నోటి మాట... జారనీకు!

మంచిమాటలతో మనుషుల మధ్య స్నేహపు వంతెనలు నిర్మించవచ్ఛు ఇవి కొన్నిసార్లు మనసుల మధ్య అడ్డుగోడలు నిర్మించి....

Published : 07 May 2020 00:13 IST

క్రీస్తువాణి

మంచిమాటలతో మనుషుల మధ్య స్నేహపు వంతెనలు నిర్మించవచ్ఛు ఇవి కొన్నిసార్లు మనసుల మధ్య అడ్డుగోడలు నిర్మించి మారణహోమాన్ని కలిగిస్తాయి. శాంతియుత సహజీవనానికి, మనుషుల మానసిక వికాసానికి మంచి మాటలే ఆలంబన.

కసారి క్రీస్తు తన శిష్యులతో కలిసి ఒక గ్రామాన్ని సందర్శించాడు. సమయం మించిపోవడంతో శిష్యులు స్నానం చేయకుండానే భోజనానికి కూర్చున్నారు. ఆ రోజుల్లో యూదుల మతాచారం ప్రకారం.. భోజనానికి ముందు స్నానం చేయాలి. కనీసం శరీరంపై నీళ్లయినా చల్లుకోవాలి. వాటికి విరుద్ధంగా భోజనానికి ఉపక్రమించిన శిష్యులను చూసిన ఆనాటి మతపెద్దలకు అది రుచించలేదు. విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు క్రీస్తు వారితో.. ‘‘వెలుపలి నుంచి లోపలికి పోయి మనుషులను అపవిత్రులను చేసేది ఏదీ లేదు. కానీ లోపల నుంచి బయటకు వెళ్లినవే మనుషులను అపవిత్రులను చేస్తాయి’’ అన్నాడు. ఇక్కడ ప్రభువు ఉద్దేశంలో లోపల నుంచి బయటకు వెళ్లేది.. నోటిలో నుంచి వెలువడే మాట! ఇది హృదయంలో నుంచి వస్తుంది. లోపల ఉన్న దురాలోచనలు, వైషమ్యాలు, క్రోధం, అహం వంటివి మాటలుగా బయటపడి అవి మనుషులను అపవిత్రం చేస్తాయి. ఫలితం పరస్పర వైషమ్యంతో మిత్రులు, శత్రువులుగా మారే ప్రమాదం ఉందని ప్రభువు ప్రవచనంలోని పరమసత్యం..

- ఎమ్‌.సుగుణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు