పరిశుభ్రతపరమ ధర్మం!

శుభ్రత... బాహ్యం, ఆంతరంగికం అని రెండు రకాలు. నిత్యం చేసే స్నానం బాహ్య శౌచాన్ని కలిగిస్తుంది....

Published : 26 Mar 2020 00:31 IST

శుభ్రత... బాహ్యం, ఆంతరంగికం అని రెండు రకాలు. నిత్యం చేసే స్నానం బాహ్య శౌచాన్ని కలిగిస్తుంది. మనసులోని అజ్ఞానాన్ని, ఆందోళనలను సాధన ద్వారా దూరం చేసుకోవడం ఆంతరంగిక శౌచం అవుతుంది. మనస్సు శుచిగా లేకపోతే శారీరక శుభ్రత ఎలాంటి ఫలితాన్నివ్వదు.

- జగద్గురు ఆదిశంకరాచార్య

శ్రీసూక్తంలో లక్ష్మీదేవి నివాసస్థానాలను వివరించే మంత్రాలున్నాయి. వాటిలో పదహారో మంత్రం ఇలా వివరిస్తుంది.

యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం

శ్రియః పంచదశశ్చంచ శ్రీకామస్సతతం జపేత్‌

లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ, ఆ దేవి 15 మంత్రాలను నిత్యం పారాయణం చేయాలని భావం. ఎక్కడ శుచిగా ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. లక్ష్మి అంటే ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా ధనమే. అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. శుభ్రత, శాంతి ఉన్నచోట అనారోగ్యం దరిచేరదు. అదే మహాభాగ్యం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని