సినీవాలి చెప్పింది...

అమావాస్య చివర్లో కనిపించే సన్నటి గీతలాంటి చంద్రవంకను సినీవాలి అంటారు. దీన్ని మన జీవితాలకు అన్వయించి చూస్తే అద్భుత సత్యం ఆవిష్కృతమవుతుంది. అజ్ఞానాంధకారంలోకి జారిపోతున్న మానవుడికి సినీవాలి ఓ నిదర్శనం.

Published : 12 Mar 2020 00:26 IST

మావాస్య చివర్లో కనిపించే సన్నటి గీతలాంటి చంద్రవంకను సినీవాలి అంటారు. దీన్ని మన జీవితాలకు అన్వయించి చూస్తే అద్భుత సత్యం ఆవిష్కృతమవుతుంది. అజ్ఞానాంధకారంలోకి జారిపోతున్న మానవుడికి సినీవాలి ఓ నిదర్శనం. ప్రతి మనిషీ వెలుగుల వైపు తన ప్రస్థానాన్ని అక్కడి నుంచి మొదలుపెట్టాల్సిందే. అలా జ్ఞానం కోసం అన్వేషించే మనిషికి ప్రతి తిధికీ చంద్రుడు పెరిగినట్లు ఆత్మజ్ఞానం క్రమంగా వికసిస్తుంది. పరిపూర్ణత సిద్ధించాక అది నిండు పున్నమిలా వర్థిల్లుతుంది.

- కె.రాఘవేంద్రబాబు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని