అర్హత ఉందా?

ఒకరోజు బాగా చదువుకున్న ఓ యువకుడు అరుణాచలంలో రమణుల ఆశ్రమానికి వచ్చాడు. అతను మహర్షిని కలుసుకుని ‘రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందను ఆధ్యాత్మిక శిఖరంగా మలిచారు.

Published : 09 Apr 2020 01:01 IST

రమణీయం

కరోజు బాగా చదువుకున్న ఓ యువకుడు అరుణాచలంలో రమణుల ఆశ్రమానికి వచ్చాడు.

అతను మహర్షిని కలుసుకుని ‘రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందను ఆధ్యాత్మిక శిఖరంగా మలిచారు. స్పర్శతోనే నిర్వికల్ప సమాధి స్థితికి తీసుకెళ్లారు. భగవాన్‌! మీరు నాక్కూడా అలా చేయగలరా?’ అని ప్రశ్నించాడు.

కాసేపు మౌనంగా ఉన్న తర్వాత రమణులు నెమ్మదిగా అతనితో ‘అయితే నువ్వో వివేకానందవన్న మాట!’ అన్నారు.

ఆ యువకుడు ఏం చెప్పాలో తెలియక తికమకపడ్డాడు. ఆ గదిలో నుంచి నిష్క్రమించాడు.

అప్పుడు రమణులు అక్కడున్న భక్తులతో ‘ఆత్మవిమర్శ, ఆత్మవివేచన... వీటి అవసరాన్ని గుర్తించడం చాలా కష్టం. ఎవరికి వాళ్లే పరిపూర్ణులమనుకుంటారు. ఈ యువకుడికి నేను రామకృష్ణులులా శక్తిమంతుడినేనా అని పరీక్షించాలన్న కుతూహలం ఉందిగానీ, తాను వివేకానందుడిలా అర్హుడినేనా? అన్న వివేచన లేకపోయింది.

రామకృష్ణులు, వివేకానంద అరుదైన గురుశిష్యులు. రామకృష్ణులు తన అవతార లక్ష్యానికి వివేకానందనే ఎంచుకోడానికి కారణం ఆయన విశేషమైన ఆధ్యాత్మికోన్నతే’ అన్నారు.

-ఎ.ఎస్‌.మూర్తి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు