యే అల్పాహారాలు కావాలంటే దహీ శాండ్‌విచ్‌ ప్రయత్నించవచ్ఛు అందమైన ఉదయాన్ని నూనెలేని స్వచ్ఛమైన ఆహారంతో ఆనందంగా ప్రారంభించవచ్ఛు.

కావాల్సినవి: పెరుగు- రెండు కప్పులు, మయోనైజ్‌- పావుకప్పు, బ్రెడ్‌స్లైస్‌లు- రెండు, క్యారెట్‌, క్యాబేజీ, క్యాప్సికమ్‌ ముక్కలు, ఉడికించిన స్వీట్‌కార్న్‌- రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున, మిరియాల పొడి- అర టీస్పూన్‌, ఉప్పు- తగినంత.

తయారీ: పెరుగును పలుచటి వస్త్రంలో మూటగట్టి రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. తర్వాత గిన్నెలోకి తీసుకుని మయోనైజ్‌ వేసి బాగా కలపాలి. దీంట్లో సన్నగా తరిగిన క్యాబేజీ, క్యారెట్‌, క్యాప్సికమ్‌ ముక్కలు, ఉడికించిన స్వీట్‌కార్న్‌ వేయాలి. తర్వాత మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. రెండు బ్రెడ్‌ స్లైస్‌లు తీసుకుని చివర్లను కత్తిరించాలి. ఒక ముక్క మీద పెరుగు మిశ్రమాన్ని అంతా పరచాలి. తర్వాత బ్రెడ్‌ను త్రికోణాకారంలో కోసి ముక్కలను ఒకదానిపై మరొకటి పెట్టాలి. అలాగే రెండో బ్రెడ్‌స్లైస్‌నూ చేసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని