ఈ రోజు మీదే!

ఒక విద్యార్థి.. మర్నాడు రాయబోయే పరీక్ష గురించి బెంగపెట్టుకున్నాడు. అంతకుముందు రోజు రాసిన పరీక్షలో ‘ఏమైనా తప్పులు రాశానా..’ అని కంగారుపడుతున్నాడు. అదే ఆలోచనల్లో ఆ రోజు జరిగిన ప్రయోగశాల పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. ముందు రోజు చేసిన పని గురించి..

Published : 05 Nov 2020 01:03 IST

క్రీస్తువాణి

క విద్యార్థి.. మర్నాడు రాయబోయే పరీక్ష గురించి బెంగపెట్టుకున్నాడు. అంతకుముందు రోజు రాసిన పరీక్షలో ‘ఏమైనా తప్పులు రాశానా..’ అని కంగారుపడుతున్నాడు. అదే ఆలోచనల్లో ఆ రోజు జరిగిన ప్రయోగశాల పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. ముందు రోజు చేసిన పని గురించి.. మరుసటి రోజు చేయాల్సిన పని గురించి.. ఆలోచిస్తూ వర్తమానంలో సరిగ్గా పని చేయలేరు. గతం, భవిష్యత్‌ కాలాల సుడిగుండంలో చిక్కుకునే వాళ్లు ఎందరో ఉంటారు. వీరిని ఉద్దేశిస్తూ క్రీస్తు ప్రభువు.. ‘‘రేపటి గురించి ఆలోచించవద్దు’’ అని సెలవిచ్చారు. భవిష్యత్‌ గురించి బాధపడవద్దని ప్రభువు చాలా బలంగా చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఏ రోజు కార్యాలు ఆ రోజు ఉంటాయి. రేపటి బెంగలను ఈ రోజులోకి లాగితే ఫలితం.. ఆందోళన, అనవసరపు పరిణామాలు మాత్రమే. గతం ఒక చరిత్ర. అంటే జరిగిపోయినది. భవిష్యత్‌ రహస్యం. రేపు ఏం జరుగుతుందో తెలియదు. మన చేతుల్లో ఉండేది ‘ఈ రోజు’ మాత్రమే. వర్తమానం దేవుడిచ్చిన బహుమతి. వర్తమానంలో జీవించాలి. కర్తవ్యాన్ని పాటించాలి. అలా జీవించగలిగితే గెలుపు మీదే!

- డాక్టర్‌ ఎమ్‌. సుగుణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని